NewsOrbit
జాతీయం న్యూస్

Justice NV Ramana: పార్లమెంట్‌పై సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎన్వీ రమణ సంచలన వ్యాఖ్యలు

Justice NV Ramana: సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టిన నాటి నుండి న్యాయవ్యవస్థలో తనదైన మార్కు చూపిస్తున్న జస్టిస్ నూతలపాటి వెంకట రమణ (ఎన్వీ రమణ) ఇప్పుడు తాజాగా పార్లమెంటరీ వ్యవస్థపైనే కీలక వ్యాఖ్యలు చేసి సంచలన సృష్టించారు. 75వ స్వాతంత్ర్య  దినోత్సవం సందర్భంగా ఢిల్లీలో సుప్రీం కోర్టు బార్ అసోసియేషన్ ఏర్పాటు చేసిన కార్యక్రమంలో జస్టిస్ ఎన్వీ రమణ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు జరిగిన తీరుపై జస్టిస్ ఎన్వీ రమణ విచారం వ్యక్తం చేశారు. చట్టాలను సరిగ్గా తయారు చేయడం లేదనీ, వాటిపై సరైన చర్చలూ జరగడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. దేశంలో ఇది అత్యంత దారుణమైన విషయమన్నారు.  అర్ధవంతమైన చర్చ లేకుండా చట్టాలను చేయడం వల్ల న్యాయపరమైన చిక్కులు ఏర్పడతాయని స్పష్టం చేశారు.

Justice NV Ramana key comments on parliament
Justice NV Ramana key comments on parliament

Read More: AIIMS Chief:  పిల్లలపై కరోనా థర్డ్ వేర్ ప్రభావం గురించి ఢిల్లీ ఎయిమ్స్ చీఫ్ ఏమన్నారంటే.

కొత్త చట్టాల అసలు ఉద్దేశం ఏమిటో తెలియకుండా పోతుందని అన్నారు. చట్టాల తయారీలో నాణ్యతాలోపం లిటిగేషన్లకు దారి తీస్తుందన్నారు. కొన్ని చట్టాలను కోర్టులు కూడా సరిగా అర్థం చేసుకోలేక పోతున్నాయని చెప్పారు. చట్టసభల్లో మేధావులు, మరియు న్యాయవాదులు లేకపోతే ఇలాంటి పరిస్థితులు నెలకొంటాయని అభిప్రాయపడ్డారు.  దేశ స్వాతంత్ర్యోద్యమం నుండి దేశ తొలి చట్ట సభ ప్రతినిధుల దాకా న్యాయవాదులు ఎనలేని కృషి చేశారని గుర్తు చేసిన జస్టిస్ వెంకట రమణ అనాడు చట్టసభల్లో న్యాయవాదులు ఎక్కువగా ఉండేవారని అన్నారు. దాని వల్ల చర్చలు అర్థవంతంగా, నిర్మాణాత్మకంగా సాగేవని అన్నారు. తీసుకువచ్చే చట్టాలపై సవివరాలతో చర్చ జరిగేదన్నారు.

 

అయితే కాలం మారుతున్న కొద్దీ మొత్తం మారిపోయిందన్నారు. చర్చల్లో పస ఉండటం లేదని, అసలు ఆ చట్టాల ఉద్దేశం కోర్టులకూ తెలియడం లేదనీ, వాటికి అభ్యంతరం చెప్పే అధికారమూ కోర్టులకు లేకుండా పోయిందని అన్నారు. ఈ పరిస్థితులు మారాటంలే న్యాయవాదులు ఇళ్లకే పరిమితం కాకుండా ప్రజా సేవకూ ముందుకు రావాలని ఆయన పిలుపునిచ్చారు. మహాత్మా గాంధీ, జవహర్ లాల్ నెహ్రూ వంటి మహానుభావులు న్యాయవాదులేనని జస్టిస్ రమణ ఈ సందర్భంగా గుర్తు చేశారు. సీజేఐ ఎన్వీ రమణ వ్యాఖ్యలపై సీనియర్ పార్లమెంటేరియన్ లు ఏ విధంగా స్పందిస్తారో వేచి చూడాలి.

author avatar
sharma somaraju Content Editor

Related posts

YS Viveka Case: ఎంపీ అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ రద్దు పిటిషన్ పై హైకోర్టులో విచారణ

sharma somaraju

Arvind Kejriwal: కేజ్రీవాల్ కు మరో షాక్ .. ఏప్రిల్ 1 వరకూ కస్టడీ పొడిగింపు

sharma somaraju

Bapatla: టీడీపీ అభ్యర్ధి కంపెనీలో సోదాలు .. భారీగా నగదు స్వాధీనం

sharma somaraju

YSRCP: జరిగిన మంచి చూసి ఓటేయండి – జగన్

sharma somaraju

Mohanlal: మోహ‌న్ లాల్ కూతురిని ఎప్పుడైనా చూశారా.. ఆమె అందం ముందు హీరోయిన్లు కూడా స‌రిపోరు!

kavya N

Siddharth: ఆ హీరోయిన్ వ‌ల్లే మొద‌టి భార్యతో సిద్ధార్థ్ విడిపోయాడా.. అదితి-సిద్ధార్థ్ మ‌ధ్య ఏజ్ గ్యాప్ ఎంతో తెలుసా?

kavya N

DMDK: టిక్కెట్ రాలేదన్న మనస్థాపంతో సిట్టింగ్ ఎంపీ ఆత్మహత్యాయత్నం .. చికిత్స పొందుతూ మృతి

sharma somaraju

YSRCP: ఎన్నికల్లో దుష్టచతుష్టయాన్ని ఓడించాలి – జగన్

sharma somaraju

BJP: ఏపీ అసెంబ్లీ అభ్యర్ధులను ప్రకటించిన బీజేపీ

sharma somaraju

గుంటూరు వెస్ట్ టాక్‌: వాళ్లంతా ఏకం.. ‘ టీడీపీ మాధ‌వి ‘ తో మ‌మేకం…!

చంద్ర‌బాబు సొంత ఇలాకాలో కూట‌మి పార్టీల్లో క‌ల్లోలం.. !

ఏపీలో టికెట్ ప్లీజ్‌.. ఆ ఒక్క జిల్లాలోనే కాంగ్రెస్‌కు గుట్ట‌లుగా ద‌ర‌ఖాస్తులు..!

Breaking: కేరళ సీఎం కుమార్తె పై మనీలాండరింగ్ కేసు

sharma somaraju

Most Expensive Indian Films: అత్య‌ధిక బ‌డ్జెట్ తో తెర‌కెక్కిన టాప్‌-10 ఇండియ‌న్ మూవీస్ ఇవే.. ఫ‌స్ట్ ప్లేస్ ఏ సినిమాదంటే?

kavya N

YSRCP: కుమారుడు జగన్‌కే విజయమ్మ ఆశీస్సులు

sharma somaraju