NewsOrbit
జాతీయం న్యూస్ రాజ‌కీయాలు

కర్ణాటకలో ఒకే దశలో ఎన్నికలు.. షెడ్యూల్ విడుదల చేసిన ఈసీ..ఈ సారి ప్రత్యేకం ఏమిటంటే..?

Share

కర్ణాటక రాష్ట్రంలో ఒకే దశలో ఎన్నికలు జరగనున్నాయి. కర్ణాటకలో మొత్తం 224 అసెంబ్లీ స్థానాలు ఉండగా, ప్రస్తుత శాసనసభ గడువు మే 24వ తేదీతో ముగియనున్నది. ఈ నేపథ్యంలో ఏప్రిల్ ఎన్నికల నిర్వహణకు కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసింది. అసెంబ్లీ ఎన్నికల షెడ్యుల్ పై కేంద్ర ఎన్నికల సంఘం ఇవేళ మీడియా సమావేశం నిర్వహించింది. ఏప్రిల్ 13న అసెంబ్లీ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల చేయనున్నారు. మే 10న పోలింగ్, 13న కౌంటింగ్ నిర్వహించి ఫలితాలను వెల్లడించనున్నారు. నేటి నుండి కర్ణాటకలో ఎన్నికల కోడ్ అమలు లోకి వస్తుందని ఈసీ తెలిపింది.

Election commission

 

ఈ సందర్భంగా కేంద్ర ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్ మీడియాతో మాట్లాడుతూ.. కర్ణాటకలో మొత్తం 5.21 కోట్ల మంది ఓటర్లు ఉన్నారన్నారు. మహిళ, పురుష ఓటర్లు దాదాపు సమానమని తెలిపారు. అయితే ఈ సారి ప్రత్యేకంగా 80 ఏళ్లు పైబడి వారికి ఇంటి నుండే ఓటు వేసే సదుపాయం కల్పిస్తున్నట్లు తెలిపారు. వీరి సంఖ్య 12.15 లక్షలుగా ఉన్నట్లు చెప్పారు. దివ్యాంగులకు కూడా ఇంటి వద్దే ఓటు వేసే సదుపాయం కల్పించామన్నారు.  గిరిజన ఓటర్ల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లుగా వెల్లడించారు. రాష్ట్ర వ్యాప్తంగా 41,312 మంది ట్రాన్స్ జెండర్లు ఉన్నారనీ తెలిపారు. కర్ణాటకలో 224 స్థానాలకు గానూ 36 ఎస్సీ, 15 ఎస్టీ, 173 జనరల్ స్థానాలుగా నిర్ణయించినట్లు తెలిపారు. కర్ణాటకలో 58,282 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశామన్నారు.

ఎన్నికల షెడ్యుల్ విడుదల కానప్పటికీ ఇప్పటికే రాష్ట్రంలో ప్రధాన రాజకీయ పక్షాలు అన్నీ ఎన్నికల జోరు పెంచాయి. ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెస్, జేడీఎస్ పార్టీలతో పాటు మైనింగ్ కింగ్ గాలి జనార్థన్ రెడ్డి తమ పార్టీ అభ్యర్ధుల తొలి జాబితాను విడుదల చేశాయి. కర్ణాటకలో గత అసెంబ్లీ ఎన్నికల తర్వాత అనేక నాటకీయ పరిణామాలు చోటుచేసుకున్న సంగతి తెలిసిందే. ఆ ఎన్నికల్లో ఏ పార్టీకి స్పష్టమైన అధిక్యం రాకపోవడంతో తొలుత బీజేపీ నేతృత్వంలో ప్రభుత్వం ఏర్పటైంది. యడియూరప్ప సీఎంగా ప్రమాణ స్వీకారం చేశారు. అయితే అసెంబ్లీలో బల నిరూపణ చేసుకోలేక మూడు రోజులకే ఆయన తప్పుకున్నారు. ఆ తర్వాత కాంగ్రెస్ – జేడీఎస్ కలిసి సంకీర్ణ సర్కార్ ఏర్పడింది. అయితే ఏడాది లోపే ఎమ్మెల్యేల తిరుగుబాటులో కుమార స్వామి నేతృత్వంలోని సంకీర్ణ సర్కార్ కూలిపోయింది. ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీలోని పలువురు ఎమ్మెల్యేలు బీజేపీలో చేరడంతో యడియూరప్ప ముఖ్యమంత్రిగా మళ్లీ బీజేపీ సర్కార్ ఏర్పాటైంది. అ తర్వాత బీజేపీ అధినాయకత్వం ఆదేశాలతో యడియూరప్ప సీఎం పదవికి రాజీనామా చేయగా, బసవరాజు బొమ్మై ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన కొనసాగుతున్నారు.

జరగబోయే ఎన్నికల్లో మళ్లీ గెలిచి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని బీజేపీ వ్యూహాలను రచిస్తుండగా, రాష్ట్రాన్ని తిరిగి హస్తగతం చేసుకోవాలని కాంగ్రెస్ పార్టీ విశ్వప్రయత్నాలు చేస్తొంది. మరో వైపు కుమార స్వామి నేతృత్వంలోని జేడీఎస్ మళ్లీ కింగ్ మేకర్ కావాలని ఆకాంక్షిస్తొంది. ప్రస్తుతం కర్ణాటక అసెంబ్లీలో బీజేపీ సంఖ్యా బలం 119 కాగా, కాంగ్రెస్ కు 75, జీడీఎస్ కు 28 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు.

AP CM YS Jagan: నేడు మరో సారి హస్తినకు పయనం.. ఈ కీలక అంశాలపైనే..?

 


Share

Related posts

MP RRR Case: రఘురామ కేసులో మరో ట్విస్ట్..! సీఐడీ అడిషినల్ డీజీకి లీగల్ నోటీసు..! ఎందుకంటే..?

somaraju sharma

విద్యా సంస్కరణ దిశగా కీలక నిర్ణయం తీసుకున్న జగన్

venkat mahesh

బిగ్ బాస్ 4 : ఈ స్ట్రాంగ్ కంటెస్టెంట్ పై బిగ్ బాస్ కుట్ర…? ఏం చేశాడో మీరే చూడండి…!

arun kanna