FIH India Women’s National Field Hockey Team: FIH ఒలింపిక్ క్వాలిఫైయర్స్ జనవరి 13 నుంచి 19 వరకు రాంచి లో జరగనున్నాయి…అయితే ఈ సారి భరత్ మహిళా జట్టుకు పెద్ద కష్టమే వచ్చింది, ఇండియా లెగ్ లో భాగంగా భారత్ మహిళా జట్టు న్యూజిలాండ్, జపాన్, చిలి, యునైటెడ్ స్టేట్స్, ఇటలీ,చెక్ రిపబ్లిక్, జర్మనీ లతో తలపడాల్సి ఉంది.

FIH ఒలింపిక్ క్వాలిఫైయర్స్ ఇండియా లెగ్ లో భాగంగా రాంచి లో తలపడే టీంలలో భారత మహిళా జట్టు రెండవ బెస్ట్ టీం అని చెప్పాలి… ప్రపంచ ర్యాంకింగ్స్ లో 6వ స్థానంలో ఉన్న ఇండియా టీం 9వ స్థానం లో ఉన్న న్యూజీలాండ్ లేదా ఇంకా కింద స్థానాలలో ఉన్న జపాన్(11 వ స్థానం), యునైటెడ్ స్టేట్స్(15వ స్థానం) లాంటి టీమ్స్ గురించి అంత ఎక్కువ ఆలోచించాల్సిన అవసరం లేదు…కానీ ప్రపంచ ర్యాంకింగ్స్ లో 5వ స్థానంలో ఉన్న జర్మనీ ని ఎదురుకోవడం మాత్రం కష్టమైన పని అని చెప్పాలి.
ఇండియా మహిళా హాకీ జట్టు జనెకా షోప్మన్ ఇప్పటికే ఆసియన్ గేమ్స్ లో చైనా పై ఓడిపోయినందుకు చాలా విమర్శలు ఎదురుకుంటుంది…తాము చైనా పై జరిగిన మ్యాచ్ లో సరిగ్గా ఆడలేదు అని కెప్టెన్ సవితా పూనియా కూడా ఒప్పుకుంది. అందుకే ఇప్పుడు జర్మనీ తో జరిగే మ్యాచులు పైనే అందరి దృష్టి. FIH ఒలింపిక్ క్వాలిఫైయర్స్ మహిళా మ్యాచులు మరో లెగ్ వాలెన్సియా స్పెయిన్ లో జరగనున్నాయి.