Teesta Arrest: పోలీసు కస్టడీకి తీస్తా సీతల్వాడ్ .. జంతర్ మంతర్ వద్ద నిరసనకు పిలుపు

Share

Teesta Arrest: ఫోర్జరీ, నేర పూరిత కుట్ర తదితర అభియోగాలతో అరెస్టు చేసిన ప్రముఖ సామాజిక కార్యకర్త తీస్తా సీతల్వాడ్, మాజీ డీజీపీ శ్రీకుమార్ ల విచారణకు పోలీసులు కస్టడీకి తీసుకున్నారు. జూలై 2వ తేదీ వరకూ పోలీసు కస్టడీకి అప్పగిస్తూ ఆహ్మదాబాద్ కోర్టు న్యాయమూర్తి ఉత్తర్వులు జారీ చేసిన నేపథ్యంలో పోలీసులు వీరిని అదుపులోకి తీసుకున్నారు. శనివారం ముంబాయిలో ఏటీఎస్ పోలీసులు తీస్తాను అదుపులోకి తీసుకుని అహ్మదాబాద్ తరలించారు. తనపై పోలీసులు అమానవీయంగా ప్రవర్తించారనీ, తన భుజం కమిలిపోయిందని తీస్తా ఆరోపించారు. మరో పక్క ఈ కేసు విచారణకు ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) ఏర్పాటైంది. దీనికి ఏటిఎస్ డీఐజీ నేతృత్వం వహిస్తున్నారు.

Human Rights Defenders Protest against Teesta Arrest

2002 గుజరాత్ అల్లర్ల కేసులో మోడీ, తదితరులకు క్లీన్ చిట్ ఇవ్వడాన్ని సవాల్ చేస్తూ వేసిన పిటిషన్ ను శుక్రవారం సుప్రీం కోర్టు కొట్టేసిన సంగతి తెలిసిందే. ఆ వెంటనే తీస్తా, మాజీ ఐపీఎస్ అధికారులు శ్రీకుమార్, సంజీవ్ భట్ లపై ఫోర్జరీ, నేరపూరిత కుట్ర, తప్పుడు సాక్షాలతో అమాయకులను ఇరికించే ప్రయత్నం తదితర ఆరోపణలో క్రైమ్ బ్రాంచ్ ఇన్స్ పెక్టర్ డిబీ బరాడ్ ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. సుప్రీం కోర్టు పిటిషన్ ను కొట్టివేసిన సందర్భంలో పిటిషన్ దారులైన తీస్తా తదితరులపై ఘాటు వ్యాఖ్యలు చేసింది. దురుద్దేశపూర్వకంగా పిటిషన్లు వేశారని, విచారణ ప్రక్రియ దుర్వినియోగంలో భాగస్వాములు అయిన వారందరిపైనా చట్టబద్దమైన చర్యలు తీసుకోవాలని పేర్కొంది. ఈ వ్యాఖ్యల ఆధారంగా తీస్తా సెతల్వాడ్, శ్రీకుమార్, భట్ లపై ఎఫ్ఐఆర్ నమోదు అయ్యింది.

 

మరో పక్క తీస్తా సీతల్వాడ్ అరెస్టును సీపిఎం, ముంబాయి ప్రెస్ క్లబ్ ఖండించింది. తీస్తాను విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ కోల్ కతాలో వామపక్షాలు నిన్న ర్యాలీ నిర్వహించాయి. తీస్తా తదితరుల అరెస్టును ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల పరిరక్షకుల ప్రత్యేక ప్రతినిధి మేరీ లాలర్ ఖండించారు. మానవ హక్కుల సంఘం నేతలు తీస్తా అరెస్టును ఖండిస్తున్నారు. ఈ రోజు సాయంత్రం 4 గంటలకు జంతర్ మంతర్ వద్ద నిరసన కార్యక్రమానికి పిలుపునిచ్చారు ఢిల్లీ మైనార్టీస్ కమిషన్ మాజీ చైర్మన్ జఫరుల్ ఇస్లామ్ ఖాన్.


Share

Recent Posts

తిన‌డానికి తిండి కూడా ఉండేదికాదు.. చాలా క‌ష్ట‌ప‌డ్డాం: నిఖిల్‌

విభిన్న‌మైన క‌థ‌ల‌తో ప్రేక్ష‌కుల‌ను అల‌రిస్తూ టాలీవుడ్‌లో త‌న‌కంటూ స్పెష‌ల్ ఇమేజ్‌ను క్రియేట్ చేసుకున్న యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో నిఖిల్ సిద్ధార్థ్.. త్వ‌ర‌లోనే `కార్తికేయ 2`తో ప‌ల‌క‌రించ‌బోతున్నాడు.…

26 mins ago

బీహార్ సీఎంగా 8వ సారి నితీష్ కుమార్ …ప్రమాణ స్వీకారానికి ముహూర్తం ఫిక్స్

బీహార్ ముఖ్యమంత్రిగా జేడీయూ నేత నితీష్ కుమార్ 8వ సారి ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఇప్పటి వరకూ నితీష్ కుమార్ ఏడు సార్లు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం…

34 mins ago

స‌మ్మె ఎఫెక్ట్‌.. ప్ర‌భాస్‌కు అన్ని కోట్లు న‌ష్టం వ‌చ్చిందా?

గ‌త కొద్ది నెల‌ల నుండి సినిమాల ద్వారా వ‌చ్చే ఆదాయం బాగా త‌గ్గిపోవ‌డం, నిర్మాణ వ్య‌యం మోయ‌లేని భారంగా మార‌డంతో.. తెలుగు సినీ నిర్మాతలు త‌మ స‌మ‌స్య‌ల‌ను…

1 hour ago

బీజేపీకి మరో సారి షాక్ ఇచ్చిన బీహార్ సీఎం నితీష్ కుమార్ .. సీఎం పదవికి రాజీనామా

జేడీయూ నేత, బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ మిత్రపక్షమైన బీజేపీకి మరో సారి షాక్ ఇచ్చారు. ఎన్డీఏ నుండి తప్పుకుంటున్నట్లు ప్రకటించిన నితీష్ కుమార్ ఇప్పటి వరకు…

2 hours ago

ర‌ష్మిక నో చెప్పాక కృతి శెట్టి న‌టించిన‌ సినిమా ఏదో తెలుసా?

యంగ్ బ్యూటీ కృతి శెట్టి గురించి ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. త‌క్కువ స‌మ‌యంలోనే టాలీవుడ్‌లో మోస్ట్ వాంటెడ్‌గా మారిన ఈ ముద్దుగుమ్మ‌.. త్వ‌ర‌లోనే `మాచర్ల నియోజవర్గం`తో ప్రేక్ష‌కుల‌ను…

2 hours ago

స్ట్రీమింగ్‌కు సిద్ధ‌మైన న‌య‌న్‌-విగ్నేష్ పెళ్లి వీడియో.. ఇదిగో టీజ‌ర్!

సౌత్‌లో లేడీ సూప‌ర్ స్టార్‌గా గుర్తింపు పొందిన న‌య‌న‌తార ఇటీవ‌లె కోలీవుడ్ ద‌ర్శ‌క‌,నిర్మాత విఘ్నేష్ శివ‌న్‌ను పెళ్లి చేసుకుని వైవాహిక జీవితంలోకి అడుగు పెట్టింది. దాదాపు ఆరేళ్ల…

3 hours ago