23.2 C
Hyderabad
December 6, 2022
NewsOrbit
జాతీయం న్యూస్ రాజ‌కీయాలు

జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్ కు ఈడీ షాక్ .. విచారణకు హజరు కావాలంటూ నోటీసులు

Share

అక్రమ మైనింగ్ స్కామ్ కేసులో జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ కు ఎన్‌ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) షాక్ ఇచ్చింది. సోరెన్ కు ఈడీ నోటీసులు జారీ చేసింది. గురువారం విచారణకు హజరు కావాలని నోటీసులో పేర్కొంది. ఇదే కేసులో ఇంతకు ముందు సోరెన్ సన్నిహితుడు పంకజ్ మిశ్రాను ఈడీ అరెస్టు చేయగా, అతనిపై మనీ లాండరింగ్ కేసును అధికారులు నమోదు చేశారు. జూలై నెలలో రాష్ట్ర వ్యాప్తంగా 18 ప్రదేశాల్లో దాడులు నిర్వహించింది. మిశ్రాతో పాటు అతని భాగస్వాముల ఇళ్లు, కార్యాలయాలపై దాడులు చేసి సోదాలు జరిపింది. ఆ క్రమంలో 50 బ్యాంక్ అకౌంట్లలో రూ.13.32 కోట్ల నగదును సీజ్ చేసింది ఈడీ.

CM Hemanth Soren

 

సీఎం సోరెన్ తో పాటు జార్ఖండ్ క్యాడర్ ఐఏఎస్ అధికారిణి పూజా సింఘాల్ నివాసంలో కూడా మే నెలలో ఈడీలు తనిఖీలు చేయడం తీవ్ర సంచలనం రేపింది. అప్పట్లోనే సోరెన్ ఎన్నికల నియమావళి ఉల్లంఘించి తనకు తాను గనులను కేటాయించుకున్నారని, సీఎం సోరెన్ ను ఎమ్మెల్యే పదవి నుండి తప్పించాలంటూ కేంద్ర ఎన్నికల సంఘం రాష్ట్ర గవర్నర్ కు సూచించిన విషయం తెలిసిందే. అయితే ఈడీ నోటీసులపై సీఎం హేమంత్ సోరెన్ ఏ విధంగా స్పందిస్తారు..విచారణకు హజరు అవుతారా లేదా అనే దానిపై ఇంకా స్పష్టత రాలేదు.

అమరావతి రైతుల మహా పాదయాత్రపై ఏపి హైకోర్టులో ఇరుపక్షాలకు చుక్కెదురు


Share

Related posts

అలసిన కంటిని ఇలా కాపాడుకోండి!!

Kumar

అంత‌ర్జాతీయ స్థాయికి జ‌గ‌న్ రేంజ్‌… టీడీపీ వ‌ల్లే… ఇది టూ మ‌చ్ క‌దా?

sridhar

కనకదుర్గమ్మకు పట్టువస్త్రాలు సమర్పించిన సీఎం జగన్

somaraju sharma