జమ్మూకశ్మీర్ లో ఘోరం జరిగింది. పుంచ్ జిల్లాలో రహదారిపై వెళుతున్న ఆర్మీ ట్రక్కులో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో ఐదుగురు జవాన్లు సజీవ దహనమయ్యారు. మరి కొందరు గాయపడ్డారు. తొలుత పిడుగు పాటు వల్ల ట్రక్కులో మంటలు చెలరేగాయి అని భావించారు. ఆ తర్వాత ఇది ఉగ్రదాడిగా ఆర్మీ నిర్ధారించింది. బింభేర్ గాలి నుండి పూంచ్ జిల్లాలోని సాంగియోట్ వైపు ఆర్మీ సిబ్బంది వాహనం వెళ్తుండగా మధ్యాహ్నం మూడు గంటల సమయంలో ఈ దుర్ఘటన చోటుచేసుకున్నట్లు సైనిక అధికారులు వెల్లడించారు. ఘటన జరిగిన సమయంలో ఆ ప్రాంతంలో వర్షం పడుతుండటంతో పిడుగు పాటుకు ట్రక్ లో మంటలు చెలరేగాయి అని అనుకున్నారు.

అయతే గాయపడిన ఆర్మీ జవానులు ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. ఆ సమయంలో ఉగ్రవాదులు గ్రానైట్ తో దాడి చేసి ఆ తర్వాత కాల్పులు జరిపినట్లు గాయపడిన అర్మీ జవాను తెలియజేయడంతో ఉగ్ర దాడిగా నిర్ధారణ అయ్యింది. ఇటీవల పంజాబ్ లోని అత్యంత కీలకమైన బఠిండా సైనిక స్థావరంలో జరిగిన కాల్పుల ఘటన మరువకముందే ఈ విషాదం చోటుచేసుకోవడం తీవ్ర కలకలం సృష్టించింది. గత వారమే కేంద్ర పాలిత ప్రాంతంలో భద్రతా పరిస్థితిని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ సమీక్షించారు. కాగా ఈ ఘటనపై కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ తీవ్ర దిగ్భాంతి వ్యక్తం చేశారు. జరిగిన దుర్ఘటన భాధపడుతున్నట్లు పేర్కొన్నారు. అమర జవానుల కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేసారు. మరో పక్క అర్మీ జవాన్ల ట్రక్ దహనం అవుతున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ వీడియో చూసిన నెటిజన్లు అమర జవానులకు సంతాపం తెలుపుతున్నారు.
Viveka Murder Case: సీబీఐకి తెలంగాణ హైకోర్టు కీలక ఆదేశాలు