Justice NV Ramana: జస్టిస్ ఎన్‌వి రమణ సీరియస్ డెసిషన్..? కొందరిలో వణుకు మొదలైంది..?

Share

Justice NV Ramana: సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ ఎన్వీ రమణ బాధ్యతలు స్వీకరించినప్పటి నుండి దేశంలో కొన్ని వ్యవస్థలను మార్చే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఎన్వీ రమణ ఈ ఏడాది ఏప్రిల్ 24వ తేదీ బాధ్యతలు స్వీకరించిన విషయం తెలిసిందే. ఆయన 2022 ఆగస్టు 23వరకూ సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి పదవిలో ఉంటారు. ఈ నాలుగు నెలల కాలంలోనే అనేక సంచలన నిర్ణయాలను తీసుకున్న జస్టిస్ ఎన్వీ రమణ ఇంకా తనకు ఉన్న ఏడాది పదవీ కాలంలో రెండు మూడు వ్యవస్థలో మార్పునకు శ్రీకారం చుట్టి తన ముద్ర వేసుకోనున్నారు. దేశంలో ఆర్థిక నేరాలకు ఏవరైనా పాల్పడితే దాన్ని సోధించి నిందితులను శిక్ష పడేలా చేయాల్సింది సీబీఐ కాగా, వారు అక్రమంగా సంపాదించిన ఆస్తులను సీజ్ చేసి ప్రభుత్వపరం చేయాల్సిన బాధ్యత ఈడీది. కీలకమైన ఈ రెండు వ్యవస్థలు గాడి తప్పితే ఎవరు దారిలో పెడతారు. ఈ వ్యవస్థలు గాడి తప్పదానికి కారణమే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల్లో రాజకీయ పెద్దలు అయితే గాడిలో పెట్టేవారు ఎవరు ఉంటారు. కశ్చితంగా సుప్రీం కోర్టే గాడిలో పెట్టాలి. న్యాయవ్యవస్థే వాటిని ఒక గాడిలో పెట్టాలి. ఇతర వ్యవస్థలు గాడి తప్పుతున్నప్పుడు దాన్ని సక్రమంగా పెట్టాల్సిన బాధ్యత రాజ్యాంగ బద్ధంగా చూసుకుంటే  న్యాయవ్యవస్థదే. సో..అందుకే ఎన్వీ రమణ ఆ బాధ్యతలను భుజస్తందాలపై ఎత్తుకున్నట్లు కనబడుతోంది.

Justice NV Ramana Reforms in the key branch
Justice NV Ramana Reforms in the key branch

Read More: CBI in West Bengal: సీబీఐ ఏం చేయబోతుందో..!? బెంగాల్ లో కీలక పరిణామాలు – మమత ఇక మాజీ..!?

దేశంలో వివిధ రాష్ట్రాలకు సంబంధించి సీబీఐ, ఈడీ కేసులు సంవత్సరాల తరబడి సాగుతున్న విషయం తెలిసిందే.  దాదాపు 15 సంవత్సరాలు అవుతున్నా కొన్ని కేసుల్లో చార్జీ షీట్ లు కూడా దాఖలు కావడం లేదు. కొన్ని కేసుల్లో 15 ఏళ్లు, 18 ఏళ్లు, 20 ఏళ్లు కూడా అవుతున్నాయి. ఈడీ అక్రమాస్తులను గుర్తించి ఆటాచ్ చేయడంతో సరిపెడుతుంది తప్ప పురోగతి కనిపించడం లేదు. అస్తులను అటాచ్ చేయడం వల్ల ఈడీకి వచ్చే ప్రయోజనం ఏమీ ఉండదు. ఈడీ ఈ కేసులలో అభియోగాలకు సంబంధించి నేరం నిరూపింపజేసి ఆస్తులను ప్రభుత్వపరం చేస్తే ఉపయోగం ఉంటుంది. సీబీఐ కూడా కొన్ని కేసులను సంవత్సరాల తరబడి విచారిస్తున్నది. ఉదాహరణకు తీసుకున్నట్లయితే కేరళకు చెందిన సిస్టర్ జమీన్ హత్య కేసును 28 సంవత్సరాల పాటు విచారించింది. ఇప్పుడు ఏపికి సంబంధించి  మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో కూడా విచారణ చేపట్టి సంవత్సరం దాటినా ఏమీ నిర్ధారించలేకపోయింది సీబీఐ. దర్యాప్తు బాధ్యతలు చేపట్టిన నాడు ఎలా ఉందో ఇప్పుడూ అదే పరిస్థితి ఉన్నట్లు కనబడుతోంది. కేసు దర్యాప్తు చివరి దశకు వెళ్లింది, 95 శాతం పూర్తి అయింది అనుకుంటున్న తరుణంలో మళ్లీ వెనక్కు వచ్చేస్తున్నారు. ఇటీవల నిందితులకు సంబంధించి సమాచారం ఇవ్వాలంటూ పేపర్ యాడ్ కూడా ఇచ్చారు. నేర పరిశోధనలో కీలకమైన సీబీఐ, ఈడీ సంస్థలు గాడి తప్పడం వల్ల నేరస్తులు తప్పించుకునే ప్రమాదం ఉంది.

సో.. ఈ రెండు గాడిలో ఉండాలనీ, న్యాయబద్దంగా పని చేయాల్సిందేనని నిన్న జస్టిస్ ఎన్వీ రమణ వాటికి క్లాస్ పీకారు. ఒ రకంగా ఆ వ్యవస్థలను ఆయన హెచ్చరించారు. ఈ పరిణామాలు అన్నీ చూస్తుంటే జస్టిస్ ఎన్ వీ రమణ ఈ వ్యవస్థలపై బాగానే దృష్టి పెట్టారు అని భావించాల్సి వస్తోంది. ఆయన తీసుకున్న నిర్ణయాల కారణంగా సీబీఐ, ఈడీ సక్రమంగా పని చేస్తే నేరస్తులు తప్పించుకునే అవకాశం ఉండదు. రాజకీయ వ్యవస్థ మెరుగు పడే అవకాశం ఉంటుంది. రాజకీయ నాయకులు కూడా తప్పు చేయడానికి భయపడే పరిస్థితులు వస్తాయి.


Share

Related posts

క‌రోనా రోగి ఉన్న ప్ర‌దేశంలోని గాలితోనూ క‌రోనా వ‌స్తుంది..!

Srikanth A

జగన్ వద్ద ఆ టాపిక్ ఎత్తే ధైర్యం ఎవరికీ లేదా..??

somaraju sharma

బ్రేకింగ్ : గవర్నర్ ని కలిసి వచ్చిన నిమ్మగడ్డ విడుదల చేసిన ప్రెస్ నోట్

arun kanna