రాజస్థాన్, అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రాల్లో శనివారం అర్ధరాత్రి దాటిన తర్వాత, ఆదివారం వేకువ జామున స్వల్ప భూకంపాలు చోటుచేసుకున్నాయి. ప్రజలు గాఢ నిద్రలో ఉన్న సమయంలో భూమి కంపించడంతో ఒక్క సారిగా ఆందోళనకు గురైయ్యారు. ఇళ్ల నుండి బయటకు పరుగులు తీశారు. వివరాల్లోకి వెళితే.. రాజస్థాన్ లోని బికనేర్ ప్రాంతంలో భూకంపం సంభవించింది. అదివారం వేకువజామున 2.16 గంటలకు బేకనేర్ లో భూమి కంపించింది. రిక్టర్ స్కేల్ పై 4.2 తీవ్రతగా నమోదు అయినట్లు నేషనల్ సెంటర్ ఫర్ సీస్మోలజీ (ఎన్‌సీఎస్) తెలిపింది. భూఅంతర్భాగంలో ఎనిమిది కిలో మీటర్ల లోతులో కదలికలు చోటుచేసుకున్నాయని వెల్లడించింది. భూకంప కేంద్రం బికనేర్ లో ఉందని పేర్కొంది.

అంతకు ముందు అరుణాచల్ ప్రదేశ్ లోని ఛంగ్ లంగ్ జిల్లాలో కూడా భూమి స్వల్పంగా కంపించింది. వేకువజాము 1.45 గంటలకు భూకంపం సంభవించింది. దీని తీవ్రత 3.5 గా నమోదు అయ్యింది. భూమి పొరల్లో 76 కిలో మీటర్ల లోతులో కదలికలు సంభవించాయని ఎన్ సీ ఎస్ వెల్లడించింది. అర్ధరాత్రి వేళ భూమి కంపించడంతో ప్రజలు భయాందోళనకు గురైయ్యారు. ఇళ్ల నుండి జనాలు రోడ్లపైకి పరుగులు తీశారు. అయితే ఈ భూకంపం వల్ల ఆస్తినష్టంకు సంబంధించిన వివరాలు తెలియరాలేదు.
మయన్మార్ లో నిన్న భూకంపం సంభవించింది. మయన్మార్ లోని బర్మాకు ఉత్తరాన 106 కిలో మీటర్ల దూరంలో పది కిలో మీటర్ల లోతులో భూకంపం సంభవించింది. దీంతో పాటు ఛత్తీస్ గడ్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లోనూ శుక్రవారం ఉదయం రెండు సార్లు భూప్రకంపనలు సంభవించాయి. వరుసగా సంభవిస్తున్న భూకంపాలు ప్రజలను ఆందోళనకు గురి చేస్తున్నాయి.
Read More: ఏపి పొదుపు సంఘాలు దేశానికే రోల్ మోడల్ గా నిలుస్తున్నాయన్న సీఎం జగన్