NewsOrbit
జాతీయం న్యూస్ రాజ‌కీయాలు

Karnataka: అధినేతల ఒత్తిడితో మెత్తబడిన డీకే శివకుమార్ ..! నూతన ప్రతిపాదనకు ఒకే ..?  సీఎంగా సిద్దరామయ్యే.. కానీ..

Karnataka: గత నాలుగు రోజులుగా ఉత్కంఠ రేపుతున్న కర్ణాటక ముఖ్యమంత్రి అభ్యర్ధి వ్యవహారానికి పరిష్కారం కుదిరినట్లు తెలుస్తొంది. కర్ణాటక ప్రభుత్వ ఏర్పాటుపై ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీలు ఏకాభిప్రాయానికి వచ్చినట్లు సమాచారం. పార్టీ అధినేతల ఒత్తిడితో కర్ణాటక పీసీసీ అధ్యక్షుడు డీకే శివకుమార్ ఒక మెట్టు దిగారు. అధిష్టానం సూచనకు ఒకే చెప్పినట్లుగా తెలుస్తొంది. అందరూ ఊహించినట్లుగానే మాజీ ముఖ్యమంత్రి, సీనియర్ నేత సిద్ద రామయ్య మరో సారి కర్ణాటక సీఎం పీఠాన్ని అధిష్టించబోతున్నారు. అయితే సీఎం పదవికి మొదటి నుండి పట్టుబట్టిన డీకే శివకుమార్ డిప్యూటి సీఎంగా బాధ్యతలు తీసుకోబోతున్నారు. దీనిపై పార్టీ అధిష్టానం నేడు అధికారికంగా ప్రకటన విడుదల చేయనున్నది.

Karnataka cm decision updates siddaramaiah dk shivakumar

 

బుధవారం పలు నాటకీయ పరిణామాలు చోటుచేసుకున్నాయి. తొలుత చెరోక రెండున్నరేళ్లు సీఎం పదవిలో ఉంటారనీ, తర్వాత సిద్ద రామయ్యే పూర్తి కాలం సీఎంగా ఉంటారని ప్రచారాలు సాగాయి. సిద్దా రామయ్య కాబోయే ముఖ్యమంత్రి అంటూ మీడియాలో వార్తలు రావడంతో ఏఐసీసీ కర్ణాటక ఇన్ చార్జి రణ్ దీప్ సుర్జేవాలా సీరియస్ అయ్యారు. తప్పుడు వార్తలు ప్రసారాలు చేస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.  ఢిల్లీలో బుధవారం రాత్రి నుండి గురువారం తెల్లవారుజాము వరకూ పార్టీ అధిష్టానం తీవ్ర మంతనాలు జరిపింది.

Sidda Ramaiah

చివరకు ఇలా..

మొదటి రెండేళ్ల పాటు సిద్దా రామయ్య సీఎంగా ఉంటారు. డిప్యూటి సీఎం గా డీకే శివకుమార్ బాధ్యతలు చేపడతారు.  ఆ తర్వాత మూడేళ్ల డీకే శివకుమార్ కు ముఖ్యమంత్రిగా అవకాశం కల్పించనున్నారు. ప్రస్తుతం డీకే శివకుమార్ కు డీప్యూటి సీఎం పదవితో పాటు డీకే కోరిన మంత్రిత్వ శాఖలు ఆయన వర్గం నేతలకు ఇచ్చే ఒప్పందానికి అంగీకరించినట్లు తెలుస్తొంది. మరో వైపు ఇవేళ రాత్రి ఏడు గంటలకు కాంగ్రెస్ శాసనసభాపక్ష సమావేశం జరగనుంది. అనంతరం సిద్దారామయ్య, డీకే శివకుమార్ గవర్నర్ ను కలవనున్నారు.

dk Sivakumar

20వ తేదీ ప్రమాణ స్వీకారం

ఇక ఈ నెల 20వ తేదీ (శనివారం) మధ్యాహ్నం 12.30 గంటలకు సిద్దా రామయ్య సీఎంగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. బెంగళూరులోని కంఠీరవ స్టేడియంలో కాంగ్రెస్ అధిష్టానం సమక్షంలో ఈ ప్రమాణ స్వీకారం జరగనున్నది. పలు రాష్ట్రాల సీఎంలు సైతం హజరుకానున్నారు. ఈ కార్యక్రమానికి వివిధ రాజకీయ పక్షాల అగ్రనేతలను ఆహ్వానించడం ద్వారా విపక్షాల ఐక్యతను చాటాలని కాంగ్రెస్ భావిస్తున్నది.

మాజీ మంత్రి భూమా అఖిలప్రియకు 14 రోజుల రిమాండ్ .. కర్నూలు జైలుకు తరలింపు

 

author avatar
sharma somaraju Content Editor

Related posts

YSRCP: చంద్రబాబుకు ఓటేస్తే పదేళ్లు వెనక్కి – జగన్

sharma somaraju

Breaking: బిఆర్ఎస్ కు బిగ్ షాక్ ఇచ్చిన వరంగల్ లోక్ సభ అభ్యర్ధి కడియం కావ్య .. పోటీ నుండి తప్పుకుంటున్నట్లు కేసిఆర్ కు లేఖ

sharma somaraju

BRS: బిఆర్ఎస్ కు బిగ్ షాక్ .. కాంగ్రెస్ పార్టీలో చేరనున్న కేకే, మేయర్ విజయలక్ష్మి

sharma somaraju

YS Viveka Case: ఎంపీ అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ రద్దు పిటిషన్ పై హైకోర్టులో విచారణ

sharma somaraju

Arvind Kejriwal: కేజ్రీవాల్ కు మరో షాక్ .. ఏప్రిల్ 1 వరకూ కస్టడీ పొడిగింపు

sharma somaraju

Bapatla: టీడీపీ అభ్యర్ధి కంపెనీలో సోదాలు .. భారీగా నగదు స్వాధీనం

sharma somaraju

YSRCP: జరిగిన మంచి చూసి ఓటేయండి – జగన్

sharma somaraju

Mohanlal: మోహ‌న్ లాల్ కూతురిని ఎప్పుడైనా చూశారా.. ఆమె అందం ముందు హీరోయిన్లు కూడా స‌రిపోరు!

kavya N

Siddharth: ఆ హీరోయిన్ వ‌ల్లే మొద‌టి భార్యతో సిద్ధార్థ్ విడిపోయాడా.. అదితి-సిద్ధార్థ్ మ‌ధ్య ఏజ్ గ్యాప్ ఎంతో తెలుసా?

kavya N

DMDK: టిక్కెట్ రాలేదన్న మనస్థాపంతో సిట్టింగ్ ఎంపీ ఆత్మహత్యాయత్నం .. చికిత్స పొందుతూ మృతి

sharma somaraju

YSRCP: ఎన్నికల్లో దుష్టచతుష్టయాన్ని ఓడించాలి – జగన్

sharma somaraju

BJP: ఏపీ అసెంబ్లీ అభ్యర్ధులను ప్రకటించిన బీజేపీ

sharma somaraju

గుంటూరు వెస్ట్ టాక్‌: వాళ్లంతా ఏకం.. ‘ టీడీపీ మాధ‌వి ‘ తో మ‌మేకం…!

చంద్ర‌బాబు సొంత ఇలాకాలో కూట‌మి పార్టీల్లో క‌ల్లోలం.. !

ఏపీలో టికెట్ ప్లీజ్‌.. ఆ ఒక్క జిల్లాలోనే కాంగ్రెస్‌కు గుట్ట‌లుగా ద‌ర‌ఖాస్తులు..!