Kamal hasan : కమల్ కు అన్నీ శుభ శకునాలే!

Share

Kamal hasan : మక్కాల్ నీది మయ్యం అంటూ రాజకీయాల్లోనూ తన మార్కు చూపించాలని తహతహలాడుతున్న విశ్వనటుడు కమల్ హాసన్ కు ప్రస్తుత ఎన్నికల్లో అన్ని శుభ శకునాలు కనిపిస్తున్నాయి. మంగళవారం జరిగిన ఎన్నికల్లో ఆయనకు సానుకూల పవనాలు వీచిన ఇట్లు విశ్లేషకులు భావిస్తున్నారు. స్థానికంగా ప్రత్యర్థి పార్టీల్లో ఏర్పడిన కొన్ని లుకలుకలు అనుకూలంగా మారుతున్నట్లు కనిపిస్తున్నాయి.

kamalhasan-is-it-win-to-elections
kamalhasan-is-it-win-to-elections

సినీ నటుడు కమల్ హాసన్ కోయంబత్తూరు దక్షిణ నియోజకవర్గం నుంచి పోటీలో ఉన్నారు. జిల్లాలోని 10 నియోజకవర్గాల్లో అత్యంత చిన్నదైన ఈ నియోజకవర్గం నుంచి కమల్ హాసన్ పోటీ చేయడం ఆయనకు ఇప్పుడు అనుకూలిస్తుంది. ప్రతి వీధి, ప్రతి ఇల్లును టచ్ చేస్తూ ప్రచారం చేశారు. ఆయనకు సినీ నటి సుహాసిని తో పాటు ఆయన కూతుళ్లు ప్రచారంలో పాల్గొన్నారు. స్థానిక ప్రజల నుంచి మద్దతు పుష్కలంగా లభించి ఉందని అంచనా వేస్తున్నారు. 133 అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేస్తున్న కమల్ పార్టీ కచ్చితంగా విజయం సాధిస్తుంది అన్న నియోజకవర్గం కోయంబత్తూరు దక్షిణం మాత్రమే.

ఇక్కడ మొత్తం 1.50 లక్షల ఓట్లు ఉన్నాయి. మక్కల్ నీది మయ్యం 2019లో ఇక్కడి నుంచి లోక్ సభకు పోటీ చేసింది. మూడో స్థానంలో నిలిచిన ఆ పార్టీకి ఏకంగా 1,44,829 ఓట్లు వస్తే, కేవలం కోయంబత్తూరు దక్షిణ నియోజకవర్గం లోనే 23,838 ఓట్లు వచ్చాయి. అంటే ఇక్కడ పార్టీ బలంగా ఉన్నట్టు కమల్ భావించారు. దీంతోనే మొదట మైలాపూర్ నుంచి పోటీ చేయాలని భావించిన కమల్‌హాసన్ తర్వాత మనసు మార్చుకుని, కోయంబత్తూరు దక్షిణానికి మారారు. ఆయన నిర్ణయం మంచి ఫలితాన్ని ఇస్తుంది అన్నది రాజకీయ విశ్లేషకుల మాట. ఎన్నికలు అయిపోయిన తర్వాత జరిగిన పరిణామాలలో ఎన్నికల ప్రక్రియను పరిశీలిస్తే తేలిందని వారు చెబుతున్నారు.

2016 ఎన్నికల్లో ఎక్కడి నుంచి అన్నాడీఎంకే అభ్యర్థి 30 వేల మెజారిటీతో విజయం సాధించారు. అయితే ప్రస్తుతం బిజెపి పొత్తులో భాగంగా ఆ పార్టీకి సీట్ కేటాయించడం స్థానిక అన్నాడీఎంకే నేతల్లో అసంతృప్తి నింపింది. ఎక్కడ నుంచి బిజెపి తరఫున మహిళా మోర్చా నాయకురాలు వానతి శ్రీనివాసన్ బరిలో నిలిచారు. అయితే ఆమెకు అన్నాడిఎంకె నాయకుల నుంచి కార్యకర్తల నుంచి ప్రతిఘటన ఎదురయింది. వారు ఏ కోశానా ఆమెకు సహకరించడం లేదు. మిత్రపక్షాలు గా ఉన్నా అన్నా డీఎంకే బిజెపి నేతల మధ్య ఉన్న అగాదం కమల్ కు కలిసొచ్చింది. దింతో ఇది కమల్ కు లభించే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు కనిపిస్తోంది.

అన్నాడీఎంకే లోని కీలక నేతల్లో ముఖ్యంగా గతంలో ఎమ్మెల్యేగా పనిచేసిన అమ్మాన్ కె. అర్జునన్ బీజేపీ కి సహకరించేందుకు ఏ మాత్రం ఆసక్తి చూపడం లేదు దీంతో ఆయన కేడర్ అంతా ఈసారి ఎన్నికల్లో కమల్‌హాసన్‌కు పనిచేయాలని అంతర్గతంగా ఒక నిర్ణయానికి వచ్చి పని చేశారు. దీని ద్వారా తన బలాన్ని పార్టీకి చూపించాలని ఆయన బిజెపికి వ్యతిరేకంగా ఎన్నికల్లో పనిచేశారు . అసలు ఏమాత్రం బలం లేని బిజెపి కు ఈ స్థానాన్ని కేటాయించడం వెనుక పార్టీలోని కొందరు పెద్దల చేతగానితనం ఉందని అన్న డీఎంకే కార్యకర్తలు బహిరంగంగా విమర్శిస్తున్నారు. దీంతో బీజేపీ అభ్యర్థి ప్రచారంలో అడుగడుగునా అడ్డంకులు ఎదురయ్యాయి.

కోయంబత్తూరు దక్షిణ నియోజకవర్గం లో అక్షరాస్యత శాతం ఎనభై దాటింది. చదువుకున్న వర్గాలు కచ్చితంగా తనను ఆదరిస్తారని కమల్‌హాసన్ గట్టిగా నమ్ముతున్నారు. ప్రచారంలోనూ ఆయన మూడో ప్రత్యామ్నాయం చూడాలని ప్రజలను పదేపదే కోరడం, కుటుంబ పాలన మీద విమర్శలు చేయడం వంటివి ఓటర్లను ఆకర్షిస్తున్నాయి. తమిళనాడు మొత్తం రెండు కుటుంబాల, పార్టీలు చేతుల్లోనూ ఉండిపోవడంతో అభివృద్ధి కానరావడం లేదంటూ ఆయన అంకెలతో చెప్పడం ఓటర్లను ఆకట్టుకుంది. ఇక ఈ నియోజకవర్గంలో తెలుగు ప్రజలు ప్రభావం బాగా ఎక్కువ. పలు పరిశ్రమల్లో వారు పని చేసుకుంటూ అక్కడే సెటిల్ అయ్యారు. దీంతో తెలుగుప్రజలకు సుపరిచితులైన కమల్ హాసన్ ఖచ్చితంగా వారి మద్దతును పొందే అవకాశం ఉందని ఇక్కడ మంచి మెజారిటీతో కం విజయం సాధిస్తారని భావిస్తున్నారు.


Share

Related posts

Tirupati by poll : తిరుపతి ఓటరు ఎటు..? టఫ్ ఫైట్ తప్పేట్టు లేదు..!!

Muraliak

ప్లాన్ మార్చి… పాఠం నేర్చుకుంటున్న జగన్…!

Srinivas Manem

కీలక హోదాల్లో ఉన్న వారిలో టెన్షన్.. జగన్ మార్క్ డెసిషన్స్ తో లాభమా..నష్టమా..

Special Bureau