కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు, పెన్షన్‌దారులకు నరేంద్ర మోడీ సర్కార్ గుడ్ న్యూస్ చెప్పనున్నది. ప్రస్తుతం ఉన్న కరవు భత్యాన్ని (డీఏ) నాలుగు శాతం పెంచనున్నట్లు తెలుస్తున్నది. ఫలితంగా 38 శాతం ఉన్న కరవు భత్యం 42 శాతానికి పెరగనున్నది. ఈ డీఏ పెంపు నిర్ణయాన్ని జనవరి 1 నుండే వర్తింపజేయనున్నట్లు తెలుస్తొంది. దీని ద్వారా కోటి మంది ఉద్యోగులు, పెన్షనర్లకు ప్రయోజనం పొందనున్నారు.

గత ఏడాది సెప్టెంబర్ లో నాలుగు శాతం పెంచడం వల్ల కరవు భత్యం 38 శాతానికి చేరింది. పెంచిన డీఏ ను 2022 జూలై 1 నుండి వర్తింపజేశారు. ఆల్ ఇండియా రైల్వే మెన్ ఫెడరేషన్ జనరల్ సెక్రటరీ శివ గోపాల్ మిశ్రా ఈ విషయమై ఓ వార్తా సంస్థతో మాట్లాడుతూ గత ఏడాది డిసెంబర్ కు సంబంధించి పారిశ్రామిక కార్మికుల కోసం వినియోగదారుల ధరల సూచీ ఆధారంగా డీఏ నాలుగు శాతం పెరిగి 42 శాతానికి చేరుకుంటుందని భావిస్తున్నామన్నారు.
బీఆర్ఎస్ అధికారంలోకి వస్తే దేశం అంతా దళిత బందు, రైతు బంధు.. హామీల వర్షం కురిపించిన కేసిఆర్