NewsOrbit
జాతీయం న్యూస్ రాజ‌కీయాలు

Kapil Sibal: సీనియర్ కాంగ్రెస్ నేత కపిల్ సిబల్ పార్టీని ఎందుకు వీడారు అంటే..?

Kapil Sibal: కాంగ్రెస్ పార్టీ దేశంలో తీవ్ర గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. పార్టీకి కనుచూపు మేరలో భవిష్యత్తు లేదని తెలియడంతో సీనియర్ నేతలు చాలా మంది వేరే దారి చూసుకుంటున్నారు. కొందరు సీనియర్ నేతలు ఆ పార్టీకి గుడ్ బై చెబుతూనే ఉన్నారు. పార్టీకి పూర్వ వైభవం తీసుకువచ్చేందుకు ఆ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ నేతృత్వంలో ఇటీవల రాజస్థాన్ లో చింతన్ శివిర్ లో నిర్వహించి అనేక కీలక నిర్ణయాలు తీసుకున్నారు. అయినప్పటికీ ఆ పార్టీలోని సీనియర్ నేతలు పార్టీని వీడుతూనే ఉన్నారు. ఈ క్రమంలో ఇటీవల సీనియర్ నేత కపిల్ సిబల్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి సమాజ్ వాది పార్టీ మద్దతుతో రాజ్యసభ కు నామినేషన్ దాఖలు చేశారు.

Kapil Sibal sensational comments
Kapil Sibal sensational comments

Kapil Sibal: స్వతంత్రంగా వ్యవహరించేందుకే..

అయితే దాదాపు మూడు దశాబ్దాలకు పైగా కాంగ్రెస్ పార్టీతో ఉన్న అనుబంధాన్ని కపిల్ సిబల్ తెంచుకుని బయటకు వెళ్లడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. అసలు కపిల్ సిబల్ పార్టీని ఎందుకు వీడాల్సి వచ్చింది అనే దానిపై ఆయన ఆసక్తికరమైన కామెంట్స్ చేశారు. ఓ జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో కపిల్ సిబల్  సంచలన వ్యాఖ్యలు చేశారు. భవిష్యత్తులో తాను ఎస్పీ తో సహా ఏ రాజకీయ పార్టీలో చేరడం లేదని చెప్పారు కపిల్ సిబల్. ఇలాంటి పరిణామాలు చాలా కష్టంగా అనిపించవచ్చు కానీ ప్రతి ఒక్కరూ స్వార్ధంతో ఆలోచించాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు కపిల్ సిబల్ ఇప్పుడు తన సమయం వచ్చిందన్నారు. పార్లమెంట్ లో స్వతంత్రంగా తన గళం వినిపించాలని అనుకుంటున్నట్లు చెప్పారు. సుదీర్ఘకాలంగా ఒక పార్టీకి కట్టుబడి ఉండటం, ఆ పార్టీ సిద్ధాంతాలకు కట్టుబడి ఉండటం చాలా కష్టమైన విషయమని అన్నారు.

హటాత్తుగా తీసుకున్న నిర్ణయం కాదు

కాంగ్రెస్ పార్టీ నుండి బయటకు రావాలి అనుకోవడం హఠాత్తుగా తీసుకున్న నిర్ణయం ఏమి కాదనీ తానేమీ తమాషా చేయడం లేదని అన్నారు కపిల్ సిబల్. ముందస్తుగా సంకేతాలు ఇచ్చినా ఎవరికి తెలియకపోవడం తనకు ఆశ్చర్యాన్ని కల్గించిందన్నారు. కాంగ్రెస్ అసమ్మతి నేతల జి 23 లో కపిల్ సిబల్ కూడా ఉన్నారు. గాంధీ కుటుంబ నాయకత్వాన్ని వ్యతిరేకంగా గళం విప్పినవారిలో కపిల్ సిబల్ కూడా ఉన్నారు. సీనియర్ న్యాయవాది అయిన కపిల్ సిబల్.. న్యాయ నిపుణుడుగా పార్టీ లీగల్ వింగ్ ను పర్యవేక్షించారు. ఇటువంటి సీనియర్ నేత పార్టీ నుండి నిష్క్రమించడం భవిష్యత్తులో ఆ పార్టీకి ఇబ్బందికర పరిస్థితులు తలెత్తే అవకాశం ఉందని రాజకీయ వర్గాల్లో టాక్.

author avatar
sharma somaraju Content Editor

Related posts

YSRCP: జగన్ చేతిలో చంద్రబాబు కూటమి మేనిఫెస్టో

sharma somaraju

Lok Sabha Election 2024: ప్రశాంతంగా  ముగిసిన తొలి దశ పోలింగ్ .. పోలింగ్ శాతం ఎంతంటే..?

sharma somaraju

TDP: జోగికి షాక్ ఇచ్చిన వసంత కృష్ణప్రసాద్ .. మంత్రి బావమరుదులకు టీడీపీ కండువా కప్పి..

sharma somaraju

Ram Pothineni: షాకిస్తున్న రామ్ రెమ్యున‌రేష‌న్‌.. అగ్ర హీరోల‌నే మించిపోతున్నాడుగా!?

kavya N

Lok Sabha Elections 2024: తెలుగు రాష్ట్రాల్లో అట్టహాసంగా ప్రముఖుల నామినేషన్లు

sharma somaraju

లాస్ట్ మినిట్‌లో టీడీపీలో మారిన సీట్లు… వాళ్ల‌కు షాక్‌లు.. వీళ్ల‌కు స్వీటు…!

YS Viveka Case: కడప కోర్టు ఆదేశాలపై హైకోర్టుకు – సునీత

sharma somaraju

Lok sabha Election: సస్పెన్షన్ ఉద్యోగులకు బిగ్ రిలీఫ్ ..సిద్దిపేట లో సెర్ప్ ఉద్యోగుల సస్పెన్షన్ పై హైకోర్టు స్టే

sharma somaraju

Manamey Teaser: ఆక‌ట్టుకుంటున్న శ‌ర్వానంద్ `మ‌న‌మే` టీజ‌ర్.. ఇంత‌కీ ఆ బుజ్జిబాబు ఎవ‌రంటే?

kavya N

Tollywood Actors: టాలీవుడ్ లో ఎక్కువ ఇండ‌స్ట్రీ హిట్స్ అందుకున్న టాప్‌-5 హీరోలు వీళ్లే.. ఫ‌స్ట్ ప్లేస్‌లో ఉన్న‌ది ఎవ‌రంటే?

kavya N

Nikhil Siddhartha: తండ్రి అయ్యాక ఆ అల‌వాటు వ‌దిలేసిన నిఖిల్‌.. ఇంత‌కీ ఈ హీరోగారి కొడుకు పేరేంటో తెలుసా?

kavya N

Keerthy Suresh: శంక‌ర్ కూతురి పెళ్లిలో కీర్తి సురేష్ క‌ట్టుకున్న చీర ఎన్ని ల‌క్ష‌లో తెలిస్తే క‌ళ్లు తేలేస్తారు!

kavya N

ఏపీలో స‌ర్వేలు – సంగ‌తులు: ఒకే రోజు రెండు డిఫ‌రెంట్ స‌ర్వేలు… ఏది నిజం.. ఏది అబ‌ద్ధం…?

నామినేష‌న్లు మొద‌ల‌య్యాయ్‌… జ‌గ‌న్‌, బాబుకు కొత్త త‌లనొప్పి స్టార్ట్…!

వైసీపీలో ఈ లీడ‌ర్లు మామూలు ల‌క్కీ కాదుగా… న‌క్క తోకే తొక్కారు…!