Lock Down:: రేపటి నుండి ఆ రాష్ట్రంలోనూ లాక్ డౌన్..!!

Share

Lock Down: కోవిడ్ సెకండ్ వేవ్ ఉధృతి నేపథ్యంలో చాలా రాష్ట్రాలు లాక్ డౌన్ వైపు అడుగులు వేస్తున్నాయి. తాజాగా ఆ జాబితాలోకి పశ్చిమ బెంగాల్ చేరింది. ప్రస్తుతం పశ్చిమ బెంగాల్ లో కోవిడ్ కేసులు రోజురోజుకు పెరుగుతున్నాయి. తాజాగా 20 వేలకుపైగా పాజిటివ్ కేసులు నమోదు కాగా 136 మంది కరోనాతో మృతి చెందారు. కేసులు విపరీతంగా పెరుగుతున్న నేపథ్యంలో  ఈ నెల 16వ తేదీ నుండి 30వ తేదీ వరకూ లాక్ డౌన్ ను విధిస్తూ శనివారం పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. 16వ తేదీ ఆదివారం ఉదయం నుండి లాక్ డౌన్ నిబంధనలు అమలుల్లోకి వస్తాయని పేర్కొంది. పరిశ్రమలు, అంతర్గత రైళ్లు, బస్సులు, మైట్రో రైళ్లు వంటి అన్ని సేవలను మూసివేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది.

Lock Down west bengal
Lock Down west bengal

అయితే టీ తోటల్లో 50శాతం, జనపనార మిల్లుల్లో 30శాతం మంది కార్మికులు పని చేసేలా వెసులుబాటు కల్పించింది. అత్యవసర సేవలను అనుమతించడంతో పాటు ప్రజలు అవసరమైన వస్తువులు కొనుగోలుకు ప్రతి రోజు ఉదయం 7గంటల నుండి 10 గంటల వరకూ మూడు గంటల పాటు దుకాణాలు తెరిచి ఉండేలా అదేశాలు జారీ చేసింది.

 

మార్చి, ఏప్రిల్ నెలల్లో రాష్ట్రంలో ఎనిమిది దశల్లో అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించడం వైరస్ వ్యాప్తికి కారణం అయ్యిందని అధకారులు, ప్రజలు పేర్కొంటున్నారు. ఎన్నికల సమయంలో ఓటర్లను ఆకట్టుకునేందుకు వివిధ పార్టీల నేతలు విస్తృతంగా ప్రచారాలు నిర్వహించడం, కోవిడ్ ఆంక్షలను తుంగలో తొక్కి సభలు, ర్యాలీల్లో పెద్ద సంఖ్యలో జనాలు హజరైన విషయం తెలిసిందే.

ఏపిలోనూ లాక్‌డౌన్ దిశగా అడుగులు..

ఏపిలోనూ రోజుకు 20వేలకు పైగా కేసులు నమోదు అవుతున్నాయి. కొద్ది రోజులుగా కర్ఫ్యూ ఆంక్షలు అమలు చేస్తున్నా అంతగా ఫలితాలు కనబడటం లేదు. ఏపికి సరిహద్దుగా ఉన్న తెలంగాణ, కర్నాటక, తమిళనాడు, ఒడిస్సా రాష్ట్రాల్లో ఇప్పటికే లాక్ డౌన్ ఆంక్షలు అమలు చేస్తున్నాయి. తొలుత తెలంగాణ సీఎం కేసిఆర్ లాక్ డౌన్ ప్రతిపాదనలను వ్యతిరేకించినా పెరుగుతున్న పాజిటివ్ కేసుల నేపథ్యంలో లాక్ డౌన్ అమలు చేయకతప్పలేదు. ఇక ఏపి సీఎం వైఎస్ జగన్మోహనరెడ్డి కూడా లాక్ డౌన్ ప్రతిపాదనపై సానుకూలత లేకపోయినా లాక్ డౌన్ అంక్షలు అమలు చేస్తున్న రాష్ట్రాల్లో సత్ఫలితాలు వస్తున్న నేపథ్యంలో ఆ దిశగా అడుగులు వేయాలన్న ఆలోచన చేస్తున్నట్లు సమాచారం. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల అనంతరం లాక్ డౌన్ పై నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని భావిస్తున్నారు.

 


Share

Related posts

దేవాదాయ మంత్రి వెల్లంపల్లికి కరోనా పాజిటివ్ నిర్ధారణ

Special Bureau

ఆంధ్ర ప్రదేశ్ ప్రజలారా … ఇది మీకు బంగారం లాంటి వార్త !

sekhar

Anil Ravipudi: ఆ హీరోల కోసం బాలయ్య ప్రాజెక్టును పక్కన పెట్టిన అనిల్ రావిపూడి..!?

bharani jella