ICMR Guidelines: గాలి ద్వారా కరోనా వైరస్ ఎంత దూరం వ్యాపిస్తుందో తెలుసా?

Share

ICMR Guidelines: గాలి ద్వారా కరోనా వైరస్ వ్యాపిస్తుందని కేంద్రం స్పష్టం చేసింది. ప్రధానంగా వైరస్ సోకిన వ్యక్తి దగ్గినా, లేదా తుమ్మినప్పుడు, మాట్లాడినప్పుడు వచ్చే తుంపర్ల ద్వారా వ్యాపిస్తున్నట్లు పేర్కొంది. ఈ మేరకు సవరించిన కోవిడ్ -19 క్లినికల్ మేనేజ్ మెంట్ ప్రోటోకాల్స్ ను బుధవారం విడుదల చేసింది. గత ఏడాది జూన్ లో జారీ చేసిన ప్రోటోకాల్ కు ఇది పూర్తిగా భిన్నంగా ఉంది. గత సంవత్సరం జారీ చేసిన ప్రోటోకాల్స్ లో కరోనా సోకిన వ్యక్తికి సమీపంలో ఉన్న వారికి వారి తుంపర్ల ద్వారా మాత్రమే వ్యాపిస్తుందని పేర్కొన్న విషయం తెలిసిందే. వైరస్ సోకిన వ్యక్తి దగ్గినప్పుడు, తుమ్మినప్పుడు, మాట్లాడిన సమయంలో వచ్చే తుంపర్ల ద్వార ఇతరులకు వ్యాపిస్తుందని తెలియజేసినప్పటికీ గాలి ద్వారా వ్యాపిస్తుందన్న విషయాన్ని నాడు వెల్లడించలేదు.

ICMR Guidelines: corona virus spreads through air says center
ICMR Guidelines: corona virus spreads through air says center

ఇటీవల ప్రభుత్వ ప్రిన్సిపాల్ సైంటిఫిక్ అడ్వయిజరీ కార్యాలయం విడుదల చేసిన గైడ్ లైన్స్ లో కరోనా వ్యాప్తి గాలి తుంపర్ల ద్వారా జరుగుతున్నట్లు పేర్కొంది. వైరస్ సోకిన వ్యక్తి నుండి తుంపర్ల ద్వారా వచ్చి వైరస్ గాలిలో దాదాపు పది మీటర్ల వరకు ప్రయాణించే అవకాశం ఉందని వెల్లడించింది. వైరస్ ఉన్న గాలి, వీటి తుంపర్లను పీల్చినవారికి లేదా అవి కళ్లల్లో ముక్కుల్లో, నోటి లో పడిన వారికి, గాలి వెలుతురు లేని ప్రదేశాల్లో ఉండే వారికి ఈ వ్యాధి సోకుతుంది.

Read More: MK Stalin: స్టాలిన్‌ది ఎంత దొడ్డ మనసో..!!

గాలి,  వెలుతురు ఎక్కువగా ప్రసరించని గదులలో ఎక్కువ మంది చాలా సేపు ఉంటే వారికి వైరస్ వ్యాపిస్తుంది. గాలి తుంపర్లు ఓకే చోట స్థిరంగా ఉండిపోవడం, ఒక మీటరు కన్నా ఎక్కువ దూరం ప్రయాణించడం వల్ల ఈ వైరస్ వ్యాపిస్తుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ గుర్తించింది. అందుకే ఇళ్లు, పని ప్రదేశాలలో గాలి, వెలుతురు బాగా వచ్చేలా చూసుకోవాలని ఆరోగ్య శాఖ తెలియజేస్తోంది.


Share

Related posts

లీకులతో వకీల్ సాబ్ కి భారీ నష్టం ..?

GRK

బిగ్ బాస్ 4:ఆ ఇంటి సభ్యుల విషయంలో చాన్స్ కోసం వెయిట్ చేస్తున్నారు..??

sekhar

మూడు రాజధానుల వెనుక కేసీఆర్..!!

sekhar