NewsOrbit
జాతీయం న్యూస్

Cabinet Meet: పేదలు, డ్వాక్రా మహిళలకు మోడీ సర్కార్ గుడ్ న్యూస్ .. కేబినెట్ కీలక నిర్ణయాలు ఇవే

Cabinet Meet: మహిళలు, రైతులు, పేదలను దృష్టిలో పెట్టుకుని కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయాలు తీసుకుంది. దేశంలో పేద వర్గాలను ఆదుకునే ఉచిత రేషన్ పథకం (ప్రధాన మంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన) పొడిగించింది. దీంతో ఈ పథకం కింద దేశ వ్యాప్తంగా 81 కోట్ల మంది రేషన్ కార్డుదారులకు మరో అయిదేళ్లు రేషన్ ను ఉచితంగా అందించనుంది. కోవిడ్ -19 మహమ్మారి విజృంభిస్తున్న సమయంలో కేంద్రం పేదలకు అండగా నిలుస్తూ పీఎంజీకేవై పథకాన్ని 2020 ఏప్రిల్ నెలలో ప్రారంభించింది. అప్పటి నుండి ఆ పథకాన్ని గడువు పొడిగిస్తూ వచ్చింది.

ఈ ఏడాది డిసెంబర్ 31తో ఈ పథకం ముగియనుంది. ఈ నేపథ్యంలో ఇటీవల చత్తీస్ గఢ్ ఎన్నికల ప్రచారంలో ప్రధాని మోడీ పీఎంజీకేఏవై పథకాన్ని మరో అయిదేళ్లు పొడిగిస్తామని స్వయంగా ప్రకటించారు. ఈ క్రమంలో తాజాగా కేంద్ర కేబినెట్ దీనికి ఆమోదం తెలిపింది. కేబినెట్ నిర్ణయాలను మీడియా సమావేశంలో కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ వెల్లడించారు. అంతే కాకుండా, దేశ వ్యాప్తంగా 15వేల మహిళా స్వయం సహాయక సంఘాలు (ఎస్ హెచ్ జీ) లకు డ్రోన్లను అందించాలని కేంద్ర కేబినెట్ నిర్ణయించింది. 2024 – 25 ఆర్ధిక సంవత్సరం మొదలు కొని 2025 – 326 వరకూ డ్రోన్ల అందజేత కొనసాగించనున్నట్లు మంత్రి అనురాగ్ ఠాకూర్ తెలిపారు. ఇందు కోసం రూ.1,261 కోట్లు కేటాయించనున్నట్లు వెల్లడించారు.

ఈ డ్రోన్ల ద్వారా స్వయం సహాయక బృందాలు గ్రామీణ ప్రాంతాల్లో రైతులకు అద్దె ప్రాతిపదికన వ్యవసాయ అధారిత సేవలు అందించాల్సి ఉంటుందని తెలిపారు. ఫలితంగా ఒక్కో బృందం ఏటా లక్ష రూపాయల వరకూ ఆదాయం పొందే అవకాశం ఉంటుందని తెలిపారు. స్వయం సహాయక బృందాలకు డ్రోన్ టెక్నాలజీని అందించనున్నట్లు ఆగస్టు 15న ఎర్రకోటపై చేసిన ప్రసంగంలో ప్రధాన మంత్రి మోడీ ప్రకటించిన విషయాన్ని మంత్రి గుర్తు చేశారు.

ఇక ప్రధాన మంత్రి జనజాతి ఆదివాసి న్యాయ మహా అబియాన్ పథకాన్ని, 16వ ఆర్ధిక సంఘం విధి విధానాలపై కేంద్ర కేబినెట్ ఆమోదించింది. 16వ ఆర్ధిక సంఘం తన నివేదికను అక్టోబర్ 2025 నాటికి సమర్పిస్తుందన్నారు. కేంద్రం దీనిపై నిర్ణయం తీసుకుని 1 ఏప్పిల్ 2026 నుండి 31 మార్చి 2031 వరకూ అమలు చేయబడుతుందని మంత్రి ఠాకూర్ తెలిపారు.

BRS Deeksha Diwas: టీఆర్ఎస్ భవన్ లో దీక్షా దివస్ పై ఈసీకి కాంగ్రెస్ ఫిర్యాదు

author avatar
sharma somaraju Content Editor
శర్మ ఎస్ సోమరాజు న్యూస్ ఆర్బిట్ లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా పని చేస్తున్నారు. ఇక్కడ ఏపీ, తెలంగాణ జాతీయ సంబంధిత తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్రత్యేక కథనాలు అందిస్తుంటారు. ఆయనకు జర్నలిజంలో 30 సంవత్సరాలకుపైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థలు ఈనాడు, ఆంధ్రభూమి, ఆంధ్రజ్యోతి, ఆంధ్రప్రభ ప్రింట్ మీడియాలో పని చేశారు. 2018 నుండి న్యూస్ ఆర్బిట్ లో పని చేస్తున్నారు.

Related posts

Krishna Mukunda Murari march 1 2024 Episode 407: మురారి అడుగుల్లో అడుగులు వేసిన ముకుంద.. కృష్ణ ఎలా బుద్ధి చెప్పనుంది.?

bharani jella

జెండా ఎగురుతుంది.. కానీ కొత్త డౌట్లు మొద‌ల‌య్యాయ్‌…!

ప‌వ‌న్ – చంద్ర‌బాబు న‌యా స్కెచ్ వెన‌క అస‌లు ప్లాన్ ఇదే..!

విశాఖ సిటీ పాలిటిక్స్ ఓవ‌ర్ వ్యూ ఇదే… ఎవ‌రు స్వింగ్‌.. ఎవ‌రు డౌన్‌…!

CM YS Jagan: అమరావతి రాజధాని ప్రాంత నిరుపేదలకు జగన్ సర్కార్ గుడ్ న్యూస్ .. వారి ఫించన్ ఇక రెట్టింపు

sharma somaraju

Mudragada Padmanabham: పవన్ కళ్యాణ్ కు ముద్రగడ ఘాటు లేఖ.. విషయం ఏమిటంటే..?

sharma somaraju

Prattipati Pullarao Son Arrest: టీడీపీ మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు కుమారుడు అరెస్టు..ఎందుకంటే..?

sharma somaraju

టీడీపీ లేడీ లీడ‌ర్ ‘ సౌమ్య ‘ ముందు అంత పెద్ద టార్గెట్టా… రీచ్ అయ్యేనా..!

పుంగ‌నూరులో పెద్దిరెడ్డి ప‌రుగుకు ప‌క్కాగా బ్రేకులు… ఏం జ‌రుగుతోంది…?

జ‌గ‌న్ ప్ర‌యోగాల దెబ్బ‌కు వ‌ణికిపోతోన్న వైసీపీ టాప్‌ లీడ‌ర్లు… ఒక్క‌టే టెన్ష‌న్‌…!

కృష్ణా జిల్లాలో టిక్కెట్లు ఇచ్చినోళ్ల‌ చీటి చింపేస్తోన్న జ‌గ‌న్‌.. లిస్టులో ఉంది వీళ్లే…!

డ్యూటీ దిగిన జోగ‌య్య‌… డ్యూటీ ఎక్కేసిన ముద్ర‌గ‌డ‌…!

Revanth Vs KTR: సేఫ్ గేమ్ వద్దు స్ట్రెయిట్ ఫైట్ చేద్దాం .. నీ సిట్టింగ్ సీటులోనే తేల్చుకుందాం –  సీఎం రేవంత్ కు కేటిఆర్ ప్రతి సవాల్

sharma somaraju

YSRCP: సీఎం వైఎస్ జగన్ సమక్షంలో వైసీపీలో చేరిన సీనియర్ ఐఏఎస్ అధికారి ఇంతియాజ్

sharma somaraju

Mega DSC 2024: నిరుద్యోగులకు రేవంత్ సర్కార్ గుడ్ న్యూస్ .. మెగా డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల

sharma somaraju