NewsOrbit
జాతీయం న్యూస్

Independence day: దేశ వ్యాప్తంగా ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు..ఎర్రకోటపై త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసిన ప్రధాని మోడీ..

Independence day: దేశ వ్యాప్తంగా 75 వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. దేశ రాజధాని ఢిల్లీ ఎర్రకోటపై ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ జాతీయ జండాను ఆవిష్కరించారు. తొలుత ప్రధాని మోడీ రాజ్ ఘాట్ వద్ద మహత్మాగాంధీ సమాధి వద్ద నివాళులర్పించారు. అనంతరం ఎర్రకోట వద్దకు చేరుకున్న మోడీకి రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ స్వాగతం పలికారు. ప్రధాని మోడీ త్రివిధ దళాల గౌరవవందనం స్వీకరించారు. వైమానిక దళ హెలికాఫ్టర్లు పూలవర్షం కురిపించాయి. అమరజవానులకు మోడీ నివాళులర్పించారు. అనంతరం దేశ ప్రజలను ఉద్దేశించి ప్రధాన మంత్రి మోడీ ప్రసంగించారు. దేశ ప్రజలకు స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు.

Independence day 2021 pm modi
Independence day 2021 pm modi

దేశ విభజన గాయం నేటికీ వెంటాడుతూనే ఉందని మోడీ అన్నారు. ధన, మాన, ప్రాణాలు పోగొట్టుకున్న వాళ్ల చేదు జ్ఞాపకాలు వెంటాడుతున్నాయని అన్నారు. సరికొత్త సంకల్పంతో ముందుకు సాగుదామని పిలుపు నిచ్చారు. శతాబ్ధి ఉత్సవాల నాటికి భారత్ ప్రబల శక్తిగా ఎదగాలని ఆక్షాంక్షించారు. వచ్చే 25 సంవత్సరాలు మనకు అమృత ఘడియలు అన్నారు. కరోనా మహమ్మారిపై దేశం యుద్ధం చేస్తుందని అన్నారు. కరోనా కాలంలో ఫ్రంట్ లైన్ వర్కర్స్ అందించిన సేవలు శ్లాఘనీయమని మోడీ పేర్కొన్నారు. దేశంలో 54 కోట్ల మంది వ్యాక్సిన్ లు వేసుకున్నారని చెప్పారు. ప్రపంచ దేశాలతో పోల్చుకుంటే భారత్ లో మరణాలు తక్కువని మోడీ అన్నారు.  ప్రపంచంలోనే అతిపెద్ద వ్యాక్సినేషన్ కార్యక్రమం భారత్ లో జరుగుతోందని అన్నారు. ఒలంపిక్స్ లో మన క్రీడాకారాలు ప్రతిభ కనబరిచారని కొనియాడారు.  కరతాళ ధ్వనులతో క్రీడాకారులను ప్రోత్సహిద్దామని ప్రధాని చప్పట్లు కొట్టారు. ఒలింపిక్స్ లో పతకాలు సాధించిన వాళ్లు మనందరికీ స్పూర్తి అన్నారు.

సంక్షేమ, అభివృద్ధి పథకాలు హక్కుదారులకు వంద శాతం చేరాలా చేయాలన్నారు. చిన్న వ్యాపారులు, దుకాణదారులు అందరికీ బ్యాంకులతో అనుసంధానం చేయాలన్నారు. ఇంటింటికీ విద్యుత్, తాగునీరు ఇంకా సుదూర స్పప్నం కాకూడదన్నారు. ప్రతి ఇంటికి విద్యుత్, తాగునీరు అందించడం మనందరికి బాధ్యత అని పేర్కొన్నారు. సంక్షేమ పథకాల అమలులో ఏలాంటి వివక్షతకు తావు ఉండకూడదని అన్నారు. సంపూర్ణ వికాసానికి పోషక లోపం అతి పెద్ద అడ్డంకి అన్నారు. ఏ ఒక్కరు ఈ లోపంతో ఉండకుండా చూడాల్సిన అవసరం ఉందన్నారు. రేషన్ షాపుల ద్వారా పోషకాహార ధాన్యాలు అందించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. ఒలంపిక్స్ లో పాల్గొన్న 32 మంది క్రీడాకారులు ఈ వేడుకల్లో పాల్గొన్నారు. స్వాతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా ఎర్రకోట వద్ద కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాటు చేశారు.

 

author avatar
sharma somaraju Content Editor

Related posts

BJP: ‘రాష్ట్ర అభివృద్ధి, ప్రజల భవిష్యత్తు కోసమే మోడీ, బాబు, పవన్ కలిశారు’ .. పీయూష్ గోయల్

sharma somaraju

Lok Sabha Elections: తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల పర్వం

sharma somaraju

YS Jagan: పులివెందులలో అట్టహాసంగా సీఎం జగన్ నామినేషన్ దాఖలు ..జగన్ ఆస్తులు ఎంతంటే..?

sharma somaraju

అప్పుడు అభ్య‌ర్థులు.. ఇప్పుడు మ‌రో స‌మ‌స్య‌… కూట‌మిలో కుంప‌టి..!

వైసీపీ టు బీజేపీ జంపింగ్ లీడ‌ర్‌కు గెలుపు వ‌ర ప్ర‌సాద‌మ‌య్యేనా..?

జ‌గ‌న్‌ను వ‌దిలి ప‌వ‌న్ ద‌గ్గ‌ర‌కు వెళ్లిన ఆ జంపింగ్ నేత గెలిచేనా… !

ఏపీ వార్‌… జ‌నంలో ఇంత క‌న్‌ఫ్యూజ్ ఎందుకు… ఏం డిసైడ్ అయ్యారు…?

గందరగోళంలో ఏపీ కాంగ్రెస్… ష‌ర్మిల‌మ్మా ఇదేంట‌మ్మా…?

Rajinikanth: షాకిస్తున్న ర‌జ‌నీకాంత్ రెమ్యున‌రేష‌న్‌.. కూలీ మూవీకి ఎన్ని వంద‌ల కోట్లు ఛార్జ్ చేస్తున్నారో తెలుసా?

kavya N

YS Jagan: ‘అవినాష్‌ ఏ తప్పు చేయలేదని నమ్మాను కాబట్టే.. టికెట్‌ ఇచ్చాను’ – జగన్

sharma somaraju

Sreeleela: ఆ స్టార్ హీరో మూవీలో ఐటెం సాంగ్ ఆఫ‌ర్‌.. ఒప్పుకుంటే శ్రీ‌లీల ద‌శ తిరిగిన‌ట్లే!

kavya N

Andhra Paper mill: ఆంధ్రా పేపర్ మిల్ కు లాకౌట్ ప్రకటించిన యాజమాన్యం .. కార్మికుల ఆగ్రహం

sharma somaraju

Venu Swamy: మెగా ఫ్యామిలీలో మ‌రో విడాకులు.. సంచ‌ల‌నం రేపుతున్న వేణు స్వామి కామెంట్స్‌!

kavya N

Road Accident: కోదాడ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం .. ఆరుగురు దుర్మరణం

sharma somaraju

Telangana Congress: ఖమ్మం లోక్ సభ కాంగ్రెస్ అభ్యర్ధిగా రఘురామిరెడ్డి .. ఎవరీ రఘురామిరెడ్డి..?

sharma somaraju