35.7 C
Hyderabad
March 28, 2023
NewsOrbit
జాతీయం న్యూస్

ఆదానీ అంశంపై చర్చకు కొనసాగుతున్న రగడ .. ఉభయ సభలు వాయిదా

Share

ఆదానీ గ్రుప్ తన షేర్లలో అవకతవకలకు పాల్పడుతోందని హిండెన్ బర్గ్ రీసెర్చ్ సంస్థ ఆరోపణలపై పార్లమెంట్ లో చర్చ జరపాలని విపక్షాలు .. సోమవారం కూడా డిమాండ్ చేశాయి. సంయుక్త పార్లమెంటరీ కమిటీ ఏర్పాటు చేయాలని పట్టుబట్టాయి. విపక్షాలు ఇచ్చిన వాయిదా తీర్మానాలను లోక్ సభలో స్పీకర్ ఓంబిర్లా, రాజ్యసభ లో చైర్మన్ జగదీప్ ధన్ ఖడ్ తోసిపుచ్చారు. దీంతో ఉభయ సభలు గందరగోళంగా మారాయి. సభ్యుల ఆందోళన నేపథ్యంలో మధ్యాహ్నం రెండు గంటల వరకు ఉభయ సభలు వాయిదా పడ్డాయి. లోక్ సభలో స్పీకర్ ఓంబిర్లా, రాజ్యసభ చైర్మన్ జగదీప్ ధన్ ఖడ్ లు ప్రకటించారు. తొలుత కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఛాంబర్ లో విపక్షాలు భేటీ అయ్యాయి. ఉభయ సభల్లో వాయిదా తీర్మానం ఇవ్వాలని నిర్ణయించుకున్నాయి. ఆ తర్వాత పార్లమెంట్ ఆవరణలో ఉన్న గాంధీ విగ్రహం వద్ద ప్రతిపక్ష పార్టీల ఎంపీలు నిరసన తెలిపాయి. ఆదానీ గ్రూపు సంస్థల్లో అవినీతి ఆరోపణలపై సమగ్ర విచారణకు డిమాండ్ చేశారు.

Parliament Session

 

Read More: గుంటూరు తరహా దుర్ఘటనే తమిళనాడులో.. నలుగురు మహిళలు దుర్మరణం.. నిర్వహకులు జర జాగ్రత్త

ఈ సందర్భంగా ఖర్గే మీడియాతో మాట్లాడుతూ .. తమ నోటీసులప చర్చకు డిమాండ్ చేస్తున్నామన్నారు. రాష్ట్రపతి ప్రసంగంపై మాట్లాడేందుకు సిద్దంగానే ఉన్నామనీ, అయితే ఆదానీ సమస్యపై ప్రధాని మోడీ సమాధానం చెప్పాల్సిందేనన్నారు. ఆదానీ అంశాన్ని లేవనెత్తవద్దనీ, చర్చించవద్దని ప్రభుత్వం కోరుతోందనీ, దాచేందుకు ప్రయత్నిస్తుందని ఖర్గే అన్నారు. ఆదానీ షేర్ల పతనం అంశంపై చర్చ చేపట్టాలని విపక్షాలు పట్టుబడుతున్న కారణంగా గత మూడు రోజులుగా ఉభయ సభలు దద్దరిల్లుతున్నాయి. ఈ ఆందోళన నేపథ్యంలో సభల్లో ముందుగా నిర్ణయించుకున్న కార్యకలాపాలు సాగడం లేదు.

Read More:  Breaking: ఎమ్మెల్యేల కొనుగోలు కేసు సీబీఐకే .. తెలంగాణ హైకోర్టు పచ్చజెండా .. సర్కార్ కు షాక్

 


Share

Related posts

కరోనాపై కేంద్ర మంత్రి పెద్ద బాంబ్..!!

Special Bureau

బిగ్ బాస్ క్రేజ్ బాగా క్యాష్ చేసుకుంటున్న ఆ ముద్దుగుమ్మ..!!

sekhar

మరో 12 చీతాలు వచ్చేశాయోచ్ .. కునో పార్క్ లో విడుదల చేసిన సీఎం చౌహాన్..

somaraju sharma