NewsOrbit
జాతీయం న్యూస్

Virabhadra Singh: హిమాచల్ ప్రదేశ్ డబుల్ హాట్రిక్ సీఎం వీరభద్ర సింగ్ ఇక లేరు..

Virabhadra Singh: హిమాచల్ ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, సీనియర్ కాంగ్రెస్ నేత వీరభద్ర సింగ్ (87) ఈ రోజు తెల్లవారుజామున కన్నుమూశారు. కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన సిమ్లాలోని ఇందిరా గాంధీ మెడికల్ కళాశాల ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. సోమవారం ఆయనకు గుండె పోటు రావడంతో ఆరోగ్య పరిస్థితి మరింత క్షీణించింది. వెంటిలేటర్ పై చికిత్స పొందుతూ ఈ తెల్లవారుజామున తుది శ్వాస విడిచారు.

Himachal pradesh ex cm Virabhadra Singh passed away
Himachal pradesh ex cm Virabhadra Singh passed away

Read More: YS Sharmila: ఇడుపులపాయ వైఎస్ఆర్ ఘాట్ వద్ద షర్మిల ప్రార్థనలు..! సాయంత్రం ఏపి సీఎం వైఎస్ జగన్.. !!

కాగా వీరభద్ర సింగ్ రెండు నెలల వ్యవధిలో రెండు సార్లు కరోనా బారినపడ్డారు. ఈ సంవత్సరం ఏప్రిల్ 12 ఆయన తొలి సారి కరోనా బారిన పడ్డారు. దీంతో ఆయనను ఛండీగఢ్ లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేర్పించి చికిత్స అందించారు. ఆ తరువాత కోలుకుని ఏప్రిల్ 30న ఇంటికి చేరుకున్నారు. అయితే ఇంటికి వచ్చిన కొద్ది గంటల తరువాత ఆయనకు గుండె పోటు రావడంతో సిమ్లాలోని ఇందిరా గాంధీ మెడికల్ కాలేజీ ఆసుపత్రిలో చేర్పించారు. అప్పటి నుండి ఆసుపత్రిలో చికిత్స పొందుతుండగా గత నెల 11న మరో సారి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయ్యింది.

హిమాచల్‌ప్రదేశ్ రాష్ట్రానికి ఆరు సార్లు ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వహించి వీరభద్ర సింగ్ రికార్డు సృష్టించారు. 1960లో రాజకీయాల్లోకి వచ్చిన ఆయన తొమ్మిది సార్లు ఎమ్మెల్యేగా, అయిదు పర్యాయాలు ఎంపిగా గెలిచారు. వీరభద్ర సింగ్ సతీమణి ప్రతిభా సింగ్, కుమారుడు విక్రమాదిత్య సింగ్ కూడా రాజకీయ నాయకులే. ప్రతిభ సింగ్ గతంలో ఎంపిగా పని చేయగా, కుమారుడు విక్రమాదిత్య సిమ్లా రూరల్ నుండి ఎమ్మెల్యేగా వ్యవహరిస్తున్నారు.

వీరభద్ర సింగ్ మృతి పట్ల రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్, ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ, కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ సహా పలువురు రాజకీయ ప్రముఖులు సంతాపం ప్రకటించారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.

author avatar
sharma somaraju Content Editor

Related posts

YS Viveka Case: ఎంపీ అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ రద్దు పిటిషన్ పై హైకోర్టులో విచారణ

sharma somaraju

Arvind Kejriwal: కేజ్రీవాల్ కు మరో షాక్ .. ఏప్రిల్ 1 వరకూ కస్టడీ పొడిగింపు

sharma somaraju

Bapatla: టీడీపీ అభ్యర్ధి కంపెనీలో సోదాలు .. భారీగా నగదు స్వాధీనం

sharma somaraju

YSRCP: జరిగిన మంచి చూసి ఓటేయండి – జగన్

sharma somaraju

Mohanlal: మోహ‌న్ లాల్ కూతురిని ఎప్పుడైనా చూశారా.. ఆమె అందం ముందు హీరోయిన్లు కూడా స‌రిపోరు!

kavya N

Siddharth: ఆ హీరోయిన్ వ‌ల్లే మొద‌టి భార్యతో సిద్ధార్థ్ విడిపోయాడా.. అదితి-సిద్ధార్థ్ మ‌ధ్య ఏజ్ గ్యాప్ ఎంతో తెలుసా?

kavya N

DMDK: టిక్కెట్ రాలేదన్న మనస్థాపంతో సిట్టింగ్ ఎంపీ ఆత్మహత్యాయత్నం .. చికిత్స పొందుతూ మృతి

sharma somaraju

YSRCP: ఎన్నికల్లో దుష్టచతుష్టయాన్ని ఓడించాలి – జగన్

sharma somaraju

BJP: ఏపీ అసెంబ్లీ అభ్యర్ధులను ప్రకటించిన బీజేపీ

sharma somaraju

గుంటూరు వెస్ట్ టాక్‌: వాళ్లంతా ఏకం.. ‘ టీడీపీ మాధ‌వి ‘ తో మ‌మేకం…!

చంద్ర‌బాబు సొంత ఇలాకాలో కూట‌మి పార్టీల్లో క‌ల్లోలం.. !

ఏపీలో టికెట్ ప్లీజ్‌.. ఆ ఒక్క జిల్లాలోనే కాంగ్రెస్‌కు గుట్ట‌లుగా ద‌ర‌ఖాస్తులు..!

Breaking: కేరళ సీఎం కుమార్తె పై మనీలాండరింగ్ కేసు

sharma somaraju

Most Expensive Indian Films: అత్య‌ధిక బ‌డ్జెట్ తో తెర‌కెక్కిన టాప్‌-10 ఇండియ‌న్ మూవీస్ ఇవే.. ఫ‌స్ట్ ప్లేస్ ఏ సినిమాదంటే?

kavya N

YSRCP: కుమారుడు జగన్‌కే విజయమ్మ ఆశీస్సులు

sharma somaraju