25.7 C
Hyderabad
March 28, 2023
NewsOrbit
జాతీయం న్యూస్

Union Budget 2023: వస్తువుల ధరలు పెరిగేవి .. తగ్గేవి ఇవే .. పేదలకు బంగారం కొనుగోలు భారమే

Nirmala Sitharaman Budget
Share

Union Budget 2023:  కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ను ప్రవేశపెట్టారు. అందరూ ఊహించినట్లుగానే వేతన జీవులకు ఊరటనిచ్చారు. పాత పన్ను విధానానికి స్వస్తి పలికి కొత్త విధానం తీసుకువచ్చారు. ఇదే సమయంలో బడ్జెట్ మూలంగా ఏయే వస్తువుల ధరలు పెరగనున్నాయి. ఏయే వస్తువుల ధరలు తగ్గనున్నాయో కూడా వెల్లడించారు. అవి ఏమిటంటే ..

Nirmala Sitharaman-Budget
Nirmala Sitharaman-Budget

ధరలు తగ్గేవి ఇవే

  • మొబైల్ ఫోన్స్, కెమెరా లెన్స్
  • విదేశాల నుండి వచ్చే వెండి
  • టీవీలు, బయో గ్యాస్
  • టీవీ విడిభాగాలపై కస్టమ్స్ డ్యూటీ తగ్గింపు
  • విద్యుత్ వాహనాలు, బొమ్మలు, సైకిళ్లు

ధరలు పెరిగేవి

  • బంగారం, వెండి, ప్లాటినంపై కస్టమ్స్ డ్యూటీ పెంపు
  • సిగరెట్లపై కస్టమ్స్ డ్యూటీ 16 శాతం పెంపు
  • టైర్లు, బ్రాండెడ్ దుస్తువు, కిచెన్ చిమ్నీలు

బడ్జెట్ లో ముఖ్యమైన కీలక అంశాలు

  • రూ.7.లక్షల వరకూ పన్ను మినహాయింపు, ఆదాయం రూ.7 లక్షలు దాటితే అయిదు స్లాబుల్లో పన్ను రూ.15 లక్షలు దాటితే 30 శాతం పన్ను
  • రూ.7 లక్షల ఆదాయం దాటితే .. రూ.3 – 6 లక్షల వరకూ 5 శాతం పన్ను, రూ.6 – 9 లక్షల వరకూ 7 శాతం ట్యాక్స్. రూ.9- 12 లక్షల వరకూ 12 శాతం పన్ను
  • సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్ పొదుపు మొత్తం పరిమితిని రూ.15 లక్షల నుండి రూ.30 లక్షల వరకూ పెంపు
  • నెల వారీ ఆదాయ అకౌంట్ స్కీమ్ (Monthly Income Account Scheme) కింద ప్రస్తుతం ఉన్న రూ.4.5లక్షల పరిమితిని రూ.9లక్షలకు పెంపు
  • మహిళలకు మహిళా సమ్మాన్ సేవింగ్స్ సర్టిఫికేట్ ఇస్తారు. రెండేళ్ల వరకూ ఇందులో రూ.2లక్షల మొత్తం పొదుపు చేసుకోవచ్చు.
  • ఇక పై కామన్ ఐడెంటిటీ గా పాన్ కార్డ్ నే పరిగణిస్తారు. విద్యుత్ రంగంలో రూ.35 వేల కోట్లు కేటాయింపు
  • ప్రధాన మంత్రి కౌశల్ వికాస్ యోజన 4.0లో భాగంగా 30 స్కిల్ ఇండియా ఇంటర్నేషనల్ సెంటర్లు ఏర్పాటు

నిరుద్యోగులకు నిర్మలమ్మ తీపి కబురు ..38,800 ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి చర్యలు


Share

Related posts

 Supreme Court : ఏబీవీ సస్పెన్షన్ పై విచారణను మార్చి 9కి వాయిదా వేసిన సుప్రీం కోర్టు

somaraju sharma

ఎడా పెడా.. ట్వీట్ల మోత

Kamesh

క్యాష్ షోలో బిగ్ బాస్ 2 కంటెస్టెంట్ల సందడి.. 2 ఏళ్ల తర్వాత మళ్లీ అంతా కలిశారు?

Varun G