చట్ట సభల్లో ప్రజా ప్రతినిధులు ఇష్టానుసారం వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. తమ హోదా, వయసు మరిచి ఒకరిపై మరొకరు దూషించుకోవడం, అన్ పార్లమెంటరీ మాట్లాడటం చూస్తునే ఉన్నాం. ఒక్కో సారి చొక్కాలు పట్టుకుని కొట్టుకునేందుకు కూడా వెనుకాడటం లేదు. అధికార విపక్షాల మధ్య మాటల యుద్దంలో సభ్యులు పదునైన పదజాలాన్ని ఉపయోగిస్తుంటారు. అయితే పార్లమెంట్ నిబంధనల ప్రకారం కొన్ని పదాలను సభలో ఉపయోగించడంపై నిషేదం ఉంది. తాజాగా పార్లమెంట్ లో ఉపయోగించకూడదని పదాల జాబితాను లోక్ సభ సెక్రెటేరియట్ విడుదల చేసింది. ఈ నెల 18వ తేదీ నుండి జరిగే పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో లోక్ సభ, రాజ్యసభ లో ఎంపీలు కొన్ని పదాలను వాడకూడదని లోక్ సభ సెక్రటేరియట్ ఒక బులిటెన్ విడుదల చేసింది. పలు అభ్యంతరకర పదాలను అందులో పేర్కొంది. వీటిని సభ్యులు ఎవరూ వాడకూడదని స్పష్టం చేసింది.
అవినీతిపరుడు, అసమర్ధుడు, నాటకం, నటన, సిగ్గులేదు. ధోకేబాజ్ వంటి పదాలను అన్ పార్లమెంటరీ పదాలుగా గుర్తించింది. బ్లడ్ షెడ్, బ్లడీ, బీబ్రేడ్, అషేమ్డ్, అబ్యూస్డ్, చీటెడ్, కరప్ట్, కవర్డ్, క్రిమినల్, క్రొకొడైల్ టియర్స్, డాంకీ, డ్రామా, ఐవాష్, హులిగనిజం, హిపోక్రసీ, మిస్ లీడ్, లై అన్ ట్రూ, కోవిడ్ స్ప్రెడర్, స్నూప్ గేట్ వంటి ఇంగ్లీషు పదాలను ఆ జాబితాలో చేర్చింది. వీటితో పాటు చంచా, అప్ మాన్, కాలా బజారీ, దలాల్, దాదా గిరీ, బేచారా, బాబ్ కట్, లాలీపాప్, విశ్వాస్ ఘాత్, బేహ్రీ సర్కార్, జుమ్లాజీవీ, శకుని వంటి హిందీ పదాలు కూడా బుక్ లెట్ లో పొందుపర్చారు. అయితే ఇలాంటి పదాలు వాడిన సభ్యుడిపై ఎలాంటి చర్యలు తీసుకోవాలన్న అధికారం లోక్ సభ, రాజ్యసభ అధిపతులకే ఉంటుందని లోక్ సభ సెక్రటేరియట్ పేర్కొంది.
అయితే లోక్ సభ సెక్రటేరియట్ విడుదల చేసిన తాజా జాబితాపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అత్యంత సాధారణంగా ఉపయోగించే పదాలను సైతం మాట్లాడకూడదని చెప్పడం సరికాదని టీఎంసీ ఎంపి డెరెక్ ఒబ్రెయిన్ అన్నారు. దీనిపై ఆయన ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ వాటిని తాను ఉపయోగిస్తాననీ, అవసరమైతే సస్పెండ్ చేసుకోవచ్చని సవాల్ విసిరారు ఒబ్రెయిన్.
ఆసుపత్రిలో చేరిన తమిళనాడు సీఎం స్టాలిన్ .. ఎందుకంటే..?