హోరాహోరీగా జరిగిన కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ప్రచార పర్వంలో అధికార బీజేపీ, ప్రతిపక్ష కాంగ్రెస్ పరస్పరం విమర్శలు, ఆరోపణలు చేసుకున్నాయి. దూషణల పర్వానికి దిగాయి. ఈ నేపథ్యంలోనే ఇరు పార్టీలు ఎన్నికల సంఘానికి (ఈసీ) ఫిర్యాదు చేసుకున్నాయి. దీంతో ఇరు పార్టీలకు ఈసీఈ నోటీసులు జారీ చేసింది. ఓ ప్రముఖ ఇంగ్లీషు దిన పత్రికలో బీజేపీ ప్రకటన ఇస్తూ కాంగ్రెస్ పార్టీపై నిరాధారమైన ఆరోపణలు చేసిందని ఆరోపిస్తూ కాంగ్రెస్ పార్టీ నేత రణదీప్ సింగ్ సూర్జేవాలా ఈసీకీ ఫిర్యాదు చేశారు.

ఈ ఫిర్యాదుపై స్పందించిన ఈసీ ఆ ప్రకటనలో చేసిన ఆరోపణలకు సంబందించి నమ్మదగిన ఆధారాలన సమర్పించాలని ఆదేశిస్తూ బీజేపీకి నోటీసులు జారీ చేసింది. ఎన్నికల నియమావళిని ఉల్లంఘించినందుకు చర్యలు ఎందుకు తీసుకోకూడదో చెప్పాలని నోటీసులో కోరింది. ఎన్నికల ప్రచారంలో చేసిన ఆరోపణలకు తగిన ఆధారాలు ఉండాలని ఈసీఇ పేర్కొంది. నిరాధార ఆరోపణలు చేయడం అంటే ఓటర్లను తప్పుదోవ పట్టిండమే కాకుండా సరైన అభ్యర్ధిని ఎంచుకునే హక్కును వారి నుండి దోచుకోవడమేనని పేర్కొంది.
మరో పక్క కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే చేసిన ట్వీట్ పై చర్యలు తీసుకోవాలని కోరుతూ బీజేపీ నేతలు భూపేందర్ యాదవ్, డాక్టర్ జితేందర్ సింగ్, తరుణ్ చుగ్, అనిల్ బలూని, పాఠక్ లు ఈసీకి ఫిర్యాదు చేశారు. కర్ణాటక ప్రతిష్ట, సార్వభౌమాధికారం, సమగ్రతకు ముప్పు కలిగేందుకు కాంగ్రెస్ ఎవరినీ అనుమతించబోదంటూ ఖర్గే ఈ నెల 6న ట్వీట్ చేశారు. దీనిపై బీజేపీ నేతలు చేసిన ఫిర్యాదుకు సంబందించిన ఈసీ .. సోషల్ మీడియా పోస్టుపై వివరణ ఇవ్వాలని ఖర్గేను ఆదేశించింది. సార్వభౌమాధికారం పదాన్ని ఏ సందర్భంలో ఉపయోగించారో చెప్పాలని కోరింది.
Suicide: సత్తుపల్లిలో విషాదం ..ఇద్దరు బిడ్డలతో సహా తల్లి ఆత్మహత్య