NewsOrbit
జాతీయం న్యూస్

ED Summons Sonia Gandhi, Rahul: సోనియా, రాహుల్ గాంధీలకు ఈడీ సమన్లు..ఎందుకంటే..?

ED Summons Sonia Gandhi, Rahul

ED Summons Sonia Gandhi, Rahul: కాంగ్రెస్ పార్టీ అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీలకు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) బుధవారం సమన్లు జారీ చేసింది. కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలోని నేషనల్ హెరాల్డ్ వ్యవహారానికి సంబంధించిన విచారణ జరుపుతున్నామనీ, ఈ కేసులో రేపు (గురువారం) తమ ముందు విచారణకు హజరు కావాలని రాహుల్ గాంధీని ఈడీ ఆదేశించింది. అదే విధంగా ఈ నెల 8వ తేదీన తమ ముందు విచారణకు హజరుకావాలని సోనియా గాంధీని ఆ సంస్థ కోరింది. ఈ విచారణకు సోనియా గాంధీ హాజరై అన్ని వివరాలు అందిస్తారని ఆ పార్టీ వర్గాలు తెలిపాయి. అయితే ఈడీ సోనియా గాంధీ, రాహుల్ గాంధీలకు నోటీసులు ఇవ్వడంపై కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా స్పందించింది. ప్రజా వ్యతిరేక ఉద్యమ స్వరాన్ని అణచివేసేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రయత్నిస్తొందని కాంగ్రెస్ పార్టీ ఆరోపించింది. మోడీ పెంపుడు సంస్థగా ఈడీ పని చేస్తోందని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి రణదీప్ సుర్జీవాలా ఘాటుగా విమర్శించారు. ఇద్దరు ప్రముఖ నేతలకు నోటీసులు ఇవ్వడాన్ని పిరికిపంద చర్యగా ఆయన అభివర్ణించారు.

ED Summons Sonia Gandhi, Rahul
ED Summons Sonia Gandhi Rahul

ED Summons Sonia Gandhi, Rahul: కేసు ఏమిటి అంటే..?

నేషనల్ హెరాల్డ్ పత్రిక కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో గతంలో నడిచింది. ప్రస్తుతం ఈ పత్రికను పార్టీ మూసేసింది. అయితే ఈ సంస్థకు దేశ రాజధాని ఢిల్లీ సహా పలు ఇతర ప్రాంతాల్లో అత్యంత విలువైన ఆస్తులు ఉన్నాయి. కాంగ్రెస్ కు నేషనల్ హెరాల్డ్ పత్రిక బకాయి ఉన్న రూ.90.25 కోట్లను వసూలు చేసుకునే హక్కును పొందేందుకు యంగ్ ఇండియా ప్రైవేటు లిమిటెడ్ ద్వారా నేరపూరితమైన కుట్ర పన్నారని బీజేపీ నేత సుబ్రమణ్యస్వామి గతంలో ఆరోపించారు. ఇందుకు సంబంధించి సోనియా గాంధీ, రాహుల్ సహా ఏడుగురిపై ఢిల్లీలోని అడిషనల్ చీఫ్ మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ కోర్టులో స్వామి పిటిషన్ దాఖలు చేశారు. కేవలం రూ.50లక్షల చెల్లింపుతో ఆ హక్కును పొందేందుకు వారు యత్నించారని పిటిషన్ లో స్వామి ఆరోపించారు. ఈ కేసు విచారణలో భాగంగా ఇటీవలే కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతలు మల్లికార్జున్ ఖర్గే, పవన్ బన్సల్ ను ఈడీ విచారించింది. ఇప్పుడు సోనియా గాంధీ, రాహుల్ గాంధీలను విచారించేందుకు ఈడీ నోటీసులు జారీ చేసింది.

 

author avatar
sharma somaraju Content Editor

Related posts

Pawan Kalyan: రేపు పిఠాపురానికి పవన్ కళ్యాణ్.. తొలి విడత ఎన్నికల ప్రచారం షెడ్యూల్ ఇలా..

sharma somaraju

Revanth Reddy: ఫోన్ ట్యాపింగ్ పై తొలి సారి స్పందించిన సీఎం రేవంత్ ..చర్లపల్లిలో చిప్పకూడు తప్పదు అంటూ కీలక వ్యాఖ్యలు

sharma somaraju

TDP Leaders Protest: అనంత టీడీపీలో భగ్గుమన్న అసమ్మతి .. పార్టీ కార్యాలయం ధ్వంసం .. బ్యానర్లు, ఫ్లెక్సీలకు నిప్పు

sharma somaraju

Ranbir Kapoor: కూతురు రాహాకు ల‌గ్జ‌రీ బంగ్లాను గిఫ్ట్‌గా ఇచ్చిన‌ రణ‌బీర్ కపూర్.. ఎన్ని కోట్లో తెలిస్తే క‌ళ్లు చెదిరిపోతాయ్‌!!

kavya N

TDP: 4 లోక్ సభ, 9 అసెంబ్లీ స్థానాలకు అభ్యర్ధులను ప్రకటించిన టీడీపీ .. కోరుకున్న స్థానాన్ని దక్కించుకున్న గంటా

sharma somaraju

Tamannaah: త‌మ‌న్నాకు మ‌రో పేరు ఉందా.. ఫ్యాన్స్ కు కూడా తెలియ‌ని సీక్రెట్ ఇది..!!

kavya N

Vishwak Sen: విశ్వ‌క్ సేన్ బ‌ర్త్‌డే స్పెష‌ల్‌.. మాస్ కా దాస్ బ్యాక్‌గ్రౌండ్ ఏంటి.. సినిమాల్లోకి రాక ముందు ఏం చేసేవాడో తెలుసా?

kavya N

Congress: కాంగ్రెస్ పార్టీకి మరో సారి షాక్ ఇచ్చిన ఐటీ .. రూ.1700 కోట్ల పన్ను నోటీసులు

sharma somaraju

Surekha Vani: మా అమ్మ‌కు మ‌ళ్లీ పెళ్లి చేస్తానంటున్న సురేఖా వాణి కూతురు.. ఎలాంటి అబ్బాయి కావాలో చెప్పేసిన సుప్రీత!

kavya N

BRS MP: సీఎం రేవంత్ రెడ్డితో బీఆర్ఎస్ ఎంపీ కే కేశవరావు భేటీ .. తండ్రీ, తనయ కాంగ్రెస్ లో చేరికకు ముహూర్తం ఖరారు

sharma somaraju

Legend: 10 ఏళ్లు పూర్తి చేసుకున్న లెజెండ్‌.. అప్ప‌ట్లో ఈ చిత్రం ఎన్ని కోట్లు రాబట్టిందో తెలుసా?

kavya N

Elon Musk: ఆ ఎక్స్ యూజర్లలకు ‘మస్క్’ గుడ్ న్యూస్

sharma somaraju

విజ‌య‌వాడ ప‌శ్చిమ‌లో ‘ సుజ‌నా చౌద‌రి ‘ గెల‌వాలంటే ఈ అద్భుతం జ‌ర‌గాల్సిందే..!

విజ‌య‌వాడ‌లో కూట‌మి ఇలా చేసేంటే అదిరేదిగా… ఈ కామ‌న్ సెన్స్ కూడా లేకుండా పాయే..!

కొలిక‌పూడి శ్రీను సీటు కూడా చంద్ర‌బాబు పీకేస్తున్నాడా…!