దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన 2002 గోద్రా రైలు దహనం కేసులో ఎనిమిది మంది దోషులకు సుప్రీం కోర్టు శుక్రవారం బెయిల్ మంజూరు చేసింది. తొలుత ట్రయల్ కోర్టు మరణశిక్ష విధించిన నలుగురుకి మాత్రం ఎలాంటి ఉపశమనం లభించలేదు. సెషన్స్ కోర్టు విధించిన షరతులకు లోబడి 8 మంది దోషులకు సీజేఐ జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ పీస్ నరసింహా తో కూడిన ధర్మాసనం బెయిల్ మంజూరు చేసింది.

పదిహేడేళ్లకు పైగా జైలు జీవితం పూర్తి చేసుకున్నారనే దానిని ఆధారంగా చేసుకొని.. సుప్రీం కోర్టు వారికి బెయిల్ మంజూరు చేసింది. వీరంతా ప్రస్తుతం యావజ్జీవ కారాగార శిక్షను అనుభవిస్తున్నారు. ఈ నేరంలో కీలక పాత్ర పోషించిన మరో నలుగురుకి మాత్రం బెయిల్ ను తిరస్కరించింది ధర్మాసనం. ఈ నలుగురికి ట్రయల్ కోర్టు తొలుత మరణ శిక్ష విధించింది. ఆ తర్వాత గుజరాత్ హైకోర్టు వారి శిక్షను జీవిత ఖైదుగా మార్చింది. ఇవేళ గోద్రా నేరస్తుల బెయిల్ పిటిషన్ పై సుప్రీం కోర్టు విచారణ చేపట్టింది.
2002 ఫిబ్రవరిలో గోద్రా స్టేషన్ లో ఓ రైలుకు నిప్పు అంటించిన ఘటనలో 58 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన గుజరాత్ రాష్ట్రంలో పెద్ద ఎత్తున అల్లర్లకు దారి తీసింది. కేసు విచారణ చేపట్టిన ట్రయల్ కోర్టు 2011 లో 31 మంది దోషుల్లో పదకొండు మంది దోషులకు మరణ శిక్ష, 20 మందికి యావజ్జీవ కారాగార శిక్ష విధించింది. అనంతరం హైకోర్టు .. ట్రయల్ కోర్టు తీర్పును సమర్ధించింది. అయితే మరణశిక్ష పడిన 11 మందికి యావజ్జీవ కారాగార శిక్షగా మార్చింది. దీనిపై దోషులు సుప్రీం కోర్టును ఆశ్రయించారు. 2018 నుండి సుప్రీం కోర్టులో ఈ కేసు పెండింగ్ లో ఉంది.
YS Viveka Murder Case: సుప్రీం కోర్టులో వైఎస్ అవినాష్ రెడ్డికి షాక్ .. కానీ..