NewsOrbit
జాతీయం ట్రెండింగ్ న్యూస్ రాజ‌కీయాలు

Hindu: ఆ చెన్నై న్యాయ‌మూర్తి తీర్పు ఇస్తున్నారంటే హిందువులు అల‌ర్ట్ అయిపోతారు!

Hindu: చాలామంది హిందువుల్లో క‌లిగే సందేహం ఓ కోర్టు ముందుకు కేసు రూపంలో వ‌చ్చింది. హిందువులు ఆల‌యాల‌కు వెళ్తుంటారు. భ‌క్తితో కానుక‌లు స‌మ‌ర్పించుకుంటారు. గుడుల అభివృద్ధి కోసం భూములు, డ‌బ్బులు ఇస్తుంటారు. ఇలాంటివి పాల‌కులు త‌మ అవ‌స‌రాల‌కోసం వాడుకోవ‌డం, ఇత‌ర మ‌త‌స్తులకు సైతం వినియోగించుకోవ‌డం ఏంట‌ని అనేక మంది అంటుంటారు. అలాంటి విష‌యంలోనే మద్రాస్ హైకోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. దేవాలయాల భూములు కేవలం హిందువులకు మాత్రమే చెందుతాయ‌ని, వాటి మీద వ‌చ్చే ఆదాయం కూడా ఆలయాల అభివృద్ధికి, హిందువుల కోసమే వాడాల‌ని తేల్చిచెప్పింది. అంతేకాకుండా ఈ విషయంలో ప్రభుత్వాలు దొంగల మాదిరిగా వ్యవహరించకుండా.. ఆ ఆదాయాన్ని ఇతర కార్యక్రమాలకు, ఇతర మతాలకు ఇవ్వకూడద‌ని తేల్చిచెప్పింది.

Read More: Hindu traditions: మంగళసూత్రం,నల్లపూసలు ప్రాముఖ్యత గురించి తెలిస్తే వివాహితులు వాటిని ధరించకుండా ఉండరు !!

ఇది అస‌లు విష‌యంలో…

త‌మిళ‌నాడులో న‌డుస్తున్న సేవ్ టెంపుల్స్ ఉద్యమంలో భాగంగా, వేసిన ప్ర‌జా వ్యాజ్యానికి మద్రాస్ హైకోర్టు ఈ సంచ‌ల‌న‌ తీర్పు ఇచ్చింది. 1985 సమయంలో తమిళనాడులో దేవాలయాల భూములు 5 లక్షల ఎకరాలుండగా.. ప్రస్తుతం వాటి సంఖ్య 4 లక్షల 50 వేలకు తగ్గింది. మిగతా 50 వేల ఎకరాల లెక్క చెప్పాలంటూ… కోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించింది. వాటిని వెంటనే అప్పజెప్పాలంటూ.. ఆలయాల భూములు దేవుడి పేరు మీదనే ఉండాలని తేల్చి చెప్పింది. దేవాలయం, వాటి అధికారుల అధీనంలో మాత్రమే ఉండాలని, ప్రభుత్వాలు వాటిపై పెత్తనం చేయకూడదని తెలిపింది. దేవాలయాల భూముల పరిరక్షణకు ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకోవాల‌ని, ప్ర‌త్యేక కోర్టులు, ట్రిబ్యునల్ ఏర్పాటు చేయాల‌ని, కేవలం హిందూ దేవాలయాల ఆదాయంతో మాత్రమే ప్రభుత్వాలు నడ‌ప‌రాద‌ని చెప్పింది.

Read More: Fasting: హిందువులు ఉపవాసం ఎలా చెయ్యాలి ??

ఆ విష‌యం పాల‌కుల‌కు తెలియ‌దా?
హిందువుల కోసం, హిందూ ఆలయాలు అభివృద్ధి హిందూ కార్యక్రమాలకు మాత్రమే దేవాలయ ఆదాయాన్ని ఉపయోగించాలని స్పష్టమైన తీర్పు ఇచ్చింది. దాతలు హిందూ దేవాలయాలకు, హిందూ దేవుడికి భూములు ఇచ్చార‌ని, దానిని హిందూ ధర్మం కోసమే ఉపయోగించాల‌ని సూచించారు. దేవాలయాలలో ఉన్న అన్ని ఖాళీలు, పోస్టులు భర్తీ చేయాల‌ని, హిందువులకు మాత్రమే ఉద్యోగాలు ఇవ్వాల‌ని, అన్యమతస్తులకు కాద‌ని స్పష్టం చేశారు. మతం మారితే రిజర్వేషన్ చెల్లదు అని చారిత్రాత్మక తీర్పు ఇచ్చిన న్యాయ‌మూర్తి ఎస్సార్ మహదేవన్ ఇపుడు ఈ తాజా తీర్పు వెలువ‌రించ‌డం విశేషం. కాగా, మ‌హ‌దేవన్ బెంచ్‌కు కేసు వ‌స్తుందంటే… హిందువులు అల‌ర్ట్ అవుతార‌ని సోష‌ల్ మీడియాలో ప్ర‌చారం జ‌రుగుతోంది.

author avatar
sridhar

Related posts

Pawan Kalyan: రేపు పిఠాపురానికి పవన్ కళ్యాణ్.. తొలి విడత ఎన్నికల ప్రచారం షెడ్యూల్ ఇలా..

sharma somaraju

Revanth Reddy: ఫోన్ ట్యాపింగ్ పై తొలి సారి స్పందించిన సీఎం రేవంత్ ..చర్లపల్లిలో చిప్పకూడు తప్పదు అంటూ కీలక వ్యాఖ్యలు

sharma somaraju

TDP Leaders Protest: అనంత టీడీపీలో భగ్గుమన్న అసమ్మతి .. పార్టీ కార్యాలయం ధ్వంసం .. బ్యానర్లు, ఫ్లెక్సీలకు నిప్పు

sharma somaraju

Ranbir Kapoor: కూతురు రాహాకు ల‌గ్జ‌రీ బంగ్లాను గిఫ్ట్‌గా ఇచ్చిన‌ రణ‌బీర్ కపూర్.. ఎన్ని కోట్లో తెలిస్తే క‌ళ్లు చెదిరిపోతాయ్‌!!

kavya N

TDP: 4 లోక్ సభ, 9 అసెంబ్లీ స్థానాలకు అభ్యర్ధులను ప్రకటించిన టీడీపీ .. కోరుకున్న స్థానాన్ని దక్కించుకున్న గంటా

sharma somaraju

Tamannaah: త‌మ‌న్నాకు మ‌రో పేరు ఉందా.. ఫ్యాన్స్ కు కూడా తెలియ‌ని సీక్రెట్ ఇది..!!

kavya N

Vishwak Sen: విశ్వ‌క్ సేన్ బ‌ర్త్‌డే స్పెష‌ల్‌.. మాస్ కా దాస్ బ్యాక్‌గ్రౌండ్ ఏంటి.. సినిమాల్లోకి రాక ముందు ఏం చేసేవాడో తెలుసా?

kavya N

Congress: కాంగ్రెస్ పార్టీకి మరో సారి షాక్ ఇచ్చిన ఐటీ .. రూ.1700 కోట్ల పన్ను నోటీసులు

sharma somaraju

Surekha Vani: మా అమ్మ‌కు మ‌ళ్లీ పెళ్లి చేస్తానంటున్న సురేఖా వాణి కూతురు.. ఎలాంటి అబ్బాయి కావాలో చెప్పేసిన సుప్రీత!

kavya N

BRS MP: సీఎం రేవంత్ రెడ్డితో బీఆర్ఎస్ ఎంపీ కే కేశవరావు భేటీ .. తండ్రీ, తనయ కాంగ్రెస్ లో చేరికకు ముహూర్తం ఖరారు

sharma somaraju

Legend: 10 ఏళ్లు పూర్తి చేసుకున్న లెజెండ్‌.. అప్ప‌ట్లో ఈ చిత్రం ఎన్ని కోట్లు రాబట్టిందో తెలుసా?

kavya N

Elon Musk: ఆ ఎక్స్ యూజర్లలకు ‘మస్క్’ గుడ్ న్యూస్

sharma somaraju

విజ‌య‌వాడ ప‌శ్చిమ‌లో ‘ సుజ‌నా చౌద‌రి ‘ గెల‌వాలంటే ఈ అద్భుతం జ‌ర‌గాల్సిందే..!

విజ‌య‌వాడ‌లో కూట‌మి ఇలా చేసేంటే అదిరేదిగా… ఈ కామ‌న్ సెన్స్ కూడా లేకుండా పాయే..!

కొలిక‌పూడి శ్రీను సీటు కూడా చంద్ర‌బాబు పీకేస్తున్నాడా…!