Breaking: దేశ రాజధాని ఢిల్లీలో తరచు జరుగుతున్న అగ్ని ప్రమాదాలు ఆందోళన కల్గిస్తున్నాయి. వాజీపూర్ లో భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. వాజీపూర్ లోని ఓ ఫ్యాక్టరీ నుండి మంటలు చెలరేగుతున్నాయి. సమాచారం తెలియగానే ఫైర్ ఇంజన్లతో అగ్నిమాపక సిబ్బంది అక్కడకు చేరుకుని మంటలను అదుపు చేస్తున్నారు. 25 ఫైర్ ఇంజన్ లతో మంటలను అదుపు చేస్తున్నారు.

ఈ భారీ అగ్నిప్రమాదంలో ప్రాణనష్టం, ఆస్తినష్టంకు సంబంధించి వివరాలు తెలియరావాల్సి ఉంది. ప్రమాదానికి గల కారణాలు తెలియరాలేదు. పెద్ద ఎత్తున పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ఈ భారీ అగ్ని ప్రమాదంపై స్పందించిన ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ పూర్తి వివరాలు తెలియజేయాలని అధికారులను ఆదేశించారు. సహాయక చర్యలపై ఆదేశించారు.
ముగిసిన జగన్ ఢిల్లీ పర్యటన .. చివరి నిమిషంలో మరో కీలక మంత్రితో భేటీ