Corona: డ‌బ్బులు ప్రింట్ చేసుకుంటే స‌మ‌స్యే ఉండ‌దు… క‌రోనా స‌మ‌యంలో భ‌లే విశ్లేష‌ణ‌

Share

Corona: కరోనా క‌ల్లోలం నేప‌థ్యంలో ఎదుర‌వుతున్న అనేకానేక స‌మ‌స్య‌ల్లో మ‌రో షాకింగ్ వార్త వెలుగులోకి వ‌చ్చింది. క‌రోనా మహమ్మారి అదుపు చేసేందుకు గ‌త ఏడాది జాతీయ స్థాయిలో అమలు చేసిన లాక్‌డౌన్ షాకింగ్ ఫ‌లితాలు ఇస్తోంది. ఈ లాక్ డౌన్ వ‌ల్ల ఏకంగా నాలుగు దశాబ్దాలకుపైగా కనిష్ఠానికి పతనమవుతూ గత ఆర్థిక సంవత్సరం (2020-21) జీడీపీ మైనస్‌ 7.3 శాతంగా నమోదైంది. ఈ మేరకు జాతీయ గణాంకాల కార్యాలయం (ఎన్‌ఎస్‌వో) వెల్లడించింది. అయితే, ఈ స‌మ‌యంలో ఓ ఆశ్చ‌ర్య‌క‌ర విశ్లేష‌ణ వెలుగులోకి వ‌చ్చింది.

Read More: Corona: షాక్ఃక‌రోనా టీకా ప‌నిచేయ‌డం లేద‌ని కేసు పెట్టాడు

కోవిడ్ క‌ష్టాలు మాట‌ల్లో చెప్ప‌లేం…

గత ఏడాది జనవరి-మార్చిలో 3 శాతంగా, అక్టోబర్‌-డిసెంబర్‌లో 0.5 శాతంగా జీడీపీ నమోదైంది. అంతకుముందు రెండు త్రైమాసికాల్లో జీడీపీ మైనస్‌కే పరిమితమవగా, మహమ్మారి ప్రభావం నుంచి దేశ ఆర్థిక వ్యవస్థ కోలుకుంటున్న సంకేతాలు వచ్చింది కేవలం ద్వితీయార్ధంలోనే వ‌చ్చాయి. మళ్లీ ఇప్పుడు సెకండ్‌ వేవ్‌.. భారత్‌ను కుదిపేస్తుండగా, తిరిగి వచ్చిపడిన లాక్‌డౌన్లతో మరోసారి ఆర్థిక కార్యకలాపాలు స్తంభించిపోవడం ఆందోళన కలిగిస్తోంది. అయితే 2020 తరహాలో సంపూర్ణ లాక్‌డౌన్లు లేకపోవడం కొంతలోకొంత ఊరటగా నిలుస్తున్నదని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

 

Read More : KCR: తెలంగాణ సీఎం కేసీఆర్ పెద్ద మన‌సు … క‌రోనా టైంలో కీల‌క నిర్ణ‌యం

నోట్ల ప్రింటింగ్ ఒక‌టే మార్గ‌మ‌ట‌

2020-21 సంవ‌త్స‌రానికి జీడీపీ మైన‌స్ 7.3 శాతానికి ప‌డిపోయిన నేప‌థ్యంలో కేంద్ర మాజీ ఆర్థిక మంత్రి చిదంబ‌రం కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. ద్ర‌వ్య‌ లోటు గురించి ఎక్కువ‌గా ఆందోళ‌న చెంద‌కుండా.. ప్ర‌స్తుతం ఉన్న త‌రుణంలో కొత్త‌గా రుణాలైనా తీసుకురావాల‌ని లేదా క‌రెన్సీని ముద్రించాల‌ని అన్నారు. డ‌బ్బును విరివిగా ఖ‌ర్చు చేయాల్సిన సంద‌ర్భంగా వ‌చ్చింద‌న్నారు. దేశ ఆర్థిక వ్య‌వ‌స్థ దీనావ‌స్థ‌కు చేరింద‌ని, ల‌క్ష‌ల సంఖ్య‌లో జ‌నం దారిద్ర్య రేఖ‌కు దిగువ‌న జీవిస్తున్నార‌ని ఆయ‌న అన్నారు. ద్ర‌వ్య‌లోటు గురించి ఆందోళ‌న చెందాల్సిన స‌మ‌యం ఇది కాదు అని, ద్ర‌వ్య‌లోటు 6.5 శాతానికి పెరిగినా స‌మ‌స్య లేద‌ని, కానీ గ‌త ఏడాది త‌ర‌హాలో మ‌రో ఏడాదిని కోల్పోలేమ‌ని, కానీ ప్ర‌భుత్వం స్పందిస్తున్న తీరు చూస్తే, మ‌రో ఏడాదిని మ‌నం కోల్పోయే ప్ర‌మాదం ఉంద‌ని, ప్ర‌భుత్వం ఈ ద‌శ‌లో చాలా ధైర్యంగా అడుగువేసి ఖ‌ర్చును పెంచాల‌ని చిదంబ‌రం స‌ల‌హా ఇచ్చారు. అప్పుచేసైనా, క‌రెన్సీ ముద్రించి అయినా.. డ‌బ్బును మాత్రం ఖ‌ర్చు చేయాల‌న్నారు. ఆయా రాష్ట్రాల‌కు రావాల్సిన జీఎస్టీ వాటా అంద‌క‌పోవ‌డం వ‌ల్ల వ్యాక్సినేష‌న్ ప్ర‌క్రియ దెబ్బ‌తినే ప్ర‌మాదం ఉన్న‌ట్లు ఆయ‌న తెలిపారు.


Share

Related posts

Tamilnadu : తెలుగు వారి బరి తమిళనాడు గురి!

Comrade CHE

బిగ్ బాస్ 4 : ఇలాగే అయితే ఈ సారి ఎలిమినేట్ అయ్యేది తనే…

arun kanna

Balakrishna Comments: టీడీపీలో బాలయ్య లెక్కలు – లాజిక్కులు “ప్లస్సా – మైనస్సా”..!? ఎవరి వాదనలు వారివే..!!

Srinivas Manem