India GDP: అన్ని రంగాల్లో తనదైన ముద్ర వేస్తూ దూసుకువెళుతున్న భారత్ ఇటీవలే బ్రిటన్ ను వెనక్కునెట్టి ప్రపంచంలోనే అయిదో అతి పెద్ద ఆర్ధిక వ్యవస్థగా అవతరించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో అతి త్వరలో ప్రపంచంలోనే మూడో అతి పెద్ద ఆర్ధిక వ్యవస్థగా అవతరిస్తుందని పలు నివేదికలు సూచిస్తున్నాయి. 2024 చివరి నాటికి నాలుగు ట్రిలియన్ డాలర్ల జీడీపీని సాధిస్తుందని ఇప్పటికే ఐఎంఎఫ్ వంటి సంస్థలు అంచనా వేశాయి.
అయితే వాటి అంచనాలను తోసి రాజని కొన్ని నెలల ముందుగానే భారత్ జీడీపీ పరంగా నాలుగు ట్రిలియన్ డాలర్ల మార్క్ ను దాటిందని ప్రచారం జరుగుతోంది. సోషల్ మీడియాలో పలువురు యూజర్లు ఐఎంఎఫ్ లైవ్ జీడీపీ గణాంకాలు అంటూ చార్ట్ లను పోస్టు చేస్తూ భారత్ కు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. భారత్ నాలుగు ట్రిలియన్ డాలర్ల మార్క్ దాటినట్లుగా, అలాగే ఆదాయం 2,778.06 డాలర్లు ఉన్నట్లు ఓ చార్టు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. భారత్ కంటే ముందు అమెరికా, చైనా, జపాన్, జర్మనీ దేశాలు తొలి నాలుగు స్థానాల్లో ఉన్నాయి.
భారత జీడీపీ నాలుగు ట్రిలియన్ డాలర్లు మైలురాయిని అందుకుందన్న అంశం సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. అయితే ఇది తప్పుడు ప్రచారమని కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతానికి భారత ఆర్ధిక వ్యవస్థ నాలుగు ట్రిలియన్ డాలర్ల మార్క్ ను క్రాస్ చేయలేదని సమాచారం.
Telangana Election: బీజేపీ నేత బాబూ మోహన్ కు ‘సన్’ స్ట్రోక్
Massive achievement – India’s GDP (Nominal) crosses $4 trillion today for the first time.
Bharat Officially ₹333 Lakhs Crores Economy.. pic.twitter.com/5uDBEuLYBm
— Megh Updates 🚨™ (@MeghUpdates) November 19, 2023