Gangster Jitender: కోర్టు వద్ద సినీ పక్కీలో గ్యాంగ్ స్టర్ జిదేందర్‌పై కాల్పులు..! ముగ్గురు మృతి..!!

Share

Gangster Jitender: సినీ పక్కీలో లాయర్‌ల ముసుగులో వచ్చిన దుండగులు కోర్టు హాలు వద్ద కాల్పులకు తెగబడటంతో ఓ గ్యాంగ్ స్టర్ సహా మరో ఇద్దరు నిందితులు మృతి చెందారు. ఈ ఘటన దేశ రాజధాని ఢిల్లీలో శుక్రవారం జరిగింది. వివరాల్లోకి వెళితే.. కోర్టు వాయిదా నిమిత్తం గ్యాంగ్ స్టర్ జితేంద్ర (గోగి)ని శుక్రవారం ఢిల్లీ ప్రత్యేక విభాగం పోలీసులు రోహిణీ కోర్టుకు తీసుకువెళ్లారు. ఈ క్రమంలో న్యాయవాదుల దుస్తుల్లో వచ్చిన దుండగులు గోగిపై కాల్పులు జరిపారు. దీంతో అప్రమత్తమైన పోలీసులు వెంటనే ఎదురుకాల్పులు జరిపారు. పోలీసుల కాల్పుల్లో ఆ ఇద్దరు దుండగులు అక్కడికక్కడే మృతి చెందారు. దుండగుల కాల్పుల్లో గాయపడిన గ్యాంగ్ స్టర్ గోగీని ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. కాల్పుల్లో మరి కొందరు కూడా గాయపడినట్లు సమాచారం.

Delhi shots fired at rohini court premises Gangster Jitender killed
Delhi shots fired at rohini court premises Gangster Jitender killed

జితేంద్ర గోగీని వివిధ కేసుల కింద గత ఏడాది ఢిల్లీ పోలీస్ ప్రత్యేక విభాగం అరెస్టు చేసింది. అతనితో పాటు మరో ముగ్గురిని అదుపులోకి తీసుకుంది. అప్పటి నుండి వీరు జైలులోనే ఉన్నారు. శుక్రవారం నిందితులను పోలీసులు, మూడవ బెటాలియన్ దళాలు రోహిణి కోర్టుకు తీసుకువచ్చిన క్రమంలో ఈ కాల్పుల ఘటన జరిగింది. న్యాయవాదులు, విచారణకు వచ్చి కక్షిదారులతో కిక్కిరిసి ఉన్న కోర్టు ప్రాంగణంలో ఒక్కసారిగా కాల్పులు జరగడంతో అందరూ ఆందోళనకు గురైయ్యారు. ఈ ఘటనతో ఢిల్లీ రోహిణీ కోర్టు వద్ద భద్రతను పటిష్టం చేశారు, కోర్టులో అదనపు బలగాలను మోహరించారు. కాల్పుల ఘటనపై ఢిల్లీ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

రెండు గ్యాంగుల మధ్య విభేధాలే ఈ ఘటనకు కారణమని పోలీసులు ప్రాధమికంగా నిర్ధారణకు వచ్చార. కోర్టుకు తీసుకువచ్చిన జితేందర్ టార్గెట్ గా ఈ కాల్పులు జరిగాయి. జితేందర్ పై హత్యలు, హత్యాయత్నం సహా మొత్తం 19 కేసులు ఉన్నాయి.

 

 


Share

Related posts

YV Subbareddy: బాబాయ్ నీ టెన్షన్ పెట్టేస్తున్న అబ్బాయ్!సుబ్బారెడ్డిని సూపర్ సిఎం ఏం చేయబోతున్నారు ?

Yandamuri

YS Jagan : జ‌గ‌న్ పైకి అస‌దుద్దీన్‌…. కేసీఆర్ కొత్త టార్గెట్ ?!

sridhar

మీ భాగస్వామి దగ్గర ఇలా ఉంటే ఇకస్వర్గమే!!

Kumar