KCR: తెలంగాణ‌కు ఇంకో ప్ర‌త్యేక రికార్డు సొంతం చేయించిన కేసీఆర్‌

Share

KCR: క‌రోనా క‌లక‌లం కొన‌సాగుతున్న త‌రుణంలో తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్ త‌న రాష్ట్రం ఖాతాలో ఓ ప్ర‌త్యేక‌త‌ను న‌మోదు చేయించార‌ని అంటున్నారు. క‌రోనాకు బ్రేక్‌లు వేయ‌డంలో కీల‌క‌మైన వ్యాక్సిన్ విష‌యంలో తెలంగాణ ఓ రికార్డు సొంతం చేసుకుంది. తెలంగాణ రాష్ట్రంలో మొదటి డోస్ క‌రోనా వ్యాక్సిన్‌ తీసుకున్నవారు 50 శాతం దాటగా, రెండు డోసులు తీసుకున్నవారు 25 శాతం దాటారు. కరోనా వైరస్ ను అరికట్టేందుకు తెలంగాణ ప్రభుత్వం వ్యాక్సినేషన్ ప్రక్రియను నిరాటంకంగా కొనసాగిస్తుండ‌టం వ‌ల్ల ఈ ప్ర‌త్యేక‌త సొంత‌మైంద‌ని అధికార పార్టీ వ‌ర్గాలు సంతోషం వ్య‌క్తం చేస్తున్నాయి.

Read more KCR: కేసీఆర్ ఇంకో వరం… ఔను హుజురాబాద్ కోస‌మే!

ఇదీ లెక్క‌..
తెలంగాణ‌ రాష్ట్రవ్యాప్తంగా అర్హులైన 2.20 కోట్ల మందికి టీకా వేయడం లక్ష్యంగా ఈ ఏడాది జనవరి 16 న ప్రారంభించిన వ్యాక్సినేషన్.. ఇప్పటివరకు మొత్తం 1.34 కోట్ల మందికి చేరింది. ఈ క్రమంలో మొదటి డోస్‌ తీసుకున్నవారు 50 శాతం దాటగా, రెండు డోసులు తీసుకున్నవారు 25 శాతం దాటారు. మొదటి డోస్‌ తీసుకున్నవారి సంఖ్య 1.09 కోట్లు కాగా, రెండు డోసులు తీసుకున్నవారి సంఖ్య దాదాపు 28 లక్షలుగా ఉన్నది. రెండు డోసుల మధ్య గడువును కేంద్ర ప్రభుత్వం 12 నుంచి 16 వారాలకు పెంచిన సంగతి తెలిసిందే. దీంతో మొదటి డోస్ గా కొవిషీల్డ్‌ తీసుకున్నవారు రెండో డోస్‌ తీసుకొనేందుకు సిద్ధమవుతున్నారు.

Read more : KCR: కేసీఆర్‌కు హుజురాబాద్ భ‌యం ప‌ట్టుకుంది.. . దానికి ఉదాహ‌రణ ఇదే!

మొద‌టి , రెండో డోస్ వ్యాక్సిన్లు రెడీ

ప్రభుత్వం క‌రోనా వ్యాక్సిన్‌ మొదటి డోస్‌ను అందిస్తూనే, రెండో డోస్‌వారికి ప్రాధాన్యం ఇచ్చేలా చర్యలు తీసుకుంటోందిది. ఇందుకోసం తమకు ఎక్కువ వ్యాక్సిన్లు కేటాయించాలని రాష్ట్ర ప్రభుత్వం కేంద్రాన్ని కోరింది. స్పందించిన కేంద్రం జూలై నెలకు కేటాయించిన 18 లక్షల వ్యాక్సిన్లకు అదనంగా మరో 4 లక్షలను కేటాయించిందని వైద్యవర్గాలు తెలిపాయి. జూలై చివరినాటికి రాష్ట్రంలో రెండో డోస్‌ తీసుకొనేవారు 20 లక్షలు, ఆగస్టునాటికి మరో 10 లక్షల మంది ఉంటారని, సాధ్యమైనతం త్వరగా లక్ష్యాన్ని చేరుకొనేందుకు కృషిచేస్తున్నట్టు వైద్యాధికారులు వివరించారు. మొత్తంగా క‌రోనా క‌ల‌క‌లానికి బ్రేకులు వేసే వ్యాక్సినేష‌న్ ప్ర‌క్రియ‌లో తెలంగాణ ప్ర‌భుత్వం వేగంగా ముందుకు సాగుతుంద‌ని చెప్తుంటారు.


Share

Related posts

‘ఉల్లి’ చర్చలో సవాళ్లు, ప్రతి సవాళ్లు

somaraju sharma

ఒక్క రోజే గడువు

sarath

KGF : కేజీఎఫ్, సలార్ సినిమాలతో ప్రశాంత్ నీల్ రాజమౌళి ని మించుతాడా..?

GRK