NewsOrbit
జాతీయం తెలంగాణ‌ న్యూస్

Loan App Case: ఈడీలోనూ అవినీతి తిమింగళం..! కేసు నమోదు చేసిన సీబీఐ..!!

Loan App Case: లంచం..లంచం..లంచం..భారతదేశాన్ని పట్టి పీడిస్తోంది. అవినీతి జబ్బు దాదాపుగా అన్ని శాఖల్లోనూ పెనవేసుకుని పోయింది.  లంచం ద్వారా ఏ స్థాయి అధికారిని అయినా మేనేజ్ చేయవచ్చనేది అక్రమార్కుల స్ట్రాటజీ. ఏ శాఖలో చూసుకున్నా కొందరు అవినీతి అధికారులు కనబడుతూనే ఉంటారు. ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే ఏ శాఖలో చూసుకున్నా అవినీతి పరులు కనబడుతూనే ఉన్నారు. తమ శాఖలో ఒక్కరు కూడా అవినీతి పరులు లేరు అని చెప్పే అధికారులు లేరు.  అవినీతి జాఢ్యం అంతగా పెరిగిపోయింది. ఎంతో ప్రతిష్టాత్మకంగా భావించే కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ)లోనే గతంలో ఇద్దరు అధికారులు ఒకరిపై ఒకరు తీవ్ర ఆరోపణలతో ఫిర్యాదులు చేసుకున్న సందర్భాలు ఉన్నాయి. తాజాగా ఇప్పుడు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ)లోని ఒ అధికారి అవినీతి బాగోతం బట్టబయలు అయ్యింది. ఈడీ అధికారే లంచం తీసుకున్నారని వెలుగులోకి రావడం, సీబీఐ అధికారులు ఆ అధికారిపై కేసు నమోదు చేయడం తీవ్ర సంచలనం అయ్యింది.

ED Official takes bribe from Loan App Case
ED Official takes bribe from Loan App Case

Read More: Wife Return to Home after Funerals: కరోనాతో చనిపోయింది..! కర్మకాండలు పూర్తి అయ్యాయి..! తాపీగా నేడు ఆమె ఇంటికి వచ్చింది..! అదేలానో చూడండి..!!

విషయం ఏమిటంటే…రెండు తెలుగు రాష్ట్రాల్లో కొద్ది నెలల క్రితం రుణ యాప్స్ దురాగతాలు వెలుగుచూసిన సంగతి సంగతి తెలిసిందే. ఆ కేసుల్లో భాగంగా రుణ యాప్ సంస్థల బ్యాంకు ఖాతాలను దర్యాప్తు అధికారులు స్తంబింపజేశారు. ఆర్థిక నేరాలకు సంబంధించిన విషయం కావడంతో ఈ కేసులపై ఈడీ కూడా దృష్టి సారించింది. ఈడీ కూడా కేసు నమోదు చేసి వారిపై చర్యలు తీసుకుంటుంది సీసీఎస్ అధికారులు అనుకున్నారు. అయితే   స్తంభింపజేసిన బ్యాంక్ అకౌంట్‌ల నుండి నగదు డ్రా చేసినట్లు తెలియడంతో సీసీఎస్ అధికారులకు అనుమానం వచ్చింది. దీనిపై వారు ఆరా తీయగా ముంబాయికి చెందిన అపోలో పిన్ వెస్ట్ లోన్ యాప్ సంస్థ ఎండీ నుండి ఈడీ అధికారి లలిత్ బజార్డ్ రూ.5 లక్షలు లంచం తీసుకున్నట్లు గుర్తించారు.

ED Official takes bribe from Loan App Case
ED Official takes bribe from Loan App Case

రుణ యాప్ కేసులో సీసీఎస్ అధికారులు స్తంభింపజేసిన బ్యాంకు ఖాతాలను తెరిపించేందుకు లంచం తీసుకున్నారనీ, ఆ క్రమంలోనే ఈడీ అధికారి లలిత్ పలు బ్యాంకులకు తప్పుడు పత్రాల ఇచ్చి ఖాతాలను తెరిపించి, డబ్బులు విడుదల చేయించినట్లు తెలుసుకున్నారు. దీంతో ఈ అవినీతి ఈడీ అధికారిపై సీబీఐకి సీసీఎస్ పోలీసులు సమాచారం అందించారు.

సీబీఐ అధికారులు రంగ ప్రవేశం చేసి విచారణ చేయగా బెంగళూరులోని పలు బ్యాంకు ఖాతా నుండి లావాదేవీలు జరిగినట్లు నిర్ధారణ అయ్యింది. దీనిలో ఈడి అధికారి లలిత్ బజార్డ్ పాత్ర ఉన్నట్లు గుర్తించిన సీబీఐ బెంగళూరులో కేసు నమోదు చేసింది.

author avatar
sharma somaraju Content Editor

Related posts

YSRCP: జగన్ చేతిలో చంద్రబాబు కూటమి మేనిఫెస్టో

sharma somaraju

Lok Sabha Election 2024: ప్రశాంతంగా  ముగిసిన తొలి దశ పోలింగ్ .. పోలింగ్ శాతం ఎంతంటే..?

sharma somaraju

TDP: జోగికి షాక్ ఇచ్చిన వసంత కృష్ణప్రసాద్ .. మంత్రి బావమరుదులకు టీడీపీ కండువా కప్పి..

sharma somaraju

Ram Pothineni: షాకిస్తున్న రామ్ రెమ్యున‌రేష‌న్‌.. అగ్ర హీరోల‌నే మించిపోతున్నాడుగా!?

kavya N

Lok Sabha Elections 2024: తెలుగు రాష్ట్రాల్లో అట్టహాసంగా ప్రముఖుల నామినేషన్లు

sharma somaraju

లాస్ట్ మినిట్‌లో టీడీపీలో మారిన సీట్లు… వాళ్ల‌కు షాక్‌లు.. వీళ్ల‌కు స్వీటు…!

YS Viveka Case: కడప కోర్టు ఆదేశాలపై హైకోర్టుకు – సునీత

sharma somaraju

Lok sabha Election: సస్పెన్షన్ ఉద్యోగులకు బిగ్ రిలీఫ్ ..సిద్దిపేట లో సెర్ప్ ఉద్యోగుల సస్పెన్షన్ పై హైకోర్టు స్టే

sharma somaraju

Manamey Teaser: ఆక‌ట్టుకుంటున్న శ‌ర్వానంద్ `మ‌న‌మే` టీజ‌ర్.. ఇంత‌కీ ఆ బుజ్జిబాబు ఎవ‌రంటే?

kavya N

Tollywood Actors: టాలీవుడ్ లో ఎక్కువ ఇండ‌స్ట్రీ హిట్స్ అందుకున్న టాప్‌-5 హీరోలు వీళ్లే.. ఫ‌స్ట్ ప్లేస్‌లో ఉన్న‌ది ఎవ‌రంటే?

kavya N

Nikhil Siddhartha: తండ్రి అయ్యాక ఆ అల‌వాటు వ‌దిలేసిన నిఖిల్‌.. ఇంత‌కీ ఈ హీరోగారి కొడుకు పేరేంటో తెలుసా?

kavya N

Keerthy Suresh: శంక‌ర్ కూతురి పెళ్లిలో కీర్తి సురేష్ క‌ట్టుకున్న చీర ఎన్ని ల‌క్ష‌లో తెలిస్తే క‌ళ్లు తేలేస్తారు!

kavya N

ఏపీలో స‌ర్వేలు – సంగ‌తులు: ఒకే రోజు రెండు డిఫ‌రెంట్ స‌ర్వేలు… ఏది నిజం.. ఏది అబ‌ద్ధం…?

నామినేష‌న్లు మొద‌ల‌య్యాయ్‌… జ‌గ‌న్‌, బాబుకు కొత్త త‌లనొప్పి స్టార్ట్…!

వైసీపీలో ఈ లీడ‌ర్లు మామూలు ల‌క్కీ కాదుగా… న‌క్క తోకే తొక్కారు…!