Galwan Clash: చైనాలో జర్నలిస్ట్ కు 8ఏళ్లు జైలు శిక్ష..! ఎందుకంటే..!!

Share

Galwan Clash: దేశం ఏదైనా ప్రభుత్వానికి వ్యతిరేకంగా వార్తలు, కథనాలు రాస్తే జర్నలిస్ట్‌లపైనా కేసులు నమోదు చేయడం, అరెస్టు చేయడం రివాజే. అదే కోవలో చైనా కూడా ఓ జర్నలిస్ట్ ను అరెస్టు చేసి జైలుకు పంపింది. కోర్టు విచారణలో ఆ జర్నలిస్ట్ నేరం ఒప్పుకోవడంతో ఎనిమిది నెలల సాధారణ జైలు శిక్షతో సరిపెట్టారు. భారత దేశంతో పోలిస్తే చైనాలో చట్టాలు కఠినంగా ఉంటాయని అందరికీ తెలిసిందే. ప్రభుత్వ చర్యలను నిలదీస్తే దేశద్రోహం అభియోగాలనూ మోపుతారు. ఇటీవల ఆ దేశానికి చెందిన 38 ఏళ్ల మాజీ ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్ కియు జిమింగ్ కు అక్కడి కోర్టు 8ఏళ్లు జైలు శిక్ష విధించింది. అతని పై కేసు ఎందుకు పెట్టారు, జైలు శిక్ష ఎందుకు పడింది అనేది ఇప్పుడు తెలుసుకుందాం..

Galwan Clash remarks china jails Journalist for 8 months
Galwan Clash remarks china jails Journalist for 8 months

Read More: Maganti Babu Sons: ఓ మాజీ ఎంపీ/ మాజీ మంత్రి – ఇద్దరు కొడుకులు..! మరణాల వెనుక మిస్టరీ ఇదే..!?

గత ఏడాది కరోనా మహమ్మారి భారత్ లోకి ప్రవేశించకముందు ఇండియా – చైనా సరిహద్దులో హిమాలయాల్లోని గాల్వాన్ లోయలో భద్రతా దళాల మధ్య కాల్పులు జరిగిన విషయం తెలిసిందే. నాటి ఘటనలో 20 మంది భారత సైనికిలు వీరమరణం పొందారు. 76 మంది గాయపడ్డారు. భారత ప్రభుత్వం ఆనాడే సరిహద్దులో దాడులకు సంబంధించిన సమాచారాన్ని మీడియాకు విడుదల చేసింది. భారత భూభాగంలోకి చైనా దళాలను రాకుండా సమర్థవంతంగా తిప్పికొట్టడం జరిగిందని పేర్కొంది. చైనా మాత్రం ఎంత మంది సైనికులు మరణించిన విషయం వెల్లడించలేదు. అయితే ఘర్షణ జరిగిన ఎనిమిది నెలల తరువాత ఇటీవల చైనా నాటి ఘర్షణలో నలుగు జవాన్లు మృతి చెందినట్లు ప్రకటించింది.

ఆ ప్రకటనను ఉదహరిస్తూ సోషల్ మీడియాలో  మంచి ఫాలోయింగ్ ఉన్న కియు జిమింగ్ విమర్శనాత్మక కథనం ఇచ్చారు. వాస్తవ మరణాలను ఇవి కావేమో అన్నట్లు కథనం ఇచ్చారు. ఓ అధికారిని కాపాడేందుకు వెళ్లి నలుగురు జవాన్లు చనిపోతే వీళ్లను రక్షించడానికి వెళ్లిన జవాన్లు ఏమైనట్లు అని ప్రశ్నించారు. నలుగురు కంటే ఎక్కువ మందే చనిపోయి ఉంటారనీ, నిజాలు దాచాల్సిన అవసరం ఏమి వచ్చిందటూ కథనం ఇచ్చారు. దీనిపై చైనా ప్రభుత్వం సీరియస్ అయ్యింది. చైనా చట్టాల ప్రకారం దేశ సేవలో వీరమరణం పొందిన సైనికులకు అపకీర్తి కల్గించేలా వ్యాఖ్యలు చేయడం, కథనాలు రాయడం తీవ్రమైన నేరం. ఆ చట్టం ప్రకారం కియు జిమింగ్ ను అరెస్టు చేసి కోర్టుకు హజరుపర్చగా జియాన్యే డిస్ట్రిక్ట్ పీపుల్స్ కోర్టు విచారణ జరిపింది. విచారణ సమయంలో కియు జిమింగ్ నేరాన్ని అంగీకరించడంతో న్యాయమూర్తి 8 నెలల జైలు శిక్ష విధిస్తూ పది రోజుల్లో జాతీయ మీడియాలో గానీ ప్రముఖ వెబ్ సైట్ ల్లో గానీ బహిరంగ క్షమాపణ చెప్పాలని కూడా కోర్టు ఆదేశించింది. కియుతో పాటు మరో అయిదుగురు కూడా జవాన్ల మరణంపై ఇదే విధమైన వ్యాఖ్యలు చేసినందుకు వారిని పోలీసులు అరెస్టు చేసి జైలుకు పంపించారు. మరో నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. అయితే అతను మైనర్ బాలుడనీ, విదేశాల్లో ఉన్నట్లు అధికారులు గుర్తించారు.

 


Share

Related posts

జగన్ వైపు స్టీరింగ్ తిప్పిన ఏ‌బి‌ఎన్ రాధాకృష్ణ… ఉలిక్కిపడిన ఏపీ!

CMR

Etela Rajender: కలుసుడా..! కండువా కప్పుకునుడా..! తేలేది ఈ రోజే..!!

somaraju sharma

షాక్ః అమెరికాలో ట్రంప్ గెల‌వ‌క‌పోతే… మ‌న‌కు ఎంత న‌ష్ట‌మంటే….

sridhar