పంజాబ్ బఠిండాలో కాల్పులు కలకలం రేపాయి. ఓ సైనిక స్థావరంపై కాల్పులు జరిగాయి. మిలిటరీ స్టేషన్ పై ఆగంతకులు కాల్పులు జరపడంతో నలుగురు మృతి చెందగా, పలువురు గాయపడినట్లు తెలుస్తొంది. కాల్పుల మోత వినబడటంతో స్టేషన్ లోని క్విక్ రియాక్షన్ బృందాలు అప్రమత్తమై ఎదురు కాల్పులు జరిపాయి. దీంతో ఆగంతకులు అక్కడి నుండి పరారైనట్లు తెలుస్తొంది. పరారైన ఆగంతకుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. మిలటరీ స్టేషన్ ను మూసివేసి కార్డన్ సెర్చ్ చేపట్టినట్లు స్థానిక అధికారులు వెల్లడించారు. కాల్పులు జరిపింది ఎంత మంది అనేది ఇంకా తెలియరాలేదు.

బఠిండా మిటలరీ శిబిరంలో సైనికులు వారి కుటుంబాలతో కలిసి నివసిస్తున్నారు. కాల్పుల సమాచారం అందడంతో పంజాబ్ పోలీసులు మిలిటరీ స్టేషన్ వద్దకు చేరుకున్నారు. అయితే. ఆ ప్రాంతాన్ని ఆర్మీ అధికారులు తమ ఆధీనంలోకి తీసుకోవడంతో పోలీసులను లోపలికి అనుమతించలేదని బఠిండా సీనియర్ ఎస్పీ వెల్లడించారు. కాగా.. కాల్పుల ఘటనలో ఉగ్ర కోణం ఉందా లేక మరేదైనా కారణం ఉందా అనేది తెలియరాలేదు. ఈ ఘటన వెనుక ఉగ్ర కోణం ఉండే అవకాశాలు తక్కువగా ఉన్నట్లు పోలీసులు వర్గాలు చెబుతున్నాయి. కొందరు ఆర్మీ సిబ్బంది హస్తం ఉండొచ్చన్న అనుమానాన్ని వ్యక్తం చేస్తున్నారు. పూర్తి వివరాలు దర్యాప్తులో వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది.
హెలిపాడ్ వద్ద ఆ మాజీ మంత్రికి అవమానం .. సీఎం సభకు హజరు కాకుండానే తిరిగి వెనక్కు