NewsOrbit
జాతీయం ట్రెండింగ్ న్యూస్

Legendary Sprinter Milkha Singh: దిగ్గజ అథ్లెట్ మిల్కా సింగ్ ఇక లేరు

Legendary Sprinter Milkha Singh: దిగ్గజ పరుగుల వీరుడు, ఫ్లయింగ్ సిఖ్ గా పేరుగాంచిన భారత దిగ్గజ అథ్లెట్ మిల్కా సింగ్ (91) కన్నుమూశారు. కరోనా అనంతరం అనారోగ్య సమస్యలతో చండీగఢ్ లోని పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (పిజీఐఎంఈఆర్) లో చికిత్స పొందుతూ శుక్రవారం అర్థరాత్రి తుది శ్వాస విడిచారు.

Legendary Sprinter Milkha Singh passed away
Legendary Sprinter Milkha Singh passed away

గత నెల 20న మిల్కా సింగ్ కు కరోనా పాజిటివ్ నిర్ధారణ అయ్యింది. దీంతో మే 24న మొహాలీలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేరి చికిత్స పొందారు. చికిత్స అనంతరం నెగటివ్ రిపోర్టు రావడంతో మే 30వ తేదీన ఆసుపత్రి నుండి డిశ్చార్జ్ అయ్యారు. తరువాత ఆక్సిజన్ లెవల్స్ పడిపోవడంతో ఈ నెల 3వ తేదీన చండీగఢ్ లోని పిజీఐఎంఈఆర్ లో చేర్పించారు. ఆ రోజు నుండి అక్కడే చికిత్స పొందుతూ శుక్రవారం రాత్రి కన్నుమూశారు. మిల్కాసింగ్ భార్య నిర్మల్ కౌర్ కరోనా వైరస్ తో పోరాడుతూ ఈ నెల 14వ తేదీన మృతి చెందారు. భార్య మృతి చెందిన అయిదు రోజులకే ఆయన కన్నుమూయడంతో కుటుంబం తీవ్ర విషాదం నెలకొంది. ఆయనకు ముగ్గురు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు.

Read More: YS Viveka Case: ఇక అరెస్టులకు సిద్ధం..! హత్య కేసులో సీబీఐ దారిలోకి వచ్చినట్టే..!!

1932 నవంబర్ 20న జన్మించిన మిల్కాసింగ్ 1951లో భారత సైన్యంలో చేరారు. ఆర్మీ నిర్వహించిన పరుగుల పందెంలో మిల్కాసింగ్ ఆరవ స్థానంలో నిలిచారు. అనంతరం అథ్లెట్ గా మారారు. మిల్కాసింగ్ 9 ఏళ్ల పాటు హైదరాబాద్ (సికింద్రాబాద్) లో శిక్షణ పొందారు. అనంతరం 1958 కామన్ వెల్త్ గెమ్స్ లో స్వర్ణ పతకం కైవశం చేసుకుని తన సత్తా చాటారు. అనంతరం టోక్యో, జకార్తా, ఆసియా క్రీడల్లో నాలుగు స్వర్ణ పతకాలు సాధించారు. 1960లో రోమ్ లో జరిగిన ఒలింపిక్స్ లో 400 మీటర్ల విభాగంలో నాల్గవ స్థానంలో నిలిచారు. 1959 లో భారత ప్రభుత్వం మిల్కాసింగ్ కు పద్మశ్రీ పురస్కారంతో సత్కరించింది. మిల్కా సింగ్ జీవితాన్ని ఆదర్శంగా చేసుకుని “భాగ్ మిల్క్ భాగ్” అనే బాలీవుడ్ చిత్రం వచ్చిన సంగతి తెలిసిందే. మిల్కాసింగ్ మృతితో క్రీడాలోకం మూగబోయింది.

 

మిల్కాసింగ్ మరణ వార్త తెలియగానే రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్,   ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ, హోంశాఖ మంత్రి అమిత్ షా,  పశ్చిమ బెంగాల్, పంజాబ్ సీఎంలు మమతా బెనర్జీ, కెప్టెన్ అమరీందర్ సింగ్ దిగ్భాంతి గురయ్యారు. గొప్ప వ్యక్తిని కోల్పోయామని ట్విట్టర్ వేదికగా కుటుంబ సభ్యులకు సంతాపం వ్యక్తం చేశారు.

 

author avatar
sharma somaraju Content Editor

Related posts

Telangana Congress: ఖమ్మం లోక్ సభ కాంగ్రెస్ అభ్యర్ధిగా రఘురామిరెడ్డి .. ఎవరీ రఘురామిరెడ్డి..?

sharma somaraju

Breaking: ఏపీ ఇంటెలిజెన్స్ చీఫ్ గా విశ్వజిత్, విజయవాడ సీపీగా రామకృష్ణ

sharma somaraju

YS Jagan: వైసీపీ మ్యానిఫెస్టో ఎలా ఉంటుందో చెప్పిన సీఎం జగన్

sharma somaraju

Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?

sharma somaraju

AP High Court: వాలంటీర్ల రాజీనామాల పిటిషన్ పై హైకోర్టులో విచారణ ..కౌంటర్ దాఖలునకు ఈసీకి నోటీసులు

sharma somaraju

YSRCP: కూటమికి బిగ్ షాక్ .. జగన్ సమక్షంలో కీలక నేతలు వైసీపీలో చేరిక

sharma somaraju

Ravi Teja: కేవ‌లం 5 రోజుల్లో షూటింగ్ పూర్తి చేసుకుని బాక్సాఫీస్ వ‌ద్ద హిట్ గా నిలిచిన ర‌వితేజ సినిమా ఏదో తెలుసా!

kavya N

చిన్న‌మ్మ దెబ్బ‌తో ఏపీ క‌మ‌లంలో క‌ల్లోలం… పెద్ద ముస‌లం…!

Bhimaa: మ‌రికొన్ని గంట‌ల్లో ఓటీటీలోకి వ‌చ్చేస్తున్న గోపీచంద్ భీమా.. స్ట్రీమింగ్ డీటైల్స్ ఇవే!

kavya N

Kiara Advani: కియారా అద్వానీ న‌టి కాక‌ముందు డ‌బ్బు కోసం ఎలాంటి ప‌నులు చేసేదో తెలిస్తే షాకైపోతారు!

kavya N

Stone Attack On Jagan: జగన్ పై హత్యాయత్నం కేసులో నిందితుడి కస్టడీకి కోర్టు అనుమతి ..షరతులు ఇవి

sharma somaraju

Supreme Court: మరో సారి బహిరంగ క్షమాపణలు చెప్పిన పతంజలి ..సుప్రీం కోర్టులో విచారణ వాయిదా

sharma somaraju

Varsham: వ‌ర్షం మూవీలో అస‌లు హీరోయిన్ త్రిష కాదా.. మొద‌ట అనుకున్న‌ది ఎవ‌ర్ని..?

kavya N

Pawan Kalyan: ప‌వ‌న్ క‌ళ్యాణ్ అప్పులు అక్ష‌రాల రూ. 64.26 కోట్లు.. మ‌రి ఆస్తుల విలువెంతో తెలుసా?

kavya N

ఇద్ద‌రు బీసీల మ‌ధ్య‌లో రెడ్డి… తెలంగాణ‌లో ఆ ఎంపీ సీట్లో విన్న‌ర్ ఎవ‌రో…?