Kishan reddy: కిష‌న్ రెడ్డికి ఇంకో గుడ్ న్యూస్ చెప్పిన ప్ర‌ధాని

Share

Kishan reddy: బీజేపీ సీనియ‌ర్ నేత‌, కేంద్ర మంత్రి కిష‌న్ రెడ్డి కి గుడ్ న్యూస్‌ల ప‌రంప‌ర కొన‌సాగుతోంది. కేంద్ర మంత్రివర్గంలో మార్పులు చేసిన సంద‌ర్భంగా ఇటీవ‌లే ఆయ‌న‌కు స‌హాయ‌క మంత్రి నుంచి కేంద్ర క్యాబినెట్ మంత్రిగా ప్ర‌మోష‌న్ క‌ల్పించిన సంగ‌తి తెలిసిందే. దీనికి కొన‌సాగింపుగా తాజాగా చేసిన కేంద్ర కేబినెట్ కమిటీల్లో కూడా ప్రధాని మోడీ మ‌రోమారు కిష‌న్ రెడ్డి కి తీపిక‌బురు వినిపించారు. క‌మిటీల్లో పలు మార్పులు చేర్పులు చేసిన ప్ర‌ధాని ఇందులో కిష‌న్ రెడ్డికి చోటు క‌ల్పించారు.

Read More: Modi: తండ్రి కాంగ్రెస్‌… కొడుకు బీజేపీ… మోడీ వ‌ల్లే ఇద్ద‌రు క‌లిసి సృష్టించిన‌ రికార్డు ఇది

8 క‌మిటీల్లో…
కేంద్ర మంత్రి వర్గ విస్తరణ తర్వాత ప్రధాని మోడీ కేబినెట్ కమిటీలను పునర్వ్యవస్థీకరణపై ద‌ృష్టి సారించారు. కేబినెట్ కమిటీలో యువ మంత్రులకు అవకాశం కల్పిస్తూ నిర్ణయం తీసుకున్నారు. ప్రధాని మోడీ నేతృ‌త్వంలోని రాజకీయ వ్యవహారాల కమిటీలో కేంద్ర మంత్రులు స్మృతి ఇరాని, భూపేందర్ యాదవ్, సర్బానంద సోనోవాల్‌‌కు చోటు కల్పించారు. మోడీ నేతృత్వంలోని ఉద్యోగాల కల్పన, స్కిల్ డెవలప్‌‌మెంట్ కేబినెట్ కమిటీలో అశ్విన్ వైష్ణవ్, భూపేందర్ యాదవ్, రామచంద్ర ప్రసాద్ సింగ్, కిషన్ రెడ్డిలకు అవకాశం కల్పించారు.8 ముఖ్యమైన కమిటీల్లో భూపేంద్ర యాదవ్, జ్యోతిరాదిత్య సింధియా, శర్బానంద సోనోవాల్‌లకు స్థానం కల్పించారు.

Read More: Modi: అటు గ‌వ‌ర్న‌ర్లు…ఇటు మంత్రులు. .మోడీ లెక్క ఏంటో తెలుసా?

ఆ మంత్రికి చాన్స్‌…
ఆరు కమిటీల్లో రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌ ను నియమిస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కు ఏడు కమిటీల్లో చోటు కల్పించారు. మొదటిసారి సీసీపీఏలో మహిళా, శిశు అభివృద్ధి శాఖ మంత్రి స్మృతి ఇరానీకి ప్రధాని మోడీ అవకాశం కల్పించారు. నైపుణ్య అభివృద్ధి, ఉపాధికి సంబంధించిన కమిటీలో కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్‌ను తీసుకున్నారు. సమాచార, ప్రసార శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్‌కి పార్లమెంటరీ వ్యవహారాల కమిటీలో సభ్యుడిగా అవకాశం ఇచ్చారు.


Share

Related posts

శ్రీముఖి నుంచి వార్నింగ్…. ఆ జబర్దస్త్ కమెడియన్‌ ఎవరు?

Naina

Son Of  India : మోహన్ బాబు సరసన మళ్ళీ ఆ నటి..!!

bharani jella

Prashanth neel : కన్నడ దర్శకుడికి టాలీవుడ్ లో రాజమౌళిని మించే పాపులారిటీ పెరుగుతోందా..?

GRK