NewsOrbit
జాతీయం న్యూస్ రాజ‌కీయాలు

Karnataka : రాసలీలల వీడియో ఎఫెక్ట్ : మంత్రి పదవికి రమేశ్ జార్కిహోళి రాజీనామా..!ఆమోదించిన గవర్నర్..!!

Karnataka : సెక్స్ స్కాండల్‌లో ఇరుక్కున్న కర్నాటక జలవనరుల శాఖ మంత్రి, బీజెపీ నేత రమేశ్ జార్కిహోళి తన మంత్రి పదవికి బుధవారం రాజీనామా చేశారు.  జార్కిహోలి ఓ యువతితో రాసలీలల జరుపుతొన్న వీడియో మీడియాలో ప్రసారం కావడం తీవ్ర కలకలాన్ని రేపింది. దీంతో అతనిపై చర్యలు తీసుకోవాలంటూ ప్రతిపక్షాలు డిమాండ్ చేశాయి. ఈ వీడియో లీకైనప్పటి నుండి అజ్ఞాతంలోకి వెళ్లిన రమేష్ తన పదవికి రాజీనామా చేసే ప్రసక్తిలేదని మంగళవారం సాయంత్రం వీడియో సందేశం ఇచ్చారు. ఇది ఫేక్ వీడియో అని పేర్కొన్నారు. తనపై వచ్చిన ఆరోపణలు పూర్తిగా అవాస్తవమని, ఈ విషయంలో స్పష్టమైన దర్యాప్తు అవసరమని పేర్కొన్నారు. తాను నిర్ధోషిగా బయటకు వస్తానని నమ్మకం ఉందని అన్నారు. అయితే నిన్న రాజీనామా చేయనని తెల్పిన రమేశ్ జోర్కిహోళి నేడు రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. నైతిక కారణాల వల్ల మంత్రి పదవికి రాజీనామా చేస్తున్నట్లు తెలిపారు. తన రాజీనామా లేఖను రమేశ్ జార్కిహోలి ముఖ్యమంత్రి యడియూరప్పకు పంపగా, ఆయన గవర్నర్ ఆమోదం కోసం పంపారు. దీనిపై గవర్నర్ ఆమోదముద్ర వేశారు.

Karnataka minister ramesh jarkiholi resign after indecent video
Karnataka minister ramesh jarkiholi resign after indecent video

ఓ యువతి డాక్యుమెంటరీ విషయమై కొద్ది రోజుల క్రితం మంత్రి రమేశ్ వద్దకు వచ్చింది. ఆమెకు కర్నాటక పవర్ ట్రాన్స్ మిషన్ కార్పోరేష్ లిమిటెడ్ లో ఉద్యోగం ఇప్పిస్తానని లొంగదీసుకుని రాసలీలలు జరిపినట్లు తెలుస్తోంది. మంత్రి రమేశ్ ఓ యువతితో రాసలీలలు జరుపుతున్న వీడియోను పౌర హక్కుల పోరాట సమితి అధ్యక్షుడు దినేశ్ కల్లహళ్లి మీడియాకు విడుదల చేశారు.  ఈ వీడియోను ఆయన బెంగళూరు నగర పోలీస్ కమిషనర్ కమల్ పంత్ కు అందించారు. దీనిపై కర్నాటక హోంశాఖ మంత్రి బసవరాజ్ బొమ్మై మాట్లాడుతూ మంత్రిపై వచ్చిన ఫిర్యాదు ఆధారంగా విచారణ కొనసాగుతోందని తెలిపారు.

ఒకనాడు కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నేత అయిన రమేశ్ ఆ పార్టీ కర్నాటక శాఖతో విబేధించి బీజెపీ తీర్థం పుచ్చుకున్నారు. కర్నాటక లో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటులో అత్యంత కీలక పాత్ర పోషించారు. కాంగ్రెస్, జేడీఎస్ అసంతృప్తి ఎమ్మెల్యేలను సమీకరించి వారితో తిరుగుబావుటా లేవనెత్తించి ఎమ్మెల్యే పదవులకు రాజీనామా చేయించిన సమయంలో రమేశ్ జార్కిహోళి అత్యంత కీలకంగా వ్యవహరించారు. ఆ తరువాత బీజెపీ అధికారంలోకి రావడానికి వ్యూహాత్మకంగా పావులు కదిపారు. అలాంటి నేత నేడు వివాదంలో చిక్కుకోవడం ముఖ్యమంత్రిని ఇరకాటంలో పడేసింది. శాసనసభ సమావేశాలలో ప్రతిపక్షాలకు ఈ అంశం అస్త్రంగా మారకముందే ఆయనతో రాజీనామా చేయించారు.

author avatar
sharma somaraju Content Editor

Related posts

Pawan Kalyan: రేపు పిఠాపురానికి పవన్ కళ్యాణ్.. తొలి విడత ఎన్నికల ప్రచారం షెడ్యూల్ ఇలా..

sharma somaraju

Revanth Reddy: ఫోన్ ట్యాపింగ్ పై తొలి సారి స్పందించిన సీఎం రేవంత్ ..చర్లపల్లిలో చిప్పకూడు తప్పదు అంటూ కీలక వ్యాఖ్యలు

sharma somaraju

TDP Leaders Protest: అనంత టీడీపీలో భగ్గుమన్న అసమ్మతి .. పార్టీ కార్యాలయం ధ్వంసం .. బ్యానర్లు, ఫ్లెక్సీలకు నిప్పు

sharma somaraju

Ranbir Kapoor: కూతురు రాహాకు ల‌గ్జ‌రీ బంగ్లాను గిఫ్ట్‌గా ఇచ్చిన‌ రణ‌బీర్ కపూర్.. ఎన్ని కోట్లో తెలిస్తే క‌ళ్లు చెదిరిపోతాయ్‌!!

kavya N

TDP: 4 లోక్ సభ, 9 అసెంబ్లీ స్థానాలకు అభ్యర్ధులను ప్రకటించిన టీడీపీ .. కోరుకున్న స్థానాన్ని దక్కించుకున్న గంటా

sharma somaraju

Tamannaah: త‌మ‌న్నాకు మ‌రో పేరు ఉందా.. ఫ్యాన్స్ కు కూడా తెలియ‌ని సీక్రెట్ ఇది..!!

kavya N

Vishwak Sen: విశ్వ‌క్ సేన్ బ‌ర్త్‌డే స్పెష‌ల్‌.. మాస్ కా దాస్ బ్యాక్‌గ్రౌండ్ ఏంటి.. సినిమాల్లోకి రాక ముందు ఏం చేసేవాడో తెలుసా?

kavya N

Congress: కాంగ్రెస్ పార్టీకి మరో సారి షాక్ ఇచ్చిన ఐటీ .. రూ.1700 కోట్ల పన్ను నోటీసులు

sharma somaraju

Surekha Vani: మా అమ్మ‌కు మ‌ళ్లీ పెళ్లి చేస్తానంటున్న సురేఖా వాణి కూతురు.. ఎలాంటి అబ్బాయి కావాలో చెప్పేసిన సుప్రీత!

kavya N

BRS MP: సీఎం రేవంత్ రెడ్డితో బీఆర్ఎస్ ఎంపీ కే కేశవరావు భేటీ .. తండ్రీ, తనయ కాంగ్రెస్ లో చేరికకు ముహూర్తం ఖరారు

sharma somaraju

Legend: 10 ఏళ్లు పూర్తి చేసుకున్న లెజెండ్‌.. అప్ప‌ట్లో ఈ చిత్రం ఎన్ని కోట్లు రాబట్టిందో తెలుసా?

kavya N

Elon Musk: ఆ ఎక్స్ యూజర్లలకు ‘మస్క్’ గుడ్ న్యూస్

sharma somaraju

విజ‌య‌వాడ ప‌శ్చిమ‌లో ‘ సుజ‌నా చౌద‌రి ‘ గెల‌వాలంటే ఈ అద్భుతం జ‌ర‌గాల్సిందే..!

విజ‌య‌వాడ‌లో కూట‌మి ఇలా చేసేంటే అదిరేదిగా… ఈ కామ‌న్ సెన్స్ కూడా లేకుండా పాయే..!

కొలిక‌పూడి శ్రీను సీటు కూడా చంద్ర‌బాబు పీకేస్తున్నాడా…!