DK Sivakumar: కర్ణాటక ముఖ్యమంత్రి పదవి రేసులో పీసీసీ అధ్యక్షుడు డీకే శివకుమార్, మాజీ సీఎం, సీనియర్ నేత సిద్ద రామయ్యలు ఉన్న సంగతి తెలిసిందే. రాష్ట్రంలో పార్టీ బలోపేతం అవ్వడంలో తన పాత్ర ఉన్నందున సీఎం పదవి తనకే వరిస్తుందన్న ఆశలో డీకే శివకుమార్ ఉన్నారు. సీనియారిటీ, మెజార్టీ ఎమ్మెల్యేల మద్దతు, మెజార్టీ ప్రజల మద్దతు ఉండటం వల్ల తనకే సీఎం పదవి వరిస్తుందని సిద్ద రామయ్య భావిస్తున్నారు.

అయితే పార్టీ అధిష్టానం నుండి డీకే శివకుమార్ కు పిలుపు రావడంతో ఢిల్లీ బయలుదేరారు. ఇవేళ శివకుమార్ జన్మదినం కావడంతో పార్టీ శ్రేణుల మధ్య పుట్టిన రోజు కేక్ ను కట్ జన్మదిన వేడుకలు జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో సిద్ద రామయ్య సహా కాంగ్రెస్ ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. కాగా ఢిల్లీ బయలుదేరి వెళ్లే ముందు శివకుమార్ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు.
తనకు సోనియా గాంధీ బర్త్ డే గిఫ్ట్ ఇస్తారో లేదో తెలియదని అన్నారు. ముఖ్యమంత్రి ఎంపిక నిర్ణయాన్ని పార్టీ అధిష్టానానికి వదిలివేశామని తెలిపారు. తాను కాంగ్రెస్ పార్టీకి, సోనియా గాంధీకి విధేయుడినని అన్నారు. ఈ రోజు తన పుట్టిన రోజు అని, తాను కొన్ని పూజలు చేయాలని, నా విశ్వాసం ప్రకారం ఆ పూజలే తనను కాపాడతాయని తెలిపారు. కర్ణాటక కాంగ్రెస్ కోసం ఏమేమి చేయాలో అవన్నీ చేశాననీ, ప్రజలకు తమకు 135 సీట్లు ఇచ్చారని శివకుమార్ అన్నారు. ఇవేళ మధ్యాహ్నం మూడు గంటల తర్వాత ఆయన ఢిల్లీకి బయలుదేరే అవకాశాలు ఉన్నాయి.
సిద్ద రామయ్య వైపే ఎమ్మెల్యేల మొగ్గు..?