IPL-2021: ఐపీల్ 14వ సీజన్ లో మరోసారి కరోనా కలకలం రేపింది.. ఈ గురువారం రాజస్థాన్ రాయల్స్ తో జరగనున్న తమ రెండో మ్యాచ్ కు ముందుగానే ఢిల్లీ క్యాపిటల్స్ కు భారీ ఎదురు దెబ్బ తగిలింది.. ఢిల్లీ ప్రధాన పేసర్ అన్రిచ్ నోర్ట్జే కు కరోనా పాజిటివ్ గా తేలింది..
పేసర్ అన్రిచ్ నోర్ట్జే నెగిటివ్ రిపోర్ట్ తోనే ఇక్కడికి వచ్చాడు.. అయితే, దురదృష్టవశాత్తు క్వారంటైన్ లో ఉండగా టెస్ట్ చేయించుకున్నప్పుడు.. కోవిడ్ పాజిటివ్‌గా నిర్ధారణ అయిందని ఫ్రాంచైజీ వర్గాలు తెలిపారు.. బీసీసీఐ ఎస్ఓపీ ప్రకారం పాజిటివ్‌గా నిర్ధారణ అయిన వ్యక్తి బయో సెక్యూర్ బబుల్ బయట 10 రోజుల పాటు ఐసోలేషన్ లో ఉండాలి. సీజన్లో ప్రారంభానికి ముందే ఢిల్లీ క్యాపిటల్స్ ఆల్ రౌండర్ అక్షర్ పటేల్ కూడా కరోనా బారిన పడిన విషయం తెలిసిందే..