Election Commission: భారత ఉప రాష్టపతి ఎన్నికకు కేంద్ర ఎన్నికల కమిషన్ బుధవారం సాయంత్రం నోటిఫికేషన్ విడుదల చేసింది. నేటి నుండి ఈ నెల 29వ తేదీ వరకూ నామినేషన్లు స్వీకరించనున్నారు. 30న నామినేషన్లు పరిశీలన జరుగుతుంది. జూలై 2వ తేదీ వరకూ నామినేషన్ ల ఉపసంహరణ గడువుగా నిర్ణయించారు. నామినేషన్లు ఉప సంహరణకు గడువు మిగిసిన వెంటనే బరిలో ఉన్న అభ్యర్ధుల జాబితాను ఎన్నికల సంఘం అధికారికంగా ప్రకటించనుంది. రాష్ట్రపతి ఎన్నికకు ఒకరి కంటే ఎక్కువ మంది బరిలో ఉన్న పక్షంలో జూలై 18న పోలింగ్ నిర్వహిస్తారు. జూలై 21న కౌంటింగ్ నిర్వహించి అదే రోజు విజేతను ప్రకటిస్తారు.

- Read the latest news in Telugu from AP and Telangana’s most trusted news website.
- Follow us on facebook , Twitter , instagram and Googlenews
ప్రస్తుత రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ పదవీ కాలం జూలై 24తో ముగుస్తుంది. రహస్య బ్యాలెట్ విధానంలో ఈ ఎన్నికలు జరుగుతాయి. లోక్ సభ, రాజ్యసభ, శాసనసభ సభ్యులతో కూడిన ఎలక్టోరల్ కాలేజీ ద్వారా రాష్ట్రపతి ఎన్నికవుతారు. ఢిల్లీ, పుదుచ్చేరి శాసనసభల సభ్యులు కూడా తమ ఓటు హక్కును వినియోగించుకుంటారు. రాజ్యసభ సెక్రటరీ జనరల్ ఈ ఎన్నికలకు రిటర్నింగ్ అధికారిగా వ్యవహరిస్తారు. పార్లమెంట్ హౌస్, రాష్ట్రాల శాసనసభల్లో పోలింగ్ జరుగుతుంది. ఈ ఎన్నికల్లో 776 మంది ఎంపీలు, 4,033 మంది ఎమ్మెల్యేలు ఓటు వేసేందుకు అర్హులు కాగా మొత్తం ఓట్ల విలువ 10,86,431.