NewsOrbit
జాతీయం న్యూస్

Heroine Chandni Complaint Effect: తమిళనాడు మాజీ మంత్రి మణికందన్ ను బెంగళూరులో అరెస్టు చేసిన చెన్నై పోలీసులు..!!

Heroine Chandni Complaint Effect: సినీ నటి చాందిని ఫిర్యాదుతో అజ్ఞాతంలోకి వెళ్లిన తమిళనాడు మాజీ మంత్రి, ఏఐఎడీఎంకె నేత మణికందన్ ను బెంగళూరులో చెన్నై పోలీసులు అరెస్టు చేశారు. తనతో మాజీ మంత్రి మణికందన్ ప్రేమాయణం నడిపి పెళ్లి చేసుకుంటానని మోసం చేశారని ఇటీవల సినీనటి చాందిని తీవ్ర ఆరోపణలు చేస్తూ పోలీసులకు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. చాందిని ఆరోపణలను మణికందన్ కొట్టిపారేశారు. నటి చాందిని వెనుక పెద్ద పెద్ద వ్యక్తుల ఉన్నారనీ, మూడు కోట్లు ఇవ్వకుంటే మీ మీద కేసులు పెడతామని నన్ను బ్లాక్ మెయిల్ చేశారనీ, డబ్బులు ఇవ్వలేదని ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారని ఇటీవల మణికందన్ ఆరోపించారు.

Heroine Chandini Complaint Effect tamilnadu ex minister arrested
Heroine Chandini Complaint Effect tamilnadu ex minister arrested

Read More: heroine chandini: మాజీ మంత్రి పై ఓ సినీ నటి సంచలన ఆరోపణలు..తమిళనాట హాట్ టాపిక్ ఇదే..

అయితే చాందిని కేసు పెట్టిన తరువాత అరెస్టు నుండి తప్పించుకునేందుకు మణికందన్ అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. మాజీ మంత్రి మణికందన్ ను అరెస్టు చేసేందుకు చెన్నై పోలీసులు ప్రయత్నిస్తున్న తరుణంలో ముందస్తు బెయిల్ కోసం చెన్నై కోర్టును మణికందన్ ఆశ్రయించారు. మణికందన్, చాందిని సంసారం చేసినట్లు ఎక్కడా సాక్షాలు లేవని, ఆమెకు ఇంతకు ముందు అబార్షన్లు కాలేదనీ, మాజీ మంత్రి మణికందన్ కు బెయిల్ మంజూరు చేయాలని ఆయన తరపు న్యాయవాదులు హైకోర్టును కోరారు.

Heroine Chandini Complaint Effect tamilnadu ex minister arrested
Heroine Chandini Complaint Effect tamilnadu ex minister arrested

అయితే చాందిని తరపు న్యాయవాది వారి వాదనలపై అభ్యంతరం వ్యక్తం చేశారు. మణికందన్, చాందిని కలిసి తిరిగారనీ, కాపురం చేశారని అందుకు సాక్షాలను పోలీసులకు ఇచ్చామని, అతనికి బెయిల్ మంజూరు చేస్తే సాక్షులను బెదిరిస్తారని, బెయిల్ ఇవ్వవద్దని కోర్టును కోరారు. కేసు విచారణలో ఉందనీ, మణికందన్ కు బెయిల్ ఇవ్వవద్దని పోలీసుల తరపున న్యాయవాది కోర్టుకు విన్నవించారు. ఇరుపక్షాల వాదనలు విన్న చెన్నై కోర్టు..మణికందన్ కు బెయిల్ ఇవ్వడానికి నిరాకరించింది.

కాగా మణికందన్ ఆచూకీ కోసం పోలీసులు చెన్నై, మధురై జిల్లాలో గాలించారు. చివరకు బెంగళూరులో ఉన్నట్లు తెలుసుకుని అక్కడకు వెళ్లి అదుపులోకి తీసుకున్నారు.

author avatar
sharma somaraju Content Editor

Related posts

YSRCP: జగన్ చేతిలో చంద్రబాబు కూటమి మేనిఫెస్టో

sharma somaraju

Lok Sabha Election 2024: ప్రశాంతంగా  ముగిసిన తొలి దశ పోలింగ్ .. పోలింగ్ శాతం ఎంతంటే..?

sharma somaraju

TDP: జోగికి షాక్ ఇచ్చిన వసంత కృష్ణప్రసాద్ .. మంత్రి బావమరుదులకు టీడీపీ కండువా కప్పి..

sharma somaraju

Ram Pothineni: షాకిస్తున్న రామ్ రెమ్యున‌రేష‌న్‌.. అగ్ర హీరోల‌నే మించిపోతున్నాడుగా!?

kavya N

Lok Sabha Elections 2024: తెలుగు రాష్ట్రాల్లో అట్టహాసంగా ప్రముఖుల నామినేషన్లు

sharma somaraju

లాస్ట్ మినిట్‌లో టీడీపీలో మారిన సీట్లు… వాళ్ల‌కు షాక్‌లు.. వీళ్ల‌కు స్వీటు…!

YS Viveka Case: కడప కోర్టు ఆదేశాలపై హైకోర్టుకు – సునీత

sharma somaraju

Lok sabha Election: సస్పెన్షన్ ఉద్యోగులకు బిగ్ రిలీఫ్ ..సిద్దిపేట లో సెర్ప్ ఉద్యోగుల సస్పెన్షన్ పై హైకోర్టు స్టే

sharma somaraju

Manamey Teaser: ఆక‌ట్టుకుంటున్న శ‌ర్వానంద్ `మ‌న‌మే` టీజ‌ర్.. ఇంత‌కీ ఆ బుజ్జిబాబు ఎవ‌రంటే?

kavya N

Tollywood Actors: టాలీవుడ్ లో ఎక్కువ ఇండ‌స్ట్రీ హిట్స్ అందుకున్న టాప్‌-5 హీరోలు వీళ్లే.. ఫ‌స్ట్ ప్లేస్‌లో ఉన్న‌ది ఎవ‌రంటే?

kavya N

Nikhil Siddhartha: తండ్రి అయ్యాక ఆ అల‌వాటు వ‌దిలేసిన నిఖిల్‌.. ఇంత‌కీ ఈ హీరోగారి కొడుకు పేరేంటో తెలుసా?

kavya N

Keerthy Suresh: శంక‌ర్ కూతురి పెళ్లిలో కీర్తి సురేష్ క‌ట్టుకున్న చీర ఎన్ని ల‌క్ష‌లో తెలిస్తే క‌ళ్లు తేలేస్తారు!

kavya N

ఏపీలో స‌ర్వేలు – సంగ‌తులు: ఒకే రోజు రెండు డిఫ‌రెంట్ స‌ర్వేలు… ఏది నిజం.. ఏది అబ‌ద్ధం…?

నామినేష‌న్లు మొద‌ల‌య్యాయ్‌… జ‌గ‌న్‌, బాబుకు కొత్త త‌లనొప్పి స్టార్ట్…!

వైసీపీలో ఈ లీడ‌ర్లు మామూలు ల‌క్కీ కాదుగా… న‌క్క తోకే తొక్కారు…!