జాతీయం న్యూస్

మాజీ సీఎం కాన్వాయ్ పైకి దూసుకువచ్చిన ఏనుగు..భద్రతా సిబ్బంది అప్రమత్తతో తప్పిన ప్రమాదం

Share

ఏనుగు ఒక్క సారిగా మీదకు వస్తే..ఎవరికైనా హడలెత్తిపోతుంది. ఏమి చేయలేని పరిస్థితి ఏర్పడుతుంది. ఎంతటి వారైనా పరుగు లంఖించుకోవాల్సిందే. అటువంటి పరిస్థితే ఓ రాష్ట్ర మాజీ సీఎంకు ఎదురైంది. భద్రతా సిబ్బంది అప్రమత్తతతో ఆ మాజీ సీఎంకి తృటిలో ప్రమాదం తప్పింది. విషయంలోకి వెళితే.. ఉత్తరాఖండ్ మాజీ సీఎం త్రివేంద్ర రావత్ కాన్వాయ్ కోట్ ద్వార్ – దుగడ్డ రహదారిపై వెళుతుండగా ఓ ఏనుగు వారికి అడ్డంగా వచ్చింది. అంతే కాకుండా ఆ ఏనుగు మాజీ సీఎం కాన్వాయ్ లోని వాహనాలకు అతి సమీపంగా వచ్చింది.

Gajraj came ahead of ex CM Trivendra Rawat Convoy in Kotdwar

 

ఏనుగు కాన్వాయ్ వాహనాల మీదకు రావడం గమనించిన ఆయన భద్రతా సిబ్బంది అప్రమత్తమైయ్యారు. వెంటనే మాజీ సీఎం త్రివేంద్ర రావత్ ను కారు దింపించి అక్కడ నుండి పరుగులు తీశారు. కొద్ది దూరంలో ఉన్న బండరాయిపైకి ఎక్కి ఏనుగుకు దూరంగా ఉండిపోయారు. వెంటనే ఈ సమాచారాన్ని అటవీ శాఖ అధికారులకు తెలియజేయగా, వారు ఘటనా స్థలానికి చేరుకుని గాలిలోకి కాల్పులు జరిపి ఏనుగును దూరంగా తరిమికొట్టారు. ఈ ఘటనకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. గజరాజు ఎదురువస్తే ఎంతటి వారైనా పరుగులు తీయాల్సిందేనని కామెంట్స్ వినబడుతున్నాయి.

ఏపి అసెంబ్లీ నుండి టీడీపీ సభ్యుల సస్పెన్షన్

Gajraj came ahead of ex CM Trivendra Rawat Convoy in Kotdwar

Share

Related posts

లంచ్ బాక్స్‌లో గ్రనేడ్

sarath

Big Boss 5: బిగ్ బాస్ 5 కంటెస్టెంట్స్ వీరే…? రానా హోస్ట్ గా వ్యవహరించేది వీళ్ళకే

arun kanna

రష్మిక ఏంటి పూజా హెగ్డేని కూడా తక్కువ చేసేసింది ..?

GRK