NewsOrbit
జాతీయం న్యూస్ రాజ‌కీయాలు

కాంగ్రెస్ పార్టీకి షాక్‌ల మీద షాక్ లు..బాధ్యతల నుండి తప్పుకున్న ఓ నేత, పార్టీకి గుడ్ బై చెబుతున్న మరో నేత..?

కాంగ్రెస్ పార్టీకి షాక్ ల మీద షాక్ లు తగులుతూనే ఉన్నాయి. ఓ సీనియర్ నేత తన బాధ్యతల నుండి తప్పుకోగా, మరో సీనియర్ నేత పార్టీకే గుడ్ బై చెప్పి గులాబీ కండువా కప్పుకోవడానికి సిద్దమైయ్యారు. రాజస్థాన్ కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల ఇన్ చార్జి బాధ్యతల నుండి తప్పుకుంటున్నట్లు సీనియర్ నేత అజయ్ మాకెన్ ప్రకటించారు. ఈ మేరకు ఆయన పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే కు లేఖ రాశారు. మరో రెండు రోజుల్లో రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర రాజస్థాన్ లో ప్రవేశించనున్న తరుణంలో మాకెన్ రాజీనామా చేయడం పార్టీలో హాట్ టాపిక్ అయ్యింది. రాజస్థాన్ కాంగ్రెస్ లో నెలకొన్న విభేదాలను పరిష్కరించలేకపోవడానికి బాధ్యత వహిస్తూ ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు మాకెన్. రాజస్థాన్ లో సీఎం అశోక్ గెహ్లాట్, సీనియర్ నేత సచిన్ పైలెట్ ల మధ్య తీవ్ర విభేదాలు ఉన్నాయి.

congress

 

రీసెంట్ గా కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష ఎన్నికల సమయంలో అశోక్ గెహ్లాట్ ను పార్టీ అధ్యక్ష బరిలో నిలపాలని, ముఖ్యమంత్రి పదవిని సచిన్ పైలట్ కు అప్పగించాలని సోనియా భావించారు. అయితే సచిన్ పైలట్ ను సీఎం చేస్తే తాము తిరుగుబాటు చేస్తామంటూ గెహ్లాట్ వర్గం ఎమ్మెల్యేలు స్పీకర్ ను కలిశారు. రాజీనామా లేఖలు అందజేశారు. ఈ పరిణామాల నేపథ్యంలో గెహ్లాట్ కాంగ్రెస్ అధ్యక్ష బరిలో ఉండటం లేదని పేర్కొన్నారు. అయితే సెప్టెంబర్ 25న నిర్వహించిన ఎల్పీ సమావేశానికి గహ్లాట్ వర్గంలోని పలువురు ఎమ్మెల్యే లు గైర్హజరు అయ్యారు. ఈ సందర్భంలో పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడ్డారని, వారిపై చర్యలు తీసుకోవాలని మాకెన్ పార్టీ అధిష్టానానికి సూచించారు. అయతే ఇప్పటి వరకూ వారిపై ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతో మనస్థాపానికి గురైన మాకెన్ ఈ నిర్ణయం తీసుకుని ఉంటారని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. ఇదిలా ఉంటే రాజస్థాన్ లో నెలకొన్న విభేదాలను త్వరగా పరిష్కరించాలని సచిన్ పైలట్ గత కొద్ది రోజులుగా డిమాండ్ చేస్తున్నారు. ఈ తరుణంలో మాకెన్ రాజీనామా పార్టీకి కొత్త సమస్య వచ్చిటన్లు అయ్యింది. రాజస్థాన్ పార్టీ వ్యవహారాలకు రాజీనామా చేసిన మాకెన్.. ఇకపై ఢిల్లీలో కాంగ్రెస్ బలపడేందకు తన వంతు కృషి చేస్తానని లేఖలో పేర్కొన్నారు.

ajay maken

 

మరో పక్క తెలంగాణలో సీనియర్ నేత మర్రి శశిధర్ రెడ్డి బీజేపీలో చేరనున్నట్లు తెలుస్తొంది. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి వ్యవహారంపై అసంతృప్తిగా ఉన్న మర్రి శశిధర్ రెడ్డి ఇంతకు ముందు సంచలన వ్యాఖ్యలు కూడా చేశారు. కాంగ్రెస్ పార్టీలో కల్లోలానికి రేవంత్ రెడ్డే కారణమని, పార్టీకి నష్టం కలిగించేలా ఆయన చేస్తున్న పనులు ఉన్నాయంటూ సీనియర్ వ్యాఖ్యలు చేశారు. ఇదే క్రమంలో కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల ఇన్ చార్జి మాణిక్యం ఠాగూర్ పైనా విమర్శలు చేశారు. రేవంత్ కు ఠాగూర్ ఏజెంట్ మాదిరి పని చేస్తున్నారని విమర్శించారు. పార్టీ మారబోతున్నట్లు సంకేతాలు ఇచ్చిన మర్రి శశిధర్ రెడ్డి ఇవేళ  బీజేపీ నేతలతో కలిసి హైదరాబాద్ నుండి ఢిల్లీ వెళ్లారు. ఆయన తో పాటు డీకే అరుణ కూడా ఉన్నారు. ఈ రోజు ఢిల్లీలో బీజేపీ పెద్దలతో సంప్రదింపులు జరిపిన తర్వాత కాషాయం గూటికి శశిధర్ రెడ్డి చేరే అవకాశాలు ఉన్నాయి.

హైకోర్టులో అమరావతి రైతులకు దక్కని ఊరట..పాదయాత్రపై సవరణ పిటిషన్లు కొట్టివేత

Marri Sasidhar Reddy

author avatar
sharma somaraju Content Editor

Related posts

YCP MLC: శిరోముండనం కేసులో వైసీపీ ఎమ్మెల్సీకి జైలు శిక్ష

sharma somaraju

Ram Gopal Varma: నైజీరియాలో జాబ్‌ చేయాల్సిన వ‌ర్మ ఇండ‌స్ట్రీలోకి ఎలా వ‌చ్చాడు.. ద‌ర్శ‌కుడు కాక‌ముందు ఏం ప‌ని చేసేవాడు..?

kavya N

Janasena: ఏపీ హైకోర్టులో జనసేనకు బిగ్ రిలీఫ్

sharma somaraju

Prabhas: ప్ర‌భాస్ కోసం వేణు స్వామి వైఫ్ స్పెష‌ల్ గిఫ్ట్‌.. ఇంత‌కీ ఏం పంపించిందో తెలుసా?

kavya N

Israel: ఇరాన్ పై ప్రతిదాడి తప్పదంటూ ఇజ్రాయెల్ కీలక ప్రకటన

sharma somaraju

America: భారత్ లో లోక్ సభ ఎన్నికల వేళ అమెరికా కీలక వ్యాఖ్యలు

sharma somaraju

Top 10 Tollywood Heroes: తారుమారైన టాలీవుడ్ హీరోల స్థానాలు.. ప్ర‌స్తుతం నెంబ‌ర్ 1లో ఉన్న‌ది ఎవ‌రంటే?

kavya N

Apoorva Srinivasan: గ‌ప్‌చుప్‌గా పెళ్లి పీట‌లెక్కేసిన మ‌రో టాలీవుడ్ బ్యూటీ.. వైర‌ల్‌గా మారిన వెడ్డింగ్ ఫోటోలు!

kavya N

గుంటూరు వెస్ట్… ఈ టాక్ విన్నారా ‘ ర‌జ‌నీ ‘ మేడం… ‘ మాధ‌వి ‘కి అదే ఫుల్‌ ఫ్ల‌స్ అవుతోంది..!

ఏపీ కాంగ్రెస్‌లో ఆయ‌న ఎఫెక్ట్ టీడీపీకా.. వైసీపీకా… ఎవ‌రిని ఓడిస్తాడో ?

ముద్ర‌గ‌డ వ‌ర్సెస్ ముద్ర‌గ‌డ‌.. ఈ రాజ‌కీయం విన్నారా..?

విజయవాడ తూర్పున ఉదయించేది ఎవరు.. గ‌ద్దెను అవినాష్ దించేస్తాడా..?

YS Viveka Case: వైఎస్ అవినాష్ రెడ్డి బెయిల్ రద్దు పిటిషన్ పై తీర్పు రిజర్వు

sharma somaraju

YSRCP: మీ బిడ్డ అదరడు ..బెదరడు – జగన్

sharma somaraju

CM YS Jagan: సీఎం జగన్ పై రాయి దాడి కేసును సమీక్షించిన సీఈవో ముఖేశ్ కుమార్ మీనా  

sharma somaraju