NewsOrbit
జాతీయం న్యూస్ రాజ‌కీయాలు

Rahul Gandhi: గుజరాత్ హైకోర్టులోనూ రాహుల్ కు దక్కని ఊరట .. పరువు నష్టం కేసులో స్టేకు నిరాకరణ

Share

Rahul Gandhi: కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి గుజరాత్ హైకోర్టులోనూ ఊరట లభించలేదు. పరువునష్టం కేసులో స్టే ఇచ్చేందుకు హైకోర్టు నిరాకరించింది. రాహుల్ పిటిషన్ పై విచారణ జరిపిన గుజరాత్ హైకోర్టు ఉత్తర్వులను రిజర్వ్ చేసింది. హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ హేమంత్ ప్రచ్ఛక్ రాహుల్ పిటిషన్ ను విచారించారు. తీర్పు రిజర్వ్ చేసిన ధర్మాసనం వేసవి సెలవుల తర్వాత తీర్పును ప్రకటించనున్నది. అప్పటి వరకూ తీర్పుపై మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలని రాహుల్ గాంధీ తరపు న్యాయవాదులు ధర్మాసనాన్ని అభ్యర్ధించగా మధ్యంతర ఉపశమనం కల్పించేందుకు హైకోర్టు నిరాకరించింది.

Rahul Gandhi

కొద్ది రోజుల క్రితం సూపర్ సెషన్స్ కోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ రాహుల్ గాంధీ గుజరాత్ హైకోర్టును ఆశ్రయించారు. తనకు విధించిన శిక్షపై స్టే విధించాలని కోర్టుకు అభ్యర్ధించారు. అంతకు ముందు రాహుల్ గాంధీ దాఖలు చేసిన పిటిషన్ ను సూరత్ సెషన్స్ కోర్టు తిరస్కరించింది. ఈ సందర్భంగా న్యాయమూర్తి ఆర్పీ మొగేరా కీలక వ్యాఖ్యలు చేశారు. రాహుల్ కాస్త జాగ్రత్తగా ఆచిచూచి మాట్లాడాల్సిందని వ్యాఖ్యానించారు. మోదీ పేరు ఉన్న వారిని కించపరిచేలా వ్యాఖ్యలు చేయడం వల్ల కచ్చితంగా పిర్యాదుదారుడు పూర్ణేశ్ మోడీ ప్రతిష్టకు హాని కలిగి ఉండవచ్చు అని జస్టిస్ ఆర్ పీ మొగేరా అభిప్రాయపడ్డారు.

పరువు నష్టం కేసుపై విచారణ జరిపిన సూరత్ కోర్టు.. రాహుల్ గాంధీకి రెండేళ్ల జైలు శిక్ష విధించింది. అలాగే ఈ తీర్పుపై కోర్టులో సవాల్ చేసేందుకు వీలుగా 30 రోజులు గడువు ఇచ్చింది. అప్పటి వరకూ బెయిల్ మంజూరు చేసింది. ఈ కేసులో తనపై విధించిన శిక్షపై స్టే విధించాలని కోరుతూ రాహుల్ గాంధీ వేసిన పిటిషన్ ను సూరత్ సెషన్స్ కోర్టు గత నెల 20న తిరస్కరించింది.

Mylavaram (NTR): టీడీపీ నేత, మాజీ మంత్రి దేవినేనిపై క్రిమినల్ కేసు నమోదు


Share

Related posts

ఢిల్లీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాజీనామా

Siva Prasad

బిగ్ బాస్ 4 : ఒక్కసారిగా పడిపోయిన అఖిల్ గ్రాఫ్..! మోనాల్ పైపైకి

arun kanna

ఫ్లాష్ బ్యాక్ : సోనియాకి జగన్ చేసిన ప్రోపోజల్ – నో చెప్పి ట్విస్ట్ ఇచ్చిన సోనియా ?

siddhu