NewsOrbit
జాతీయం న్యూస్ రాజ‌కీయాలు

Karnataka Congress: ఉమ్మడి కృషితో కాంగ్రెస్ ఘన విజయం .. సీఎం పదవిపై సర్వత్రా ఉత్కంఠ

Karnataka Congress: కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించింది. మ్యాజిక్ ఫిగర్ కు మించి 23 స్థానాలు కైవశం చేసుకుంది కాంగ్రెస్. అయితే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ సీఎంగా ఎవరిని ఎంపిక చేస్తుంది అన్న దానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఎందు కంటే సీఎం పదవి రేసులో సీనియర్ నేత సిద్దారామయ్య, కర్ణాటక పీసీసీ అధ్యక్షుడు డీకే శివకుమార్ ఉండటంతో ఎవరికి ఆ పదవి వరిస్తుంది అనే దానిపై చర్చ జరుగుతోంది.

dk shivakumar siddaramaiah

 

ఎన్నికల సమయంలో మాత్రం కాంగ్రెస్ పార్టీ తమ సీఎం అభ్యర్ధి ఎవరు అనేది ప్రకటించకుండా హిమాచల్ ప్రదేశ్ లో అనుసరించిన విధానాన్నే అమలు చేసింది. కలిసి కట్టుగా పని చేయాలని, గెలిచిన తర్వాత సీఎం ను ఎంపిక చేద్దామని పార్టీ అధిష్టానం చెప్పడంతో సిద్దారామయ్య, డీకే శివకుమార్ లు విభేదాలు పక్కన పెట్టి పార్టీ విజయం కోసం కృషి చేశారు. వారి శ్రమ, కృషికి ఫలితం లభించింది. అయితే ఇప్పుడు సీఎం విషయంలో పార్టీ అధిష్టానం తీసుకునే నిర్ణయంపై ఉత్కంఠగా మారింది. హిమాచల్ ప్రదేశ్ లో ముగ్గురు నేతలు ముఖ్యమంత్రి పదవికి పోటీ పడగా, ఫలితాల తర్వాత ముగ్గురిని కుర్చోబెట్టిన అధిష్టానం ఎటువంటి తగవులు, అసమ్మతి తలెత్తకుండా సీఎం అభ్యర్ధిని ఎంపిక చేసింది. అయితే ఇక్కడ ఇద్దరు నేతల మధ్యే పోటీ నెలకొనడంతో వారి ఇద్దరి మధ్య ఎలా రాజీ చేస్తుంది అనేది ఆసక్తికరంగా మారింది.

Congress Party: APCC Chief Special Focus by PK and Priyanka
Congress Party

 

కర్ణాటకలో మాస్ లీడర్ గా పేరున్న నాయకుల్లో యడ్యూరప్ప తర్వాత ఉన్న నేత సిద్దారామయ్య. సిద్దా రామయ్యకు అదే పెద్ద ప్లస్ పాయింట్. వివిధ సంస్థలు నిర్వహించిన ఎగ్జిట్ పోల్స్, ఓపీనియన్ పోల్స్ లో మెజార్టీ కన్నడ ఓటర్లు సీఎం అభ్యర్ధిగా సిద్దా రామయ్య పైనే మొగ్గు చూపారు. సిద్దా రామయ్యనే కాంగ్రెస్ పార్టీ అధిష్టానం సీఎం పదవికి ఎంపిక చేస్తుందని మెజార్టీ ప్రజల అభిప్రాయంగా ఉంది. కాంగ్రెస్ పార్టీ ఈ సారి అధికారంలోకి రావడానికి ప్రదాన కారణం కూడా సిద్దా రామయ్య నాయకత్వంపై చూపిన నమ్మకమేనని అంటున్నారు. మరో పక్క పీసీసీ అధ్యక్షుడు డీకే శివకుమార్ బలమైన నేతగా ఉన్నారు. 2019 లోక్ సభ ఎన్నికల్లో కర్ణాటక లోని 28 ఎంపీ స్థానాలకు గాను కాంగ్రెస్ గెలుచుకుంది కేవలం ఒక్క స్థానమే. అది కూడా డీకే శివకుమార్ సోదరుడు డీకే సురేష్. ఎన్ని కేసులు పెట్టినా కాంగ్రెస్ పార్టీ విధేయుడుగా నిలిచి పోరాటం చేయడం డీకే శివకుమార్ కు ప్లస్ పాయింట్ గా ఉంది. 2020లో ఆయనను పీసీసీ అధ్యక్షుడుగా నియమించగా, పార్టీ బలోపేతం కోసం శక్తివంచన లేకుండా కృషి చేశారు. ఈడీ కేసులు నమోదు చేసి జైలులో కూడా పెట్టారు ఆయనను. అయినా పార్టీ కోసం విభేదాలు పక్కన పెట్టి పని చేశారు.

ఆయన జైలులో ఉన్న సమయంలో సోనియా గాంధీ స్వయంగా వెళ్లి పరామర్శించడంతో ఆయనకు పార్టీ ఇచ్చిన ప్రాధాన్యత అర్ధం అవుతోంది. పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే సొంత రాష్ట్రం కావడంతో ఈ ఇద్దరు నేతల మధ్య ఎటువంటి తేడాలు రాకుండా సీఎంను ఎంపిక బాధ్యత ఆయనపై ఉంది. ముఖ్యమంత్రిని ఎంపిక చేసేందుకు కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలు బెంగళూరులో రేపు సమావేశం కానున్నారు. ఈ సమావేశంలో పార్టీ అధిష్టాన పరిశీలకులు హజరై అభిప్రాయ సేకరణ చేస్తారు. ఇద్దరు నేతలతో సంప్రదింపులు జరిపి ముఖ్యమంత్రిని ప్రకటించడం గానీ లేక కాంగ్రెస్ సంప్రదాయం ప్రకారం సీఎం ఎంపిక నిర్ణయాధికారం అధిష్టానంకు అప్పగిస్తూ తీర్మానం చేయడం గానీ చేస్తారని భావిస్తున్నారు. లేకపోతే చెరి రెండున్నర సంవత్సరాలు అధికారంలో ఉండేలా ఇద్దరి మద్య సయోధ్య కుదిర్చే అవకాశం కూడా లేకపోలేదని అంటున్నారు. చూడాలి ఏమి జరుగుతుందో.

Basavaraj Bommai: ఓటమిపై సీఎం బసవరాజు బొమ్మై స్పందన ఇది

author avatar
sharma somaraju Content Editor

Related posts

Nuvvu Nenu Prema April 18 2024 Episode 601: విక్కీని కొట్టి పద్మావతిని కిడ్నాప్ చేసిన కృష్ణ.. అనుతో దివ్య గొడవ.. పద్మావతిని శాశ్వతంగా దూరం చేసిన కృష్ణ..

bharani jella

AP Elections 2024: రేపటి నుండి నామినేషన్లకు రంగం సిద్దం – సీఈవో ముకేశ్ కుమార్ మీనా

sharma somaraju

Inter Board: ఏపీ ఇంటర్ బోర్డు కీలక ప్రకటన .. రీ వెరిఫికేషన్, బెటర్మెంట్ ఫీజు చెల్లింపునకు పూర్తి సమాచారం ఇది

sharma somaraju

Chandrababu: ప్రభుత్వంపై చంద్రబాబు కీలక ఆరోపణ ..ఆ కేసు దర్యాప్తు ఈసీ పర్యవేక్షణలో జరగాలి

sharma somaraju

Janasena: అభ్యర్ధులకు బీఫామ్ లు అందజేసిన పవన్ కళ్యాణ్

sharma somaraju

Chiyaan Vikram: సీరియ‌ల్ యాక్ట‌ర్‌ నుంచి స్టార్ హీరోగా విక్ర‌మ్ ఎలా ఎదిగాడు.. అత‌ని భార్య‌, కూతురిని ఎప్పుడైనా చూశారా?

kavya N

Tollywood Actor: ఈ ఫోటోలో ఉన్న స్టార్ హీరోను గుర్తుప‌ట్టారా.. రీల్ లైఫ్‌లోనే కాదు రియ‌ల్ లైఫ్‌లో కూడా ల‌వ‌ర్ బాయే!

kavya N

Sri Rama Navami: భద్రాద్రిలో వైభవంగా శ్రీ సీతారాముల కల్యాణం

sharma somaraju

NTR: ఎన్టీఆర్ పాతికేళ్ల క‌ల దేవ‌రతో అయినా నెరవేరుతుందా..?

kavya N

Sri Ramadasu: భక్తిరస మహాకావ్యం శ్రీరామదాసు సినిమా గురించి ఈ టాప్ సీక్రెట్స్ మీకు తెలుసా?

kavya N

Ayodhya: అయోధ్య రామాలయంలో అద్భుత దృశ్యం .. సూర్య తిలకాన్ని దర్శించి తరించిన భక్తులు

sharma somaraju

Tollywood: తెలుగు తెర‌పై శ్రీ‌రాముడి వేషం వేసిన మొట్ట మొద‌టి న‌టుడు ఎవ‌రో తెలుసా.. ఎన్టీఆర్, ఏఎన్నార్ మాత్రం కాదు!

kavya N

CM YS Jagan Attack Case: సీఎం జగన్ పై దాడి కేసులో పురోగతి .. పోలీసుల అదుపులో అనుమానిత యువకులు

sharma somaraju

Lok Sabha Elections: ఏపీలో మరో ఉన్నతాధికారిపై బదిలీ వేటు ..మరో ఇద్దరు కీలక అధికారులపై సీఈసీకి కూటమి నేతల ఫిర్యాదు

sharma somaraju

Encounter: చత్తీస్‌గఢ్ లో భారీ ఎన్ కౌంటర్ .. 29 మంది మవోయిస్టులు మృతి

sharma somaraju