Breaking: వాతావరణ పరిస్థితుల కారణంగా ఢిల్లీలోని ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం నుండి నాలుగు విమానాలను జైపూర్ విమానాశ్రయానికి మళ్లించారు. ఈ విషయాన్ని విమానాశ్రయ అధికారుల వెల్లడించారు. శనివారం ఢిల్లీలో ఉరుములతో కూడిన వర్షం కురిసింది.

ఈ ప్రభావం విమాన రాకపోకలపై పడింది. విమాన రాకపోకలకు సంబంధించి అప్ డేట్ సమాచారాన్ని ప్రయాణీకులు సంబంధిత విమానయాన సంస్థలను సంప్రదించాలని ఢిల్లీ విమానాశ్రయ అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు. విమానయాన సంస్థలు ప్రయాణీకులకు ట్రావెల్ అడ్వైజరీని జారీ చేశాయి. విమాన షెడ్యుల్ లలో మార్పుల గురించి వారి ట్విట్టర్ ఫీడ్ లో పోస్టు చేశాయి.
ఇదిలా ఉండగా, ఢిల్లీ – ఎన్ సీఆర్ లోని కొన్ని ప్రాంతాల్లో శనివారం ఉదయం ఉరుములు, ఈదురు గాలులతో కూడిన భారీ వర్షం కురిసింది. వాతావరణంలో వచ్చిన ఆకస్మిక మార్పుల వల్ల ఉత్తర భారత దేశంలో వేడి వాతావరణ పరిస్థితుల నుండి ఉపశమనం లభించినట్లు అయ్యింది.
ఢిల్లీ – ఎన్ సీఆర్ లోని పలు ప్రాంతాలతో పాటు హర్యానాలో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తున్నాయి. గంటకు 40 నుండి 70 కిలో మీటర్ల వేగంతో ఈదురు గాలులు వీస్తున్నాయి. దీంతో పలు చోట్ల చెట్లు విరిగిపడ్డాయి. వాహనాల రాకపోకలకు ఇబ్బందులు ఏర్పడ్డాయి. కాగా మే 30వ తేదీ వరకూ ఢిల్లీ – ఎన్సీఆర్ ప్రాంతంలో వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ ప్రకటించింది. ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని సూచించింది.
CM Jagan: ఢిల్లీలో ఏపీ సీఎం వైఎస్ జగన్ .. ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ తో భేటీ