NewsOrbit
జాతీయం న్యూస్

Justice NV Ramana: NV రమణ పవర్ ఫుల్ ఆర్డర్స్..! మోడీ, అమిత్ షా పై తీవ్ర ఆగ్రహం..!!

Justice NV Ramana: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన జస్టిస్ ఎన్ వి రమణ సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టిన నాటి నుండి కూడా కొన్ని వ్యవస్థలను మార్పు చేసి, వ్యవస్థీకృతంగా ఉన్న లోపాలపై దృష్టి పెట్టారు. ప్రజలకు ఉపయోగపడాలి, నేరస్తులకు త్వరగా శిక్ష పడాలి, నిర్ధోషులు త్వరగా బయటకు రావాలి, తప్పు చేసిన వాడు తప్పించుకోవడానికి వీలు లేదు. ఇవన్నీ కూడా న్యాయస్థానాల బాధ్యత. న్యాయస్థానాలు సక్రమంగా బాధ్యత నిర్వహించాలంటే ఆయా కోర్టుల న్యాయమూర్తులు, ప్రధాన న్యాయమూర్తులు సక్రమంగా పని చేయాలి, కీలకమైన ఆదేశాలు ఇవ్వాలి. అదే పని ఇప్పుడు జస్టిస్ ఎన్ వి రమణ చేస్తున్నారు. ఆయన ప్రధాన న్యాయమూర్తి అయన తరవాత అనేక కీలక ఆదేశాలు ఇస్తూ తనదైన మార్కు చూపిస్తున్నారు. ప్రజా ప్రతినిధుల మీద ఉన్న కేసుల విషయంలో ఆయన మీద అనేక ఒత్తిడులు ఉన్నాయి. రాజకీయపరమైన ఒత్తిడులతో పాటు రకరకాల ఒత్తిడులు ఉన్నప్పటికీ ఆయన బలమైన  వ్యవస్థలకు తలొగ్గకుండా తాను అనుకున్నది చేసి తీరేలా నేరస్తులకు శిక్ష పడేలా, ప్రజలకు సుపరిపాలన అందించాలంటే మంచి ప్రజా ప్రతినిధులు, మంచి పాలకులు ఉండాలనే ఉద్దేశం నెరవేర్చే పనిలో ఉన్నారు. ముందడుగు వేశారు.

Justice NV Ramana serious comments on central govt
Justice NV Ramana serious comments on central govt

Read More: Chandrababu Naidu: హాటాహుటిన ఢిల్లీకి బాబు..? పీకే, రాహుల్ గాంధీతో సీక్రెట్ భేటీ..?

తాజాగా ఏమిజరిగింది అంటే ప్రజా ప్రతినిధులపై ఉన్న క్రిమినల్ కేసుల (నేరచరితులుగా ఉన్న ఎమ్మెల్యేలు ఎంపిల కేసులు) విచారణను త్వరగా పూర్తి చేసి అంటే ఆరు నెలల వ్యవధలోనే ఆ కేసుల్లో అయితే దోషి  లేకుంటే నిర్ధోషి అని తేల్చేసి దోషి అయితే శిక్షలు ఖరారు చేసి అమలు చేసేందుకు ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఏర్పాటు చేయాలనే ప్రతిపాదన ఎప్పటి నుండో ఉంది. దాదాపు 2016-17 నుండే ఈ ప్రతిపాదన ఉంది. బీజేపీకి చెందిన అమిక్ క్యూరీ దీని మీద పోరాటం చేస్తున్నారు. లీగల్ గా దానికి సంబంధించిన అన్ని డాక్యూమెంట్స్ ను కూడా వెరిఫై చేసి ఏ చట్టం ప్రకారం ఎవరికి శిక్ష పడాలి, తక్కువ సమయంలో విచారణ పూర్తి చేసి ఫాస్ట్ ట్రాక్ కోర్టుల వల్ల లాభం ఏమిటి, దేశానికి, వ్యవస్థకు ఎటువంటి ఉపయోగం అనేది ఆయన నిరూపించారు. జస్టిస్ ఎన్ వి రమణ దానికి అంగీకరించి ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఏర్పాటు చేయాడానికి సిద్ధఫడుతున్నారు. ఇప్పటికే కొన్ని కోర్టులను ప్రయోగాత్మకంగా అమలు చేస్తున్నారు. కానీ దీనికి కేంద్రం అడ్డుపుల్లవేసే ప్రయత్నం చేస్తోంది.

దీనికి సంబంధించిన స్టేటస్ ఇవ్వడానికి, దేశ వ్యాప్తంగా ప్రజా ప్రతినిధులపై ఏయే కేసులు ఉన్నాయి, దాని వివరాలు ఏమిటి, వాటికి ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఏర్పాటు చేయాలంటే ఏయే వనరులు ఇవ్వాలి, అంటే సిబ్బంది నియామకం, కోర్టులు ఏర్పాటు, దీనికి సంబంధించి ఆర్థిక, న్యాయ సహకారాలు, ప్రభుత్వ సహకారంపై స్టేటస్ రిపోర్టు ఇవ్వాలి. ఈ రిపోర్టు ఇవ్వడానికి కేంద్ర ప్రభుత్వం నాన్చుతూ వస్తోంది. తాజాగా మొన్న కూడా రెండు వారాల గడువు అడిగింది. దానికి జస్టిస్ ఎన్ రమణ అంగీకరించలేదు. రెండు రోజుల్లో ఆ రిపోర్టు ఉండాలి అని చాలా సీరియర్ గా చెప్పారు.

కేంద్ర ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల దేశంలో 4,122 మంది నేరచరిత్ర ఉన్న ప్రజా ప్రతినిధులు శిక్షలు అమలు కాకుండా, దోషులుగా ఖరారు కాకుండా, ప్రజల్లో తిరుగుతున్నారు, పరిపాలన చేస్తున్నారు, వీళ్లకు ఆ హాక్కు లేదంటూ జస్టిస్ ఎన్ వి రమణ ఘాటుగా వ్యాఖ్యానించారు. కేంద్ర ప్రభుత్వంపై సీరియస్ అవుతూ రెండు రోజుల్లో నివేదిక ఇవ్వాలని అడిగారు. సో.. ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఏర్పాటు జరిగితే ఏమి జరుగుతుంది అంటే వైఎస్ జగన్మోహనరెడ్డి లాంటి క్రిమినల్ కేసులు ఉన్న పాలకులు వాళ్లు సచ్చీలులా, దోషులా నిర్ధోషులా అనేది తేలిపోతుంది. జగన్మోహనరెడ్డి గారేమో నేను 43వేల కోట్లు దోచుకోలేదు, ఆ నాడు కాంగ్రెస్ పార్టీ పన్నిన కుట్ర, నన్ను రాజకీయంగా ఇరికించడానికి అక్రమ కేసులు బనాయించారని అంటున్నారు. సీబీఐ మాత్రం ఆయన 43 వేల కోట్ల అవినీతి చేశారంటూ చార్జిషీట్లు వేసింది. దాదాపు 11 కేసుల్లో ఏ 1గా తేల్చింది. దీన్ని తేల్చాల్సింది సీబీఐయో, జగన్మోహనరెడ్డియో కాదు. న్యాయస్థానం. ఆ చార్జిషీట్లలో నమోదు చేసిన అభియోగాలు నిజమా కాదా?, చట్టబద్దమైనవా? కాదా, చట్టం ప్రకారం ఆయన తప్పు చేశారా? లేదా అని తేల్చాల్సింది కోర్టులు.

కోర్టుల్లో లక్షలాది కేసుల కారణంగా ఈ కేసులు విచారించడానికి ఖాళీ ఉండట్లేదు. అనేక కేసులు పెండింగ్ లో ఉంటున్నాయి. అందుకే ఇటువంటి కేసులు విచారించడానికి ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఏర్పాటు చేయాల్సిన అవసరం మన దేశంలో ఉంది. 4 వేల మందికి పైగా నేరచరిత కల్గిన వారు ప్రజా ప్రతినిధులుగా ఉండి ఈ కేసుల నుండి తప్పించుకుని తిరుగుతున్నారు. ఈ సంఖ్య పెరగవచ్చు, తగ్గవచ్చు. వీళ్లపై ఆరు నెలల్లో విచారణ పూర్తి అవ్వాలి అన్నది సుప్రీం కోర్టు ఉద్దేశం. జగన్మోహనరెడ్డి గారి కేసుల విషయాన్ని తీసుకుంటే 10 సంవత్సరాల నుండి విచారణ దశలోనే ఉన్నాయి. అందుకే ఆరు నెలల్లో విచారణ పూర్తి చేయాలంటే ఫాస్ట్ కోర్టు లు ఏర్పాటు చేయాలి. అన్ని రాష్ట్రాల్లో ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఉండాలని సుప్రీం కోర్టు భావిస్తోంది. దానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వ సహకారం ఉంటేనే త్వరగా జరుగుతుంది. కేంద్ర సహకరించడం లేదు కాబట్టి జస్టిస్ ఎన్ వి రమణ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ పరిణామంతో ఆ 4,122 మందిలో వణుకుడు మొదలైంది. ఫాస్ట్ ట్రాక్ కోర్టులకు సంబంధించి త్వరలో సుప్రీం కోర్టు ఫైనల్ డెసెషన్ చెప్పబోతున్నది. ఆ డెసెషన్ చెప్పిన తరువాత కేంద్ర ప్రభుత్వం కూడా ఏమి చేయలేదు. కశ్చితంగా జస్టిస్ వెంకట రమణ సంచలన ఆదేశాలు ఇస్తుండటంతో కేంద్ర ప్రభుత్వం ఏ విధంగా స్పందిస్తుందో చూడాలి.

author avatar
Srinivas Manem

Related posts

AP Elections 2024: రేపటి నుండి నామినేషన్లకు రంగం సిద్దం – సీఈవో ముకేశ్ కుమార్ మీనా

sharma somaraju

Inter Board: ఏపీ ఇంటర్ బోర్డు కీలక ప్రకటన .. రీ వెరిఫికేషన్, బెటర్మెంట్ ఫీజు చెల్లింపునకు పూర్తి సమాచారం ఇది

sharma somaraju

Chandrababu: ప్రభుత్వంపై చంద్రబాబు కీలక ఆరోపణ ..ఆ కేసు దర్యాప్తు ఈసీ పర్యవేక్షణలో జరగాలి

sharma somaraju

Janasena: అభ్యర్ధులకు బీఫామ్ లు అందజేసిన పవన్ కళ్యాణ్

sharma somaraju

Chiyaan Vikram: సీరియ‌ల్ యాక్ట‌ర్‌ నుంచి స్టార్ హీరోగా విక్ర‌మ్ ఎలా ఎదిగాడు.. అత‌ని భార్య‌, కూతురిని ఎప్పుడైనా చూశారా?

kavya N

Tollywood Actor: ఈ ఫోటోలో ఉన్న స్టార్ హీరోను గుర్తుప‌ట్టారా.. రీల్ లైఫ్‌లోనే కాదు రియ‌ల్ లైఫ్‌లో కూడా ల‌వ‌ర్ బాయే!

kavya N

Sri Rama Navami: భద్రాద్రిలో వైభవంగా శ్రీ సీతారాముల కల్యాణం

sharma somaraju

NTR: ఎన్టీఆర్ పాతికేళ్ల క‌ల దేవ‌రతో అయినా నెరవేరుతుందా..?

kavya N

Sri Ramadasu: భక్తిరస మహాకావ్యం శ్రీరామదాసు సినిమా గురించి ఈ టాప్ సీక్రెట్స్ మీకు తెలుసా?

kavya N

Ayodhya: అయోధ్య రామాలయంలో అద్భుత దృశ్యం .. సూర్య తిలకాన్ని దర్శించి తరించిన భక్తులు

sharma somaraju

Tollywood: తెలుగు తెర‌పై శ్రీ‌రాముడి వేషం వేసిన మొట్ట మొద‌టి న‌టుడు ఎవ‌రో తెలుసా.. ఎన్టీఆర్, ఏఎన్నార్ మాత్రం కాదు!

kavya N

CM YS Jagan Attack Case: సీఎం జగన్ పై దాడి కేసులో పురోగతి .. పోలీసుల అదుపులో అనుమానిత యువకులు

sharma somaraju

Lok Sabha Elections: ఏపీలో మరో ఉన్నతాధికారిపై బదిలీ వేటు ..మరో ఇద్దరు కీలక అధికారులపై సీఈసీకి కూటమి నేతల ఫిర్యాదు

sharma somaraju

Encounter: చత్తీస్‌గఢ్ లో భారీ ఎన్ కౌంటర్ .. 29 మంది మవోయిస్టులు మృతి

sharma somaraju

TDP: టెక్కలి వైసీపీకి షాక్ ..టీడీపీలో చేరిన కీలక నేతలు

sharma somaraju