NewOrbit
జాతీయం న్యూస్ రాజ‌కీయాలు

సుప్రీం కోర్టు ఆగ్రహంతో ఎట్టకేలకు జైలు నుండి గృహ నిర్బంధానికి గౌతం నవలఖా

Share

సుప్రీం కోర్టు ఆగ్రహం వ్యక్తం చేయడంతో ఎట్టకేలకు ఎల్గార్ పరిషత్ కేసులో అరెస్టు అయిన సామాజిక కార్యకర్త గౌతం నవలఖాను జైలు నుండి గృహ నిర్బంధానికి తరలించారు. 2020 ఏప్రిల్ నెల నుండి గౌతం నవలఖా ముంబాయిలోని తలోజా జైలులో ఉన్నారు. 70 ఏళ్ల వృద్ధుడైన గౌతం నవలఖాను వైద్య అవసరాల రీత్యా జైలు నుండి గృహ నిర్బంధానికి తరలించాలని గతంలోనే సుప్రీం కోర్టు ఆదేశాలు జారీ చేసింది. అయితే సుప్రీం కోర్టు ఆదేశాలను జాతీయ దర్యాప్తు సంస్థ ఎన్ ఐ ఏ అమలు చేయలేదు. ఈ నేపథ్యంలో సుప్రీం కోర్టు ఆదేశాలను అమలు చేయలేదంటూ గౌతం నవలఖా తరపు న్యాయవాదులు ధర్మాసనానికి నివేదించారు. దీనిపై శుక్రవారం సుప్రీం కోర్టు మరో సారి విచారణ జరిపింది.

Gautam Navlakha

Breaking: శానిటైజర్ తాగి అస్వస్థతకు గురైన హాస్టల్ విద్యార్ధినులు.. ఆసుపత్రికి తరలింపు

Advertisements

గౌతం నవలఖాకు మవోయిస్టులతో, పాకిస్థాన్ గూడఛార సంస్థ ఐఎస్ఐ తో సంబంధాలు ఉన్నాయని ఎన్ఐఏ ఆందోళన వ్యక్తం చేస్తొందనీ, నవలఖా కొన్ని కీలక అధారాలను దాచిపెడుతున్నారని, అందుకే జైలు నుండి విడుదల చేయలేదు అంటూ ఎన్ ఐఏ తరపు హజరైన సోలిసిటర్ జనరల్ ధర్మాసనం దృష్టికి తీసుకువచ్చారు. దీనిపై సుప్రీం కోర్టు ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. ఉత్తర్వులు అమలు చేయకుండా లోపాలను వెతుకుతూపోతే తీవ్రంగా పరిగణించాల్సి ఉంటుందని పేర్కొంది. 24 గంటలల్లో గతంలో ఇచ్చిన ఆదేశాలు అమలు చేయాలంటూ స్పష్టం చేసింది సుప్రీం ధర్మాసనం. దీంతో గౌతం నవలఖాను జైలు నుండి గృహ నిర్బందానికి ఎన్ ఐ ఏ తరలించింది. నవలఖాను జైలు నుండి గృహ నిర్బంధానికి తరలించేందుకు సుప్రీం కోర్టు గతంలో కొన్ని షరతులను విధించింది.

అయ్యన్న వ్యాఖ్యలపై ఘాటుగా స్పందించిన బీజేపీ ఎంపీ జీవీఎల్


Share

Related posts

RRR : ఆర్ఆర్ఆర్ నుంచి అదిరిపోయే సర్ప్రైజ్ న్యూస్ వచ్చేసింది..!!

bharani jella

రెండున్నర కోట్లు… తెలియక డస్ట్ బిన్ లో పడేసారు

Naina

ఢిల్లీ ఫ్లైట్ ఎక్కబోతున్న రేవంత్ రెడ్డి..??

sekhar