Subscribe for notification

Karnataka Politics: యడియూరప్ప రాజీనామాను ఆమోదించిన గవర్నర్..! నూతన సీఎం ఎంపికకు బీజేపి అధిష్టానం కసరత్తు..!!

Share

Karnataka Politics: కర్నాటక అధికార పక్షంలో కీలక పరిణామాలు చోటుచేసుకున్నాయి. సీఎం పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించిన యడియూరప్ప రాజ్ భవన్ కు వెళ్లి గవర్నర్ ను కలిసి రాజీనామా పత్రాన్ని సమర్పించారు. ఈ మేరకు యడియూరప్ప రాజీనామాను గవర్నర్ ఆమోదిస్తూ ప్రత్యామ్నాయ ఏర్పాట్లు జరిగే వరకూ ఆపధర్మ ముఖ్యమంత్రిగా కొనసాగాలని సూచించినట్లు సమాచారం.

Karnataka Politics: Yeddyurappa Resignation accepted by governor

అనంతరం యడియూరప్ప మీడియాతో మాట్లాడుతూ రాజీనామా విషయంలో తనపై ఎవరి ఒత్తిడి లేదని తెలిపారు. మరొకరికి అవకాశం కల్పించేందుకు రాజీనామా చేసినట్లు వెల్లడించారు. రాబోయే రోజుల్లో కూడా బీజేపీకి పూర్తి సహకారం అందిస్తానని చెప్పారు. తాను ఎవరి పేరును సీఎం పదవికి సిఫార్సు చేయలేదని యడియూరప్ప తెలిపారు. పార్టీ అధిష్టానం ఎవరి పేరు సూచించినా సహకరిస్తానని అన్నారు. రాష్ట్రంలో బీజేపీ బలోపేతానికి కృషి చేస్తానని వెల్లడించారు.

Karnataka Politics: సీఎం ఎంపిక పరిశీలకుడిగా ధర్మేంద్ర ప్రధాన్

యడియూరప్ప రాజీనామా చేసిన నేపథ్యంలో నూతన సీఎంని ఎంపికకు పరిశీలకుడుగా పార్టీ అధిష్టానం కేంద్ర మంత్రి ధర్మేంధ్ర ప్రధాన్ ను నియమించింది. సీఎం రేసులో ప్రహ్లాద్ జోషి, సీటీ రవి, ముర్గేష్ నిరాణి, బసవరాజ్ ఉండగా రేపు జరగనున్న బీజేపీ ఎల్పీ సమావేశంలో సీఎంను ఎంపిక చేయనున్నారు.

ఇదిలా ఉండగా, యడియూరప్ప రాజీనామా సమర్పించిన నేపథ్యంలో పలువురు సీనియర్ మంత్రులు రాజ్ భవన్ బాట పట్టారు. గవర్నర్ ను కలిసేందుకు పలువురు సీనియర్ మంత్రులు రాజ్ భవన్ కు చేరుకోవడం తో తదుపరి సీఎం ఎవరినేది చర్చనీయాంశమయ్యింది. కర్నాటక డిప్యూటి సీఎం లక్ష్మణ్ సావాడి, వ్యవసాయ శాఖ మంత్రి బీసీ పాటిల్, మరో మంత్రి జేసి మధు లు గవర్నర్ ను కలిశారు.


Share
somaraju sharma

Recent Posts

Vijay Deverakonda Puri Jagannath: హీరో విజయ్ దేవరకొండకి మరో బంపర్ ఆఫర్ ఇచ్చిన పూరీ జగన్నాథ్..??

Vijay Deverakonda Puri Jagannath: రౌడీ హీరో విజయ్ దేవరకొండకి(Vijay Deverakonda) కెరియర్ పరంగా బ్యాడ్ టైం నడుస్తున్న సంగతి…

8 mins ago

Salman Khan: తెలుగు మ్యూజిక్ డైరెక్టర్ కి ఊహించని షాక్ ఇచ్చిన సల్మాన్ ఖాన్..??

Salman Khan: ప్రస్తుతం చాలావరకు సినిమా నిర్మాణానికి సంబంధించి సౌత్ ఇండియా టాలెంట్ హవా కొనసాగుతుంది. ఈత బాలీవుడ్(Bollywood) స్టార్…

1 hour ago

Indian Film Industry: 2022 ఫస్టాఫ్ సౌత్ ఇండియా సినిమాలతో ఊపిరి పీల్చుకున్న ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీ..!!

Indian Film Industry: 2020 నుండి మహమ్మారి కరోనా(Corona) కారణంగా సినిమా ఇండస్ట్రీ రెండు సంవత్సరాలు గడ్డు కాలం చూడటం…

2 hours ago

Balakrishna: బాల‌య్య ఈస్ బ్యాక్‌.. బ‌రిలోకి దిగేది ఎప్పుడంటే?

Balakrishna: న‌ట‌సింహం నంద‌మూరి బాల‌కృష్ణ వారం రోజుల క‌రోనా బారిన ప‌డ్డ విష‌యం తెలిసిందే. కరోనా పరీక్షల్లో పాజిటివ్ రావడంతో…

3 hours ago

BJP: బీజేపీకి బిగ్ షాక్ ఇచ్చిన నలుగురు జీహెచ్ఎంసీ కార్పోరేటర్లు.. అధికార టీఆర్ఎస్‌లో చేరిక

BJP: తెలంగాణ (Telangana)లో అధికారమే లక్ష్యంగా బీజేపీ పోరాటాలు చేస్తొంది. అధికార టీఅర్ఎస్ (TRS)పార్టీ కి తామే ప్రత్యామ్నాయం అంటూ…

3 hours ago

Shruti Haasan: ప్ర‌తి మ‌హిళ‌కు తెలుసు.. నేనూ ఆ స‌మ‌స్య‌ల‌తో పోరాడుతున్నా: శ్రుతి హాస‌న్

Shruti Haasan: త‌మిళ స్టార్ హీరో, లోక‌నాయ‌కుడు క‌మ‌ల్ హాస‌న్ కుమార్తెగా సినీ ఇండ‌స్ట్రీలోకి అడుగు పెట్టిన శ్రుతి హాస‌న్…

4 hours ago