జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ కు ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) సమన్లు జారీ చేసింది. మనీలాండరింగ్ కేసులో దర్యాప్తునకు హజరు కావాలని పేర్కొంది. ఈ నెల 24న విచారణకు హజరు కావాలని నోటీసులో ఈడీ తెలిపింది. సీఎం సోరెన్ కు ఈడీ ఇటీవల సమన్లు జారీ చేయడం ఇదే రెండో సారి. భూకుంభకోణం కేసులో దర్యాప్తునకు ఈ నెల 14వ తేదీన హజరుకావాలని అంతకు ముందు సోరెన్ కు ఈడీ సమన్లు జారీ చేసింది. అయితే ఆయన విచారణకు హజరుకాలేదు.

స్వాతంత్ర దినోత్సవాల కోసం తీరిక లేకుండా పని చేస్తున్నాననీ, అందు వల్ల తాను దర్యాప్తునకు హజరు కాలేనని ఈడీకి సమాచారం ఇచ్చారు సీఎం. స్వాతంత్ర దినోత్సవాలకు ఒక్క రోజు ముందు రావాలని తనను పిలవడం తనను ఆశ్చర్యానకి గురి చేసిందన్నారు సోరెన్. “మీకు, మీ రాజకీయ యజమానులకు తెలుసు కదా.. రా,ట్ర ముఖ్యమంత్రిగా నేను స్వాతంత్ర్య దినోత్సవ కార్యక్రమాల్లో తీరిక లేకుండా పని చేస్తున్నానని” అని దుయ్యబట్టారు సోరెన్. తాను కేంద్రానికి అనుకూలంగా లేనందువల్లే తనను కేంద్ర దర్యాప్తు సంస్థలు లక్ష్యంగా చేసుకున్నాయని ఆరోపించారు సీఎం సోరెన్.

సాహెబ్ గంజ్ లో చట్ట విరుద్దంగా గనులను తవ్వినందుకు కేసు నమోదైంది. దాదాపు వెయ్యి కోట్ల విలువైన గనులను అక్రమంగా తవ్వినట్లు ఆరోపణలు నమోదు అయ్యాయి. ఈ కేసులో గత ఏడాది నవంబర్ లో సోరెన్ ను ఈడీ ప్రశ్నించింది. ఆయన సన్నిహితుడు పంకజ్ మిశ్రాను ఈడీ అరెస్టు చేసింది. గ్రామీణ ఉపాధి హామీ పథకం నిధులు పక్కదారి పట్టినట్లు నమోదైన కేసులో కూడా ఈడీ దర్యాప్తు చేస్తొంది. అయితే తాజా సమన్లకు స్పందించి ఈ నెల 24వ తేదీన దర్యాప్తునకు హజరు అవుతారా లేదా అనే విషయం ఇంకా తెలియరాలేదు.
తెలంగాణలో ఏపీ ఎమ్మెల్యే కారుకు ప్రమాదం.. కాన్వాయ్ లో కార్లు ఢీ .. ఎమ్మెల్యేకి తప్పిన ప్రమాదం