Himachal Pradesh: హిమాచల్ ప్రదేశ్ లో ఘోర విషాదం చోటుచేసుకుంది. కులు జిల్లాలోని నియోలి-షంషేర్ రోడ్డులో ప్రైవేటు బస్సు అదుపుతప్పి లోయలో పడింది. ఈ ప్రమాదంలో 16 మంది దుర్మరణం పాలైయ్యారు. మృతుల్లో స్కూల్ విద్యార్ధులు ఉన్నారు. పలువురు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారిని స్థానిక ఆసుపత్రులకు తరలించారు, కులు నుండి రెస్క్యూ టీమ్ ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టింది. ప్రమాద సమయంలో బస్సులో 45 మంది ప్రయాణీకులు ఉన్నట్లు సమాాచారం. ప్రమాద తీవ్రతకు బస్సు పూర్తిగా సుజ్జునుజ్జు అయ్యింది. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని అధికారులు అంటున్నారు. ఈఘటన ఉదయం ఎనిమిది గంటలకు జరిగింది.
కాగా బస్సు ప్రమాదంపై హిమాచల్ ప్రదేశ్ సీఎం జైరామ్ ఠాకూర్ స్పందించారు. ప్రైవేట్ బస్సు ప్రమాదం గురించి తనకు సమాచారం అందిందన్నారు. మొత్తం యంత్రాంగం సంఘటనా స్థలంలో ఉండి సహాయక చర్యలు చేపట్టిందని తెలిపారు. గాయపడిన వారిని ఆసుపత్రికి తరలిస్తున్నారనీ, మెరుగైన వైద్యసేవలు అందించాలని ఆదేశించినట్లు చెప్పారు. మృతుల ఆత్మకు శాంతి చేకూరాలని, మృతుల కుటుంబాలకు మనోధైర్యాన్ని ఇవ్వాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నానని పేర్కొన్నారు సీఎం జైరామ్ ఠాకూర్.
ఫిలిం మేకర్ మరియు నటుడు శేఖర్ కపూర్ ఇటీవల దిగ్గజ దర్శకుడు రాజమౌళిని కలవడం జరిగింది. వాళ్లతో మాత్రమే కదా ఆయన కుటుంబంతో ఒక రోజంతా గడిపారు.…
బీజేపీ.. నరేంద్ర మోడీ.., అమిత్ షా.., జేపీ నడ్డా.. వీళ్ళందరూ 2014 వరకు అక్కడక్కడా మాత్రమే పరిమితం.. 2014 లో కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చాక.. నెమ్మదిగా…
స్వప్న బుల్లితెర ప్రేక్షకులను ఎంతగానో. అలరిస్తున్న కార్తీకదీపం సీరియల్ రోజుకో మలుపు తిరుగుతూ విశేషంగా ప్రేక్షకులను అల్లరిస్తూ వస్తుంది.ఇక ఈరోజు 1423 వ ఎపిసోడ్ లో కార్తీకదీపం…
మొహర్రం సందర్భంగా ముస్లింలకు ఏపి సీ ఎం వైఎస్ జగన్ ట్విట్టర్ వేదికగా సందేశాన్ని విడుదల చేశారు. ముస్లిం సోదరులు పాటించే మొహర్రం త్యాగానికి, ధర్మ పరిరక్షణకు…
దేవిని తీసుకుని సత్య రాధ వాళ్లింటికి వస్తుంది.. అమ్మ ఏది నాన్న అని దేవి అడుగుతుంది.. ఫ్రెండ్స్ కనిపిస్తే మధ్యలో మాట్లాడుతూ ఆగిపోయింది అని మాధవ్ అంటాడు..…
అమ్మ హనీ ఇంకా నిద్ర పోలేదా.!? ఏంటి.. ఇట్స్ స్లీపింగ్ టైం అని సామ్రాట్ అంటాడు.. నాకు నిద్ర రావట్లేదు నాన్న అని హనీ అంటుంది.. లైట్…