Covid XBB: కరోనా కొత్త వేరియంట్ పై అసలు నిజాలు కంటే అసత్య ప్రచారాలే ప్రజలు ఆందోళనకు గురి చేస్తున్నాయి. అదుగో పులి అంటే ఇదుగో తోక అన్నట్లుగా చైనా సహా పలు దేశాల్లో కరోనా ఒమిక్రాన్ సబ్ వేరియంట్ హెచ్ బీ 7 వేగంగా వ్యాప్తి చెందుతూ అటు ప్రభుత్వాలను, ఇటు ప్రజలను తీవ్ర ఆందోళనకు గురి చేస్తుండగా, సోషల్ మీడియాలో అసలు ఉనికిలో లేని వేరియంట్ పేరు చెప్పి తప్పుడు ప్రచారాలను చేస్తూ ప్రజలను ఆందోళనకు గురి చేస్తున్నారు. ప్రమాదకరమైన ఎక్స్ బీబీ వేరియంట్ దేశంలో తీవ్రంగా వ్యాపిస్తోందంటూ వాట్సాప్ లో వచ్చిన సమాచారం తీవ్ర కలకలాన్ని రేపింది. అయితే ప్రచారంపై కేంద్ర ఆరోగ్య శాఖ వెంటనే స్పందించి. ఈ సమాచారం నకీలీదని కేంద్ర ఆరోగ్య శాఖ స్పష్టం చేసింది. దీంతో జనం ఊపిరి పీల్చుకుంటున్నారు.

ఒమిక్రాన్ సబ్ వేరియంట్ బీఎఫ్ 7పై అప్రమత్తంగా ఉండాలని సూచనలు చేస్తే తప్పులేదు కానీ లేని వేరియంట్ గురించి తప్పుడు ప్రచారం చేస్తూ ప్రజలను ఆందోళనకు గురి చేయడం సరికాదు. పండుగల వేళ అందరూ ఆనందంగా గడుపుతున్న తరుణంలో ‘అమ్మో మళ్ళీ వైరస్’ అంటూ భయపెట్టేలా కొందరు సోషల్ మీడియాలో మెసేజెస్ లను పెడుతున్నారు. ఇది ఫేక్ అనేది తెలియక చాలా మంది ఆందోళన చెందారు. వైరస్ విషయంలో అప్రమత్తంగా ఉండడం ఎంత అవసరమో అనవసర భయాలతో బేంబేలెత్తకుండా ఉండడం కూడా అంతే ముఖ్యం. ఎక్స్ బీ వేరియంట్ అంటూ ఇప్పటి వరకూ జరిగిన ప్రాచరం మొత్తం తప్పని తెలుస్తోంది.
ఒమిక్రాన్ కంటే ఇది ప్రమాదకరమైనదని చెప్పడానికి ఎటువంటి ఆధారం లేదని ప్రపంచ ఆరోగ్య సంస్థ ( డబ్ల్యూ హెచ్ ఓ ) ఇది వరకే పేర్కొంది. దీని ప్రమాద స్థాయి డెల్టా వేరియంట్ కంటే కూడా తక్కువేనని తెలిపింది. ఒమిక్రాన్ కంటే వేగంగా వ్యాప్తి ఉన్నప్పటికీ తీవ్రత మాత్రం తక్కువేనని పలు నివేదికలు చెబుతున్నాయి. అదే సమయంలో చైనా విజృంభణకు బీ ఎఫ్ 7 కారణం కాదని ఈ నివేదికలు పేర్కొంటున్నాయి. దగ్గు, జ్వరం, వంటి లక్షణాలు ఏమీ లేకుండానే వైరస్ ప్రభావం చూపుతుందని, కొత్త వేరియంట్ వల్ల కీళ్ల నొప్పులు, తలనొప్పి, మెడ, వెన్ను నొప్పులు వస్తున్నాయి అంటూ ఈ లేఖ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అయితే ఇది ఫేక్ అని కేంద్ర వైద్య ఆరోగ్య స్పష్టం చేసింది. అందులో ఉన్న విషయాలు అన్నీ ప్రజలను తప్పుదోవ వట్టించేలా ఉన్నాయని తెలిపింది.